రామాయణ పార్ట్-1లో విజువల్స్‌కు మంచి స్పందన వస్తోంది. అద్భుతమైన విజువల్స్ చూపించారని అంతా మెచ్చుకుంటున్నారు. ఈ దృశ్యాల వెనక గ్రాఫిక్ మాయాజాలం ఎంత ఉందో, ఖరీదైన సెట్స్, ఆభరణాల ప్రాధాన్యత కూడా అంతే ఉంది.
సినిమాలో నటీనటుల ఆభరణాలు, యాక్సెసిరీస్‌ను బంగారంతో తయారుచేశారు. మరీ ముఖ్యంగా రావణుడి పాత్ర కోసం భారీగా ఖర్చు చేశారు.
యశ్ రావణుడిగా నటించగా, రావణ సింహాసనం కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారు. పూర్తిగా బంగారం రేకుతో నగిషీలు చేయించి ఈ సింహాసనాన్ని రూపొందించారు. దీని కోసం 4 నెలలు శ్రమించారు.
అంతేకాదు, రావణుడి పాత్ర కోసం ఏకంగా 4వేల రకాల ఆభరణాలు తయారుచేశారు. వీటిలో షూటింగ్ కోసం వాడిన ఆభరణాలకు కూడా బంగారాన్ని తాపడం చేశారు. అందుకే తెరపై ఆ దృశ్యాలు అంత రిచ్‌గా వచ్చాయంటున్నారు మేకర్స్.
ఇక శుర్పనఖ రథం కోసం ఏకంగా కోటిన్నర ఖర్చు చేశారు. దీన్ని కూడా బంగారు రేకులతో తాపడం చేశారు. రాముడి కుటీరం దగ్గరకు శూర్పణఖ వచ్చే సన్నివేశం కోసం వాడిన ఈ బంగారు రథం.. పనిచేసే స్థితిలో ఉండాలి కాబట్టి దీని కోసం 3 నెలల కష్టపడ్డారు.
ఇక రావణుడి పుష్పక విమానం మోడల్‌ను ఎంత పెద్దగా తయారు చేశారంటే, దాన్ని సెట్‌లోకి తీసుకురావడానికి 4 భాగాలు చేశారు. లోపలకు తీసుకొచ్చిన తర్వాత తిరిగి కలిపారు. ఈ చిత్రానికి మొత్తంగా 18 మంది ఆర్ట్ డైరెక్టర్లు పనిచేశారు. ముంబైలోని ఫిల్మ్ సిటీలో అత్యధికంగా 150 సెట్లు నిర్మించారు.
కేవలం విజువల్ ఎఫెక్టుల మీద ఆధారపడకుండా, ఇలా సెట్స్, ప్రాపర్టీస్, నగలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో.. తెరపై గ్రాండియర్ లుక్ వచ్చింది.

అది ఖర్చు కాదు బంగారమ్ మీద ఇన్వెస్ట్మెంట్ 😂, ఎదో బ్లాక్ 2 వైట్ మాయ
Yeah! Lets talk about the riches and not rant on the content N make thefools happy
శూర్పణఖ. nee istam vachinattu raasi telugu ki tegulu pattinchaku..Prasadgaaru yentidi chooskovaligaa meeru 🙂
శూర్పణఖ. nee istam vachinattu raasi ****telugu***** ki *****tegulu*?*** pattinchaku..*****Prasadgaaru**** yentidi chooskovaligaa meeru 🙂
వారు పెట్టిన ఖర్చు చిత్రం లో కనిపిస్తోంది తప్పేం లేదు వారి లెక్కలు వాళ్ళవి