ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి నేడు ముహూర్తం నిర్ణయించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. తమ వైస్ చైర్మన్ అభ్యర్థిగా కె.శిరీషను పవన్‌కల్యాణ్ ఎంపిక చేశారు.
అయితే వైస్ చైర్మన్ ఎన్నికలో జనసేన అధిష్టానం నిర్ణయించిన శిరీషను కాదని పత్తి పద్మజను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎంపిక చేశారు. ఈ పరిణామం జనసేనకు మింగుడుపడలేదు.
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆ నియోజకవర్గ నేత నలిశెట్టి శ్రీధర్, ఆ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. వాళ్లందరినీ పోలీసులు లాక్కెళ్లారు. అలాగే జనసేన కౌన్సిలర్ శిరీషను సమావేశ మందిరంలో అనుమతించడంపై స్పష్టత రావాల్సి వుంది.
మరీ ముఖ్యంగా జనసేన అధిష్టానం వైస్ చైర్మన్ అభ్యర్థిగా బీ ఫామ్ ఇచ్చినప్పటికీ, ఆర్డీవో పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన ఇష్టానుసారం వైస్ చైర్మన్ అభ్యర్థిని ఎంపిక చేయడంపై జనసేన నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంలోనూ మంత్రి ఆనం తీరును జనసేన నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. పది కౌన్సిలర్ల సీట్లను జనసేన అడిగితే, కేవలం మూడునాలుగు సీట్లతోనే సరిపెట్టారు.
నామినేషన్ల దాఖలు సమయంలోనూ జనసేన అభ్యర్థుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వైస్ చైర్మన్‌గా పవన్ నిర్ణయించిన శిరీషను కాదని, పద్మజను టీడీపీ ఎంపిక చేయడం తీవ్ర విభేదాలకు దారి తీసే పరిస్థితి వుంది.
ఏది ఏమైనా మరో 15 ఏళ్లు చంద్రబాబు కోసమే పనిచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెబుతుంటే.. మరోవైపు తమకు జరుగుతున్న అన్యాయంపై జనసేన నేతలు పదేపదే మీడియా ముందుకు వస్తున్నారు.
మేము కూడా కూటమిలో భాగస్వాములమే కదా.. మాకు ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటూ ఓ జనసేన కౌన్సిలర్ కన్నీటిపర్యంతమయ్యారు.
పవన్ కల్యాణ్ ప్రకటించిన ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని వేరే వారికి కేటాయించారంటూ ఆవేదన
— greatandhra (@greatandhranews) November 23, 2026

ఈ సారి AP ఎక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ లు జరగలేదు .. జస్ట్ పార్టీ నామినేటెడ్ పదవులు లాగ చేసేసుకున్నారు . ఈ లోకల్ ఎలక్షన్ కి ముందు ఎక్కడ పెద్దగా వ్యతేరేకత కనిపించలేదు కూటమి పరిపాలనలో చిన్న చిన్న అసంతృప్తి తప్పితే .. కానీ ఎలక్షన్ తరువాత మొత్తం మారిపోయింది .. జస్ట్ జగన్ బెటర్ కూటమి కంటే అని ప్రజలు విశ్లేసించుకోవడం నేను విన్నాను . నాకు తెలిసి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో పలమనేరు నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లావరకు ల్యాండ్ స్లయిడ్ విక్టరీ జగన్ కి . ఉత్తరాంధ్ర లో తిరిగిన తరువాత నెక్స్ట్ నా అప్డేట్ ఇస్తాను.
ఏమి సాధించారు బలవంతగా పదువులు లాగేసుకొని . మీకు సి గ్గు అనేది ఉంటె మీ పెళ్ళాలు ఉచ్చ పోసిన గుంత లో దూకి సావండి ముగ్గురు.
ముగ్గురు ki.. ఏమి సాధించారు బలవంతగా పదువులు లాగేసుకొని . మీకు సి గ్గు అనేది ఉంటె మీ పెళ్ళాలు ఉ చ్చ పోసిన గుంత లో దూకి సావండి .
సరి పోదు GA.పవన్ నిర్ణయించాడు అని పదే పదే మీ రాతలు లో ఎగదోసిద్దేం అనే అలో చానే కనిపిస్తుంది.
Poni Pawan garu nirnayinchaleda ni cheppamanandi. Ika ee godava undadu
Poni Pawan garu nirnayinchaleda ni cheppamanandi. Ika ee godava undadu
ఏమైనా చేసుకోండి మీ కూటమి మాకు విడిపోకుండా ఉండాలి కలిసి ఒదించడం కావాలి మాకు
పవన్ మేలుకోకుంటే జగన్ సీఎం అవ్వటం ఖాయం