చిరంజీవి సినిమా సంక్రాంతికి షెడ్యూల్ అయింది. బాబి దర్శకత్వంలో చేస్తున్న కాకా సినిమాను జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. అంతలోనే పుకార్లు మొదలయ్యాయి.
కాకా సినిమా చెప్పిన తేదీకి రావట్లేదని, పోస్ట్ ప్రొడక్షన్ కు మరింత సమయం కావాలని దర్శకుడు పట్టుబట్టడంతో సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పించారంటూ ప్రచారం మొదలైంది.
సినిమా విడుదల తేదీలు ప్రకటించడం, ఆ తర్వాత తప్పుకోవడం టాలీవుడ్లో సహజం కాబట్టి చాలామంది ఇది నిజం అని నమ్మారు.
దీంతో వెంటనే మేకర్స్ రంగంలోకి దిగారు. తమ సినిమా చెప్పిన తేదీకే వస్తుందని ప్రకటించారు. ఇదే విషయాన్ని కోన వెంకట్ కూడా స్పష్టం చేశారు.
జనవరి 13కి కాకా ల్యాండ్ అవుతున్నాడని, అసలైన పండగ తెస్తున్నాడంటూ పోస్ట్ పెట్టారు. దీంతో పాటు చిరంజీవితో దిగిన ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు.
నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. డబ్బింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్‌ను సమాంతంరంగా జరుపుతున్నారు. అయినప్పటికీ విడుదల తేదీపై పుకార్లు రావడం యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంక్రాంతికి కాకా, జనవరి 12 విడుదల సినిమాల మధ్య గట్టిపోటీ ఉండబోతున్న సంగతి తెలిసిందే.
