పొత్తుబంధమే వారి బలహీనత!

బలమైన పొత్తు బంధం కాదిది. బలవంతపు బంధం. ఒక బంధాన్ని ఇంత బలవంతంగా ఎంత దూరం కొనసాగించగలరు? కాలమే జవాబు చెప్పాలి.

ఇద్దరు వ్యక్తుల మధ్య పదిలమైన స్నేహం ఏర్పడాలంటే.. వారి మధ్య ఏదో ఒక సారూప్యత ఉండాలి. ఇద్దరికీ ఒకే రకమైన బుద్ధులు, ఒకే రకమైన అలవాట్లు, ఇష్టాయిష్టాలు, అభిరుచులు.. ఏదో ఒక విధంగా వారి మధ్య మ్యాచ్ అయ్యే ఎలిమెంట్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే వారు మంచి స్నేహితులుగా కొనసాగుతారు.

స్నేహబంధానికి పటిష్టమైన పునాదిగా సారూప్యత నిలబడుతుంది. కానీ.. ఒక సంకుచితమైన అవసరం కోసం, మరొకరి పట్ల ద్వేషంతోనో బలవంతంగా ముడిపడే బంధాలు కలకాలం నిలబడవు.

ఆ అవసరం తీరిపోయిన వెంటనే, ఆ ద్వేషం చల్లారిపోయిన వెంటనే, లేదా, ద్వేషించిన వ్యక్తి పతనం కళ్లజూసిన వెంటనే ఆ స్నేహబంధం కూడా పుట్టుక్కుమని తెగిపోతుంది.

సార్వజనీనమైన ఈ సిద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలకు అనువర్తింపజేసి చూసుకుంటే మనకు ఏం అనిపిస్తుంది. ఎన్డీయే కూటమి పేరుతో.. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల మధ్య కుదిరిన మైత్రీ బంధం ఇలాంటి పొత్తే కదా? అనిపిస్తుంది.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే.. ఈ పొత్తుబంధంలో ఎంతటి డొల్లతనం ఉన్నదో చాలా రూపాల్లో బయటపడింది.

ఇప్పుడు పార్టీ గుర్తులు కూడా లేని సర్పంచి ఎన్నికల పర్వం షురూ అయిన తర్వాత.. మరింతగా ఎన్డీయే కూటమి పార్టీల మధ్య బలవంతంగా కొనసాగుతున్న పొత్తుబంధమే వారి అసలు బలహీనత అని మనకు అర్థమవుతుంది.

ఈ వీక్ పాయింట్ ను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇంకో ఉదాహరణ చెప్పుకుందాం.

ఒక వ్యక్తి స్వీట్ షాప్ పెట్టాలని అనుకున్నాడు. ఆ షాప్ సవ్యంగా నడిచి, ఆ వ్యాపారంలో అతను లాభాలు గడించి ఎదగాలంటే.. ఏమేం కావాలి? అన్నింటికంటె ముందుగా.. స్వీట్ షాప్ వ్యాపారంపై అతనికి మక్కువ, ప్యాషన్ ఉండాలి. స్వీట్స్ తయారుచేయడం అతనికి చేతనై ఉండాలి.

తాను మంచి రుచికరమైన స్వీట్స్ తయారుచేసి.. ఊళ్లో వాళ్లకి అమ్మి.. వారి మన్ననలు పొందాలనే కోరిక ఉండాలి. ఇలాంటి లక్షణాలకు భిన్నంగా- తన శత్రువు ఒకడు స్వీట్ షాప్ వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నాడు గనుక.. వాడిని దెబ్బ కొట్టడానికి తాను కూడా ఒక స్వీట్ షాప్ పెట్టి.. వాడి వ్యాపారాన్ని నాశనం చేసేద్దాం అనే లక్ష్యంతో ప్రారంభిస్తే ఏమవుతుంది?

ఇందులో రెండు రకాల ప్రమాదాలున్నాయి. ఆ వ్యాపారంలో అతడు సక్సెస్ అయి శత్రువును నాశనం చేశాడనుకోండి.. ఇక అతడికి తన వ్యాపారం మీద కూడా శ్రద్ధ పోతుంది! శత్రువును దెబ్బకొట్టడం తనకు సాధ్యమయ్యే పని కాదని కొన్నాళ్లకు అర్థమయ్యిందనుకోండి.. అప్పుడు కూడా వ్యాపారం పట్టించుకోడు. గాలికి వదిలేస్తాడు! అంటే సంకుచితమైన లక్ష్యాలతో చేసే పనులు నిలకడగా రాణించవు- అనే నీతి అర్థం చేసుకోవాలి.

ఎన్డీయే కూటమి బంధం కూడా అలాంటిదే. తెలుగుదేశం- జనసేన- బిజెపి.. ఈ పార్టీల మధ్య ఏ కొంచెమైనా భావసారూప్యత ఉందా? అచ్చమైన పెత్తందారీ భూస్వామ్య దురహంకార నయవంచక రాజకీయ పోకడలకు నిదర్శనం తెలుగుదేశం.

తాను నక్సలైటునని, నక్సలైట్లలో పనిచేయాలనుకున్నానని, పుట్టుకతో తాను కమ్యూనిస్టునని రకరకాలుగా తన గొప్పలు చెప్పుకున్న వ్యక్తి జనసేనాని పవన్ కల్యాణ్. కరడుగట్టిన యాంటీ కమ్యూనిజం కాషాయదళం బిజెపి. వీరి మధ్య ఏమాత్రమైన భావసారూప్యత ఉందా?

ఒకప్పుడు నరేంద్రమోడీని గానీ, 2019 ఎన్నికలకు ముందు కేంద్రంలోని బిజెపిని, మోడీ నాయకత్వాన్ని గానీ.. చంద్రబాబునాయుడు ఎన్ని రకాలుగా తిట్టిపోశారో తెలుగు ప్రజలు మర్చిపోయారా? ఈ ఇద్దరు నాయకులనూ పవన్ కల్యాణ్ ఎన్ని తిట్టారో, వారి అసమర్థతల్ని, తెలుగురాష్ట్రానికి చేసిన ద్రోహాల్ని తానెలా పొలికేకలద్వారా పవన్ కల్యాణ్ చెప్పాడో ప్రజలు విస్మరించారా? కానీ.. వారి మధ్య ఇప్పుడు మైత్రీ బంధం నడుస్తోంది.

ఈ బంధం ఎలా పుట్టింది. అధికారదాహం అనే అవసరం కోసం పుట్టింది. జగన్ పట్ల విద్వేషం, జగన్ పతనం అనే లక్ష్యం కోసం పుట్టింది. ముందే చెప్పుకున్నట్టు సంకుచిత లక్ష్యాలతో ఏర్పడిన బంధాలు కలకాలం కొనసాగవు. ఇప్పటికి రెండున్నరేళ్లు గడిచాయి.. అనేక లుకలుకలు కనిపిస్తూనే ఉన్నాయి. గుర్తులు లేని సర్పంచి ఎన్నికల వేళ కూడా అవి మరింతగా బయటకు వస్తున్నాయి.

తమ మధ్య ఉన్న ఐక్యత చాలా బలమైనదని, మరో పదిహేనేళ్లపాటు ఇది కొనసాగుతూనే ఉంటుందని.. ఈ మూడు పార్టీల నాయకులు ప్రవచనాలు చెబుతూ ఉంటారు.

అరవింద సమేత సినిమాలో పవన్ కల్యాణ్ రాజకీయ స్క్రిప్ట్ రైటర్.. త్రివిక్రమ్ రాసిన మంచి డైలాగు ఒకటుంది. ‘నువ్వు ఏదైతే చెప్తావో.. అది నువ్వు కాదు’ అని హీరోయిన్ అంటుంది.

ఈ నాయకులు తమ ఐక్యత గురించి చెప్పే మాటలు వింటే ఆ డైలాగే గుర్తుకొస్తుంది. తమ మధ్య లుకలుకల్ని ప్రజలు ఎక్కడ గుర్తించేస్తారో అనే భయం వారిని నిత్యం వెన్నాడుతున్నదా అనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రతిసారీ.. అయినదానికీ కానిదానికీ.. మేం చాలా ఐక్యంగా ఉన్నాం.. ఈ పొత్తు బంధం కొన్ని దశాబ్దాలు ఉంటుంది.. అని వాళ్లు చెప్పుకుంటూనే ఉన్నారు.

మొన్నమొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, బిజెపి అభ్యర్థులను తెలుగుదేశం వారు ఏ రకంగా ఓడగొట్టారో అందరూ చూశారు. ఇప్పుడు ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ఎన్నికలు వచ్చినప్పుడు ట్విస్టు ఏంటంటే.. జనసేన వారిని జనసేన వారే ఓడించుకున్నారు. అదికూడా జనసేనాని పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గంలోనే!

ఏదో తెలుగుదేశం దయతో అక్కడినుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. డిప్యూటీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు తప్ప.. పవన్ కల్యాణ్ కు తన సొంతనియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తల మీద ఏ మాత్రం పట్టు ఉన్నదో.. ఆయన ఎంత వీక్ నాయకుడో ఈ ఒక్క ఉదాహరణ తేటతెల్లం చేస్తుంది.

అవన్నీ పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు. ఇప్పుడు పార్టీల ముద్ర బహిరంగంగా కనిపించని సర్పంచి ఎన్నికలు జరగబోతున్నాయి. అయినా కూటమి పార్టీల లుకలుకలు మాత్రం షరా మామూలే. ఈ మూడు పార్టీల్లోనే ఒకరికి వ్యతిరేకంగా మరొకరు లోకల్ గా ధర్నాలు చేసుకుంటున్నారు.

విమర్శలు గుప్పిస్తున్నారు. పోరాటాలు నడుస్తున్నాయి. వీరి ఐక్యతను హాస్యాస్పదంగా ప్రజల ముందు నిరూపిస్తున్నాయి. ఇంకో తమాషా ఏంటంటే.. సర్పంచి ఎన్నికలు.. పార్టీ రహితంగా జరగడమే పెద్ద కామెడీ.

ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే.. అధికార పార్టీ వారు ఒత్తిళ్లు, ప్రలోభాల ద్వారా లోబరచుకుని తమ పార్టీ కండువా కప్పేసి.. తమ పార్టీ ముద్ర వేసేసి.. రాష్ట్రమంతా తమ పార్టీనే గెలిచినట్టుగా టముకు వేసుకుంటారు. అనల్పమైన ఆత్మవంచనతో మురిసిపోతారు. ప్రజలను మభ్యపెట్టామని అనుకుంటూ తమను తాము మోసం చేసుకుంటారు.

కానీ.. ఇక్కడ అధికార కూటమిలోని మూడు పార్టీల వారూ.. తమ తమ ముద్ర చూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. పార్టీల గుర్తు లేకపోయినా కూడా.. తమ వ్యక్తిగత అహం, ఈగోలు కాపాడుకోవడానికి పార్టీల మధ్య ఉండే వైషమ్యాల్ని రచ్చకీడుస్తున్నారు.

డొల్లతనం నిండిన వీరి ఐక్యత ఇంకా కొనసాగుతున్నదంటే అందుకు ఒకే ఒక్క కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ అంటే ఉండే భయమే వారిని కలిపి ఉంచుతోంది. విడిపోతే.. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేం అనే భయం వారిలో తొలగిపోలేదు.

విడివిడిగా తమలో ఏ ఒక్కరికీ నిండైన ప్రజాదరణ లేదనే స్పృహ వారికి ఉంది. అందుకే అధికారదాహంతో.. వేరే గతిలేక ఒకరికొకరు మిత్రులుగా నటిస్తూ సాగుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

బలమైన పొత్తు బంధం కాదిది. బలవంతపు బంధం. ఒక బంధాన్ని ఇంత బలవంతంగా ఎంత దూరం కొనసాగించగలరు? కాలమే జవాబు చెప్పాలి.

.. వెంకట్ ఆరికట్ల

26 Replies to “పొత్తుబంధమే వారి బలహీనత!”

  1. ఇది బలవంతపు బంధమే కానీ తప్పదు ఎందుకంటే రాక్షసుడిని అంతం చేయాలి కాబట్టి 🤷‍♂️

  2. హ హ హ….పాపం ఫ్రస్ట్రేషన్ పీక్స్…ఎన్ని విధాలు గా ట్రై చేసినా విడిపోవడం లేదు అని …ఇలా ఆఖరి రాగం పాడేసా వెంకటి 

  3. అంటే పొత్తు అనే గొలుసు లో పవన్ కల్యాణ వీకేస్ట్ లింక్ అని , టీడీపీ అతన్ని వీక్ గ తయారు చేసిందని మీ అంచనా. దానివల్ల ఎవరికీ నష్టం? టీడీపీ కి, ఎవరికీ లాభం? జగన్ కి. ఈ మాత్రం అర్ధం చేసుకునే తెలివి బాబు కి లేదా?

    జగన్ అంటే మిగతా మూడు పార్టీలకు భయం అంటున్నారు, తప్పులేదు. కానీ ప్రజలకు కూడా భయమే ఎక్కడ గెలిస్తే రాష్ట్రము ఇంకా నాశనం అవ్వుద్దని. చెప్పొచ్చేది ఏంటంటే భయపెట్టడం వల్ల నష్టం ఎవరికీ? జగన్ కే.

  4. మనోడు “సింగిల్ షింహం”.. ఈ బిరుదు ఇలాగే ఉండాలంటే, వాళ్ళు ముగ్గురూ కలిసే ఉండాలి కదరా అరికట్ల ఎంకిటీ ? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ రా?

  5. మానవ సంబంధాలనే కాదు..తల్లీ చెల్లికి ర0కు అంటగట్టి కుటుంబ సంబంధాలను కూడా అత్యంత నీచ స్థాయికి దిగజార్చి పైచాచిక ఆనందం పొందుతూన్న A1పశువు..

  6. Differences are common among alliance partners.But they will move together.

    you are not happy because you want them to split . That’s your bad luck.

    even family members have differences but mostly they workout things.

    some will split.

    you know the example regarding who is filing cases against own family members.

  7. సొంత నియోజకవర్గం లో బీజేపీకి భయపడి నామినేషన్ కూడా వేయించలేని పిరికిసన్నాసి, కనీసం తన ఓటు కూడా వేయలేని   11లంగాగాడు రాష్ట్రం అంతా ప్రభంజనం సృష్టిస్తాడా? యా ఊర్రా నీది అరికట్లా? క్యామెడీ బాగా చేస్తుండావు..

  8. ఏ బంధం అయినా కొంతకాలం వరకే ఉంచుకోవడం ఇష్టం మన PKకి. అందుకే సేనతో అంటున్నాడంట: “ఇంకా చాలు, విడాకులిచ్చేద్దాం ఈ బంధానికి కూడా” అని. ఇప్పటికి ముగ్గురికి విడివిడిగా ఇచ్చాడు ఆ ఆకులు. ఈ అవినీతి బంధంలో కూడా ముచ్చటగా ముగ్గురే ఉన్నారు. ఇంకేం మరి? Sentiment కూడా work అవుతోంది. మరి వీళ్లకి విడివిడిగా ఇస్తాడా, కలిపి ఇస్తాడా అనేది తెలీదు. ఆయన ఆకులు.

  9. ఐకమత్యమే మహాబలం, చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లి చచ్చి ఉంటె ja*** గాడికి తెలిసేది అప్పుడు బోకులాగా తిరిగి ఇప్పుడు ఏడిస్తే ఎం ప్రయోజనం!!

  10. ఇప్పుడు కోస్తా లో పవన్ కాదు అని జగన్ సైడ్ కీ వెళ్ళుతుంది  కూటమి గా పొతే టీడీపీ కీ పెద్ద బొక్కే ఇప్పుడు 

  11. ఇప్పడు ముగ్గురు కలిసి ఉంటే నే జగన్ కీ అధికారం వచ్చేది విడిపోతే ప్రభుత్వం వెతిరేకంగా ఉండే వారు విడిపోతారు జగన్ కీ కష్టం 

  12. వాళ్ళు అంతా బలహీనులు అయితే మరి వాళ్ళు ఉన్న అసెంబ్లీ కి వెళ్లడానికి జంకు ఎందుకో

  13. నువ్వు ఎంత మొత్తుకున్నా వాళ్ళు పొత్తులో ఉంటారు..ముందు మన జగన్ అన్నని మోటివేట్ చెయ్యి

Comments are closed.