వైసీపీ నుంచి గెంటేయడం వల్లే బయటికి వచ్చినట్టు ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో తనకు ఒకట్రెండు కాదు, 70కి పైగా అవమానాలు జరిగాయన్నారు.
ఇక భరించలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఏ రోజూ తనను దివంగత వైఎస్సార్, ఆయన తండ్రి రాజారెడ్డి అవమానించలేదని విజయసాయిరెడ్డి గుర్తు చేసుకున్నారు.
కేవలం జగన్ పరిపాలనలోనే తనకు అవమానాలు జరిగాయన్నారు. అది కూడా రకరకాల చెప్పుడు మాటలు విని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమ్మీద మనిషిగా పుట్టిన వారెవరైనా ఇలాంటి అవమానాలు భరించకూడదనేదే తన అభిప్రాయమన్నారు.
తన కొత్త పార్టీలో ప్రతి ఒక్కర్నీ గౌరవంగా చూసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. విజయసాయిరెడ్డి ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా వైఎస్ జగన్ టార్గెట్‌గానే విమర్శలు చేస్తున్నారు.
ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే ఆయన చేస్తున్నట్టు కనిపిస్తోందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. కేవలం తమ నాయకుడిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.
నీడలా వుండే తనను అవమానించారని చెప్పడం ద్వారా, జగన్‌ను జనంలో వ్యక్తిగతంగా పలుచన చేసే కుట్ర కనిపిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.
నిజానికి విజయసాయిరెడ్డిని అసలు పట్టించుకోవద్దని తన పార్టీ నాయకులకు జగన్ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఎలాగైనా రెచ్చగొట్టి, తనవైపు మీడియాను తిప్పుకునే వ్యూహంలో భాగంగానే విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది.

తల్లి, చెల్లిని గెంటినవాడికి నువ్వు ఒక లెక్కా?
పుట్టింటోళ్ళు తరిమేశారు ..
నువ్వు గెంటయ్యి జైల్లోకి, జస్ట్ నిజాలు ఒప్పుకో అంతే