రేపు వైసీపీ అధికారంలో వ‌స్తే.. ఎస్పీలో భ‌యం!

అనంత‌పురం ఎస్పీపి.జ‌గదీశ్‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌

అనంత‌పురం ఎస్పీపి.జ‌గదీశ్‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌త రెండేళ్లుగా ఎస్పీకి ఎన్నో ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. రేపు వైసీపీ అధికారంలోకి వ‌స్తే, ఏదో అవుతుంద‌ని ఎస్పీ భ‌య‌ప‌డుతున్న‌ట్టున్నార‌ని ఆయ‌న అన్నారు.

ఇవాళ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్పీ విష‌యంలో ఎక్క‌డో ఏదో జ‌రిగింద‌న్నారు. బాగానే వున్నాడ‌న్నారు. ఎస్పీని న‌మ్మి మోస‌పోయాన‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎస్పీ మ‌ర్యాద‌ల‌కు తాను ఒక పిచ్చోడిలా త‌యార‌య్యాయ‌ని వ్యంగ్యంగా అన్నారు.

పెద్దారెడ్డిని ఎందుకు ప‌ట్టుకురార‌ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ప్ర‌శ్నించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటే మీకు ఎందుకంత స‌న్నిహితం అని ఎస్పీని జేసీ ప్ర‌శ్నించారు. వైసీపీ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌నే ఆందోళ‌న ఎస్పీలో క‌నిపిస్తున్న‌ట్టు తాను భావిస్తున్నాన‌ని ఆయ‌న తెలిపారు.

ఎస్పీ చాలా యువ‌కుడ‌ని, ఇక్క‌డ కాక‌పోతే మ‌రెక్క‌డికైనా వెళ్లొచ్చ‌న్నారు. ఎస్పీ అయిన మీకెందుకు భ‌యం వుంటుంద‌ని జేసీ అన్నారు. వైసీపీ అంటే మీరు భ‌య‌ప‌డుతున్నార‌ని మ‌రోసారి ఎస్పీని ఉద్దేశించి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అన్నారు.

గుత్తిలో, పులివెందుల‌లో అంత ఘోరం జ‌రిగితే ఏం చేశార‌ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ఆ రోజు మీలాంటి పోలీస్ ఆఫీస‌ర్లు ఇష్టానుసారం చేయ‌డం వ‌ల్లే ఈ దేశానికి దుస్థితి వ‌చ్చింద‌న్నారు. మొత్తం వ్య‌వ‌స్థ అంతా ఐపీఎస్ అధికారుల తీరు వ‌ల్లే దెబ్బ‌తింద‌న్నారు.

ఇవాళ ప్ర‌తి ఒక్క‌రూ పోలీస్ వైపు వేళ్లు చూపిస్తున్నార‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. తాము చేయాల్సిన ప‌ని మీరే చేస్తున్నార‌ని ఎస్పీని ఉద్దేశించి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఘాటు విమ‌ర్శ చేశారు. కొంద‌రితో ఎస్పీ డీల్ చేసుకోవ‌డం లేదా భ‌యప‌డుతున్నార‌ని ఎస్పీపై ఆరోప‌ణ‌లు గుప్పించారు.

One Reply to “రేపు వైసీపీ అధికారంలో వ‌స్తే.. ఎస్పీలో భ‌యం!”

  1. Next ఎలక్షన్ వైస్సార్సీపీ వస్తే వస్తుంది ఇంకా జేసీ కూడా పోతాడు మళ్ళీ వారి కుమారుల పరిస్థితి ఏంటో 

Comments are closed.