మరో శుభకార్యానికి కలిసి హాజరైన విజయ్-త్రిష

విజయ్-త్రిష ఇప్పటికే తమ రిలేషన్ షిప్ ను బహిరంగం చేశారు. ఒకే రంగు దుస్తులు ధరించి గతంలోనే ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు.

విజయ్-త్రిష ఇప్పటికే తమ రిలేషన్ షిప్ ను బహిరంగం చేశారు. ఒకే రంగు దుస్తులు ధరించి గతంలోనే ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓవైపు భార్యతో విడాకుల వ్యవహారం కొనసాగుతున్న టైమ్ లోనే, విజయ్ ఈ పని చేశారు.

ఇప్పుడు మరోసారి విజయ్-త్రిష కలిసి మరో శుభకార్యానికి హాజరయ్యారు. ఈసారి ఏకంగా చాలామంది ప్రముఖుల సమక్షంలోనే విజయ్ ఈ పని చేయడం విశేషం.

చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్ లో వైఎస్ అనీల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రేయ-ఉజ్వల్ దంపతుల్ని ఆశీర్వదించడానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వచ్చారు.

ఆయన ఒక్కరే రాలేదు. తనతో పాటు త్రిషను కూడా తీసుకొచ్చారు. తన రెగ్యులర్ స్టయిల్ లో సూట్ వేసుకొని విజయ్ రాగా, డిజైనర్ శారీ ధరించి విజయ్ తో పాటు వివాహానికి హాజరైంది త్రిష.

ఈ వివాహ వేడుకల్లో విజయ్-త్రిష జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈసారి విజయ్ పక్కన కూర్చోలేదు త్రిష. దీనికి ఓ కారణం ఉంది.

ఈ వెడ్డింగ్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ లాంటి నాయకులతో పాటు.. గౌతమ్ అదానీ లాంటి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. వీళ్లంతా ముందువరుసలో కూర్చుంటే, వాళ్ల వెనక వరుసలో త్రిష కూర్చుంది.

మొత్తానికి ఈ కార్యక్రమంతో విజయ్ మరోసారి తన మనసులో మాట చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం భార్య సంగీత స్వర్ణలింగంతో ప్రైవేటుగా విడాకుల వ్యవహారాన్ని సెటిల్ చేసుకునే పనిలో ఉన్నారు విజయ్. విడాకులు కావాలంటూ కోర్టులో వేసిన పిటిషన్ ను ఆమె ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

Click Here More Pics

6 Replies to “మరో శుభకార్యానికి కలిసి హాజరైన విజయ్-త్రిష”

  1.  Odd man out మన “ఎర్రితేడాగాడ్”   హైలైట్ ..ఎర్రిమొహంతో చేతులు పిసుక్కుంటూ వొంగిపోయాడు

  2. అన్నాయ్, విజయ్ ని కూడా కార్లు మార్చినట్టు 11ఏళ్ళకి ఓసారి పెళ్లాలని మార్చే నువ్వు CM ఎలా? how అని కడిగిపారేయ్ 

Comments are closed.