ఇప్పటికే ఆదర్శ కుటుంబం సినిమాపై, దర్శకుడు త్రివిక్రమ్‌పై ఓ రేంజ్లో ట్రోలింగ్ నడుస్తోంది. కొంతమంది పరోక్షంగా, మరికొంతమంది ప్రత్యక్షంగానే త్రివిక్రమ్ పనీతీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిజంగా ఈ సినిమాలో ఈ పాట ఉంటే, త్రివిక్రమ్ పరువు మరింత పోయి ఉండేది. కానీ ఆఖరి నిమిషంలో ఆ పాట లేపేశారు.
అలా లేపేసిన పాటను తాజాగా యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఆ పాట చూసిన జనం, ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమా నుంచి పాటను తీసి మంచి పని చేశారంటూ ఎడిటర్‌ను మెచ్చుకుంటున్నారు. పాట ఉన్నట్టయితే మరింత పరువు పోయేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ పాటలో ఏముందంటే.. నివేత పెతురాజ్‌తో వెంకటేశ్ రొమాన్స్ ఉంది. నలగాలి పూలు, ఒళ్లు.. అరవాలి మంచం కోళ్లు లాంటి పదబంధాలున్నాయి. సింగిల్‌గా ఎన్నాళ్లిలా, ఎదురింట్లోనే ఉన్నాను, చిటికేస్తా వస్తానంటూ సాహిత్యం ఉంది. లెట్స్ బ్రేక్ ది బెడ్స్, లెట్స్ కలిపి నలిపి లాంటి రీమిక్స్‌లు కూడా ఉన్నాయి.
వీటన్నింటికీ పైన నివేత పెతురాజ్ అందాలున్నాయి. నిజానికి ఇవన్నీ ఇప్పటి సినిమాల్లో కామన్ అనుకోవచ్చు చాలామంది. కానీ త్రివిక్రమ్ సినిమాలో కామన్ కాదు. పైగా సినిమా కథ ప్రకారం అస్సలు కామన్ కాదు. పాటలో కనిపిస్తున్న నివేత, సినిమాలో వెంకీ భార్య కూడా కాదు.
ఇప్పటికే సినిమాలో నివేత పాత్ర చిత్రీకరణపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భర్త దుబాయ్‌లో ఉన్నాడంటూ చెప్పిన డైలాగ్ వివాదాస్పదమైంది. అలాంటి టైమ్‌లో ఈ పాట కూడా సినిమాలో పెట్టుంటే, మరింత వివాదాస్పదమయ్యేదనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆదిత్య మ్యూజిక్ వాళ్లు పాటలు రిలీజ్ చేసేస్తున్నారు. దానికి వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. అదే టైమ్‌లో వ్యూస్‌తో పాటు విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. కాకపోతే వ్యూస్ ఆదిత్య మ్యూజిక్‌కి, విమర్శలు త్రివిక్రమ్‌కి.

Ippudu lechavaaa