మూవీ రివ్యూ: సమ్మర్ హాలీడేస్

మొత్తంగా ‘సమ్మర్ హాలీడేస్’ అనేది పల్లెటూరు, పచ్చదనం, మానవీయ విలువలు, బాధ్యత, మట్టివాసన నేపథ్యంలో సాగే ఓ సింపుల్ సినిమా.

సినిమా: సమ్మర్ హాలీడేస్
రేటింగ్: 2.5/5
బ్యానర్: ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, వీజీబీ ఫిల్మ్స్
నటీనటులు:  రోహన్, అరుణ్, ఖుషి, జయసుధ, వాసుకి ఆనంద్, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, రమణ భార్గవ్, హర్షిణి కోడూరి, మహేష్ చింతల తదితరులు
రచయిత: కొండలరావు అడ్డగళ్ల
సంగీత దర్శకుడు: సింజిత్ యెర్రమిల్లి
ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
ఎడిటర్: సంతోష్ నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియమ్
నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని
రచన, దర్శకత్వం: శ్రీకర్ నయన్ జి
విడుదల తేదీ: నవంబర్ 6, 2026

ఎప్పుడూ రొటీన్ కమర్షియల్ చిత్రాలు కాకుండా, కాస్తంత విలువలతో వచ్చే సినిమాలు తక్కువగా ఉంటాయి. అలాంటి ఒక ప్రయత్నం ఈ సమ్మర్ హాలీడేస్. తారాగణం లిస్టులో “మ్యాంగో ట్రీ” అని మొదటి పేరుగా పడింది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు…చెట్టుతో మనిషి బంధం గురించి చెప్పాలనుకున్నారని. ఇంతకీ చెప్పగలిగారా? మనసుని హత్తుకున్నారా? చూద్దాం!

కథ 2001 లో నడుస్తుంటుంది. ఓ మామిడి తోటలోని చెట్టే కథను వివరిస్తూ (వైవా హర్ష వాయిస్ లో), వేసవి సెలవుల్లో పల్లెటూరికి, అక్కడి మామిడి తోటకు వచ్చిన ఇద్దరు స్నేహితుల జీవితాలను మనకు పరిచయం చేస్తుంది.

వేసవి సెలవులకు అమ్మమ్మ ఊరికి వచ్చిన స్కూల్ కుర్రాడు ఆర్వీ (అరుణ్), అక్కడి గ్రామానికి చెందిన కేవీ అనబడే కాశీ (రోహన్)తో స్నేహం చేస్తాడు.

కాశీది పేద కుటుంబం. తండ్రి చనిపోవడంతో తల్లి (హర్షిణి కోడూరు) ఆర్వీ అమ్మమ్మ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తుంటుంది. లీజుకు తీసుకున్న మామిడి తోట ద్వారా డబ్బు సంపాదించి, తన తల్లికి మంచి చీర కొనివ్వాలన్నది కాశీ కల. మరోవైపు ఆర్వీకి మాత్రం సెలవులను హాయిగా గడపాలని, ఎప్పుడూ మంచి ర్యాంకులు తెచ్చుకోవాలంటూ తండ్రి పెట్టే ఒత్తిడికి దూరంగా సంతోషంగా ఉండాలని ఉంటుంది.

ఈ ఇద్దరి స్నేహం వారి జీవితాలను ఎలా మార్చింది? ఆ వేసవిలో వాళ్లు ఎలాంటి మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు? అదే కథ!

ఈ చిత్రంలో ప్రధానమైన సమస్య ఏంటంటే ఎక్కడా కామెడీ లేకపోవడం. పిల్లల్ని పెట్టుకుని “సమ్మర్ హాలీడేస్” పేరుతో సినిమా తీసినప్పుడు ఆడియన్స్ కచ్చితంగా కామెడీ రిలీఫ్ ఆశిస్తారు కదా! ఆద్యంతం సీరియస్‌నెస్ గా నడుస్తుంటుంది. చిత్రం తీసిన ఉద్దేశ్యం మంచిదే. కానీ తెరకెక్కించిన కంటెంట్‌లో కమర్షియల్ యాంగిల్ కొరవడింది.

అదలా ఉంటే సినిమా మొదలైనప్పటి నుంచి హుక్ ఫ్యాక్టర్ ఏంటో అర్థం కాదు. దేని కోసం ఆడియన్స్ వెయిట్ చెయ్యాలో తెలీదు. తెర మీద సన్నివేశాలు వెళ్తూ ఉంటాయి, కానీ భావోద్వేగం కలగదు. ఆర్వీ, కేవీ అనే ఇద్దరు పిల్లల కథ ఇది. ఎవరి విజయం కోసం వేచి చూడాలి అనేది తెలీక కథ ఎక్కడో మొదలయ్యి ఎటో వెళ్తోందే అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. రోహన్ వెబ్ సిరీస్‌తో పాటు పలు తెలుగు సినిమాల్లో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పాత్రను ఈజీగా చేసేశాడు. ఎక్కడా అతిగా నటించకుండా చక్కటి నటన కనబరిచాడు.

ఇక ఆర్వీగా కనిపించిన అరుణ్, ఈ సినిమాలో క్యూట్‌గా కనిపిస్తూ సిటీ కుర్రాడి పాత్రకు బాగా సరిపోయాడు. ఖుషి సోని కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించినప్పటికీ, మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది.

అమ్మమ్మగా జయసుధ, తల్లిగా వాసుకి, తండ్రిగా హర్షవర్ధన్, వర్మ పాత్రలో రాజీవ్ కనకాల తమ అనుభవంతో పాత్రలకు న్యాయం చేశారు. కాశి తల్లి పాత్రలో హర్షిణి కోడూరు కూడా బాగా నటించింది.

సాంకేతికంగా చూస్తే.. సింజిత్ యెర్రమిల్లి సంగీతం, నేపథ్య సంగీతం బాగున్నాయి. పాటలు సందర్భానికి తగ్గట్టుగా ఉంటూ, ఆ సన్నివేశాలకు మంచి ఫీల్‌ను తీసుకొచ్చాయి. సినిమాకు ఉన్న థీమ్‌కు కూడా చక్కగా సెట్ అయ్యాయి. ఈ సినిమాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిలబెట్టింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఇతర సాంకేతిక విభాగాలు సినిమా బడ్జెట్‌కు తగ్గట్టుగా తమ పని తాము చేసుకుపోయాయి.

సినిమా ప్రారంభ సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు. ఓ కుర్రాడు పల్లెటూరికి రావడం, మామిడి తోటలో క్రికెట్ ఆడటం, ఆ ఊరి కుర్రాడితో స్నేహం చేయడం, స్కూల్ సన్నివేశాలు; ఇవన్నీ అలా సా..గుతూ ఉంటాయి. సెకండాఫ్‌లో సినిమా కొంత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తల్లికి చీర కొనివ్వాలన్న కాశీ ప్రయత్నాలకు సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నంతలో వర్కవుట్ అయ్యాయి.

మొత్తంగా ‘సమ్మర్ హాలీడేస్’ అనేది పల్లెటూరు, పచ్చదనం, మానవీయ విలువలు, బాధ్యత, మట్టివాసన నేపథ్యంలో సాగే ఓ సింపుల్ సినిమా. ప్లాట్ పాయింట్ బాగానే ఉన్నా, థియేటర్‌లో ప్రేక్షకులను మధ్య మధ్యలో మొబైల్ చూసుకోకుండా కూర్చోబెట్టేంత డ్రామా మాత్రం ఇందులో లేదు. పెద్దగా ట్విస్టులు, మలుపులు లేకుండానే సినిమా చివరికి సుఖాంతమవుతుంది. బాల్యం అంటే పుస్తకాల చదువులు, ర్యాంకులు, మార్కులే కాదు.. పల్లెటూరు, అమ్మమ్మతో బంధం, ప్రకృతితో మమేకం, మనస్తత్వాలు తెలుసుకోవడం, కష్టం విలువ తెలుసుకోవడం.. ఇవన్నీ ముఖ్యమని, అవే జీవితాన్ని ఎంజాయ్ చేసేలా చేస్తాయని చెప్పాలనుకున్న ఆలోచన మంచిదే. కానీ సన్నివేశాలు, సంఘటనలు, సంభాషణలు పూర్తిగా పాకానపడకుండా పొయ్యి దింపేసినట్టయ్యింది. రెండు నెలలు సమ్మర్ హాలీడేస్‌కి వెళ్లిన పిల్లవాడు సాధించింది ఏమిటో ఇన్ఫర్మేషన్ స్థాయిలో కన్వే అయ్యింది తప్ప ఎమోషనల్‌గా గట్టిగా హిట్ చెయ్యలేదు.

కథని 2001 నేపథ్యంలో కాకుండా ప్రస్తుతంగా పెడితే ఇంకా రిలవెంట్‌గా ఉండేదేమో. ఊహ తెలిసినప్పటి నుంచీ సెల్ ఫోన్స్‌కి అతుక్కుపోతున్న ప్రస్తుత జనరేషన్‌కి తగ్గట్టుగా కథా కథనాల్ని మలచుకుని ఉంటే కాంటెంపరరీ సబ్జెక్ట్ అయ్యుండేది. ఆ మధ్యన గాంధి-తాత-చెట్టు అంటూ దర్శకుడు సుకుమార్ కుమార్తె నటించిన సినిమా ఒకటి ఉంది. అలాగే “సింగ్ గీతం” కూడా చెట్టు నేపథ్యంలో సాగుతుంది. ఆ కోవలో మరొక చిత్రం ఈ “సమ్మర్ హాలీడేస్”.

బాటం లైన్: ఇద్దరు మిత్రులు, ఒక చెట్టు

5 Replies to “మూవీ రివ్యూ: సమ్మర్ హాలీడేస్”

  1. ఇలా వెర్రి పూ ** రివ్యూ ఇచ్చే బదులు నువ్వే వెళ్లి తీయవచ్చుగా .. నీలాంటోడే పెళ్ళాన్ని సుఖపెట్టలేడు గాని కిటికీలోనుంచి చూసి బజార్లో గుడ్డలు చించుకున్నాడట .

  2. ఇలా వెర్రి పూ ** రివ్యూ ఇచ్చే బదులు నువ్వే వెళ్లి తీయవచ్చుగా .. నీలాంటోడే పెళ్ళాన్ని సుఖపెట్టలేడు గాని కిటికీలోనుంచి చూసి బజార్లో గుడ్డలు చించుకున్నాడట .

  3. ఇలా వెర్రి పూ ** రివ్యూ ఇచ్చే బదులు నువ్వే వెళ్లి తీయవచ్చుగా .. నీలాంటోడే పెళ్ళాన్ని సుఖపెట్టలేడు గాని కిటికీలోనుంచి చూసి బజార్లో గుడ్డలు చించుకున్నాడట .

Comments are closed.