వైసీపీకి ఆ ముప్పు కూడా ఉందా?

ఇంతకీ ఆ గాసిప్స్ ఏంటంటే.. గెలిచిన 13 మంది వైసీపీ కార్పొరేటర్లలో ఆ పార్టీకి ఎంత మంది మిగులుతారు అనేది.

చావో రేవో అన్నట్లుగా సాగిన స్థానిక ఎన్నికల్లో విశాఖలో అన్నింటికీ తెగించి కష్టించి, జనం మద్దతు అందుకుని 13 మంది కార్పొరేటర్లు వైసీపీ తరఫున గెలిచారు. 120 వార్డుల్లో చూస్తే ఈ నంబర్ చాలా చిన్నదిగా అనిపించవచ్చు. కానీ పది మందికి ఒకరు జవాబు చెప్పినట్లుగా పదిలమైన గెలుపుగానే వైసీపీ దీనిని చూస్తోంది.

అయితే ఇంకా కాళ్ల పారాణి ఆరకముందే అమంగళం మాటలు అన్నట్లుగా అనేక రకాల ఊహాగానాలు వైసీపీ కార్పొరేటర్ల మీద ప్రచారమవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇవి పుకార్లుగా షికారు చేస్తున్నాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఈ గాసిప్స్‌ను కూడా అంతా ఆసక్తిగానే వింటున్నారు.

ఇంతకీ ఆ గాసిప్స్ ఏంటంటే.. గెలిచిన 13 మంది వైసీపీ కార్పొరేటర్లలో ఆ పార్టీకి ఎంత మంది మిగులుతారు అనేది. కూటమి పార్టీల ట్రాప్‌లో పడి వీరిలో కొందరైనా చేరి వైసీపీకి చేజారుతారన్నది ప్రచారం చేస్తున్నారు.

ఈ నెల 23న కార్పొరేటర్లు ప్రమాణం చేస్తారు. ఈలోగానే వారి మెడలో నీలి జెండా బదులు పసుపు జెండానా, కాషాయ జెండానా, జనసేన జెండానా.. ఏది పడుతుంది అన్నది అంతా తర్కించుకుంటున్నారు.

అయితే ఇవి పుకార్లుగానే చూస్తున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు మేయర్ ఎన్నికలు ప్రత్యక్షంగా జరిగాయి. అలాగే కూటమికి సొంతంగా 98 మంది కార్పొరేటర్ల బలం ఉంది. రెబెల్స్‌గా గెలిచిన ఎనిమిది మంది కూడా కూటమికి జై కొడుతున్నారు. అందువల్ల అవిశ్వాసాలు, వాటి కోసం ఓట్ల కోసం ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం కూటమికి లేదని అంటున్నారు.

కానీ ఎంతో కష్టించి గెలిచిన వైసీపీ కార్పొరేటర్లలో ఎవరైనా అధికార పార్టీలో చేరితే బాగుంటుంది కదా.. అంటూ అభివృద్ధి కోసమే ఫిరాయిస్తారా అంటే ఏమో తెలియదు అంటున్నారు. ఈ ఊహాగానాలు ఇప్పటికైతే ప్రచారంగానే ఉన్నాయి. ఏమి జరుగుతుందో చూడాలి.

10 Replies to “వైసీపీకి ఆ ముప్పు కూడా ఉందా?”

  1. అవిశ్వాసం, కప్పల తక్కెడ, నంబర్లాట  లేకుండా ఒక మాంచి నిర్ణయం తీసుకున్న CM

  2. జగెనమోహనకి అసలైన ముప్పు

    “తప్పుడు సాక్షి పెళ్ళాం&సజ్జిల” రూపంలోనే కూడా ఉందా? అంటున్న ప్యాలెస్ వర్గాలు

  3. అలా ఎలా వదిలేస్తారు, అలవాటుపడ్డ ప్రాణం కదా, అయినా శత్రువు లేకుంటే అతని ఎముకలనే వదలని లక్షణాలున్నాయి కదా.

Comments are closed.