సాయిదుర్గ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతడి వైవాహిక జీవితానికి సంబంధించి తొలి అంకం మొదలైంది. ఈరోజు కిరణ్మయితో సాయిదుర్గతేజ్ ఎంగేజ్ మెంట్ జరిగింది.
హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్ వేదికగా సాయిదుర్గతేజ్-కిరణ్మయి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ తరలి వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు సాయిదుర్గతేజ్-కిరణ్మయిని ఆశీర్వదించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, శిరీశ్, వైష్ణవ్ తేజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ తరఫున అకిరా, ఆద్య హాజరయ్యారు.
మెగా కుటుంబ సభ్యులతో పాటు సాయిదుర్గ తేజ్ మిత్రులు కూడా హాజరయ్యారు. మంచు మనోజ్-భూమా మౌనికా రెడ్డి దంపతులు, నవీన్ విజయకృష్ణ, వైవా హర్ష, దర్శకుడు వెంకీ కుడుముల, నటుడు నవదీప్ తదితరులు ఈ నిశ్చితార్థానికి హాజరయ్యారు.
మరికొన్ని రోజుల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు సాయిదుర్గతేజ్. డిసెంబర్ 10న వీళ్ల వివాహం జరగనుంది.

Congratulations
నవ్బు తెప్పించే విషయం ఈ ఆర్టికల్ కింద నలభై తర్వాత పురుషుల శక్తి ఎందుకు తగ్గుతుంది
..
I can understand how account deficit after anna got down
శ్రీరస్తు శుభమస్తు