కడప జెడ్పీ చైర్మ‌న్‌గా ఎమ్మెల్యే తండ్రి?

క‌డ‌ప జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా పుత్తా న‌ర‌సింహారెడ్డి పేరు ఖ‌రారు చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఈయ‌న క‌మ‌లాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైత‌న్య‌రెడ్డి తండ్రి.

క‌డ‌ప జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా పుత్తా న‌ర‌సింహారెడ్డి పేరు ఖ‌రారు చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఈయ‌న క‌మ‌లాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైత‌న్య‌రెడ్డి తండ్రి.

క‌మ‌లాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావ‌డం పుత్తా న‌ర‌సింహారెడ్డి జీవిత క‌ల‌. 2004 నుంచి 2019 వ‌ర‌కు మొత్తం నాలుగుసార్లు పుత్తా న‌ర‌సింహారెడ్డి ఎన్నిక‌ల్లో పోటీ చేసి, ఓట‌మినే మూట‌క‌ట్టుకున్నారు.

ఈ నేప‌థ్యంలో 2024లో న‌ర‌సింహారెడ్డి కుమారుడు, విదేశాల్లో విద్య‌స‌భ్య‌సించిన కృష్ణ‌చైత‌న్య‌రెడ్డిని టీడీపీ అధిష్టానం ఎన్నిక‌ల బ‌రిలో నిలిపింది. కూట‌మి సునామీలో కృష్ణచైత‌న్య గెలుపొందారు. కుమారుడి ఎన్నిక‌తో త‌న క‌ల‌ను న‌ర‌సింహారెడ్డి నెర‌వేర్చుకున్న‌ట్టైంది.

ఈ నేప‌థ్యంలో క‌డ‌ప జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ సీటు ఓసీ జ‌న‌ర‌ల్‌కు కేటాయించ‌డంతో న‌రసింహారెడ్డి క‌న్ను ప‌డింది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో భాగంగా క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వీర‌పునాయునిప‌ల్లె జెడ్పీటీసీ స‌భ్యుడిగా న‌ర‌సింహారెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. క‌మ‌లాపురం ప‌రిధిలో స్థానిక సంస్థ‌ల ప‌ద‌వుల‌న్నీ దాదాపు ఏక‌గ్రీవ‌మే అని చెప్పాలి.

ఈ క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా పుత్తా న‌ర‌సింహారెడ్డి పేరు దాదాపు ఖ‌రారైన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదే ప‌ద‌విని జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి సోద‌రుని కుమారుడు రాజేష్‌రెడ్డి ఆశించారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు జెడ్పీటీసీ స్థానం నుంచి బీజేపీ త‌ర‌పున ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ప‌దవిని బీజేపీకి ఇచ్చే ఉద్దేశం చంద్ర‌బాబుకు లేన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే న‌ర‌సింహారెడ్డి వైపే చంద్ర‌బాబు, లోకేశ్ మొగ్గు చూపుతున్న‌ట్టు విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

One Reply to “కడప జెడ్పీ చైర్మ‌న్‌గా ఎమ్మెల్యే తండ్రి?”

  1. స్వంత బ్యాచ్ నుంచి ఎవరూ లేరా? చివరికి చెడ్డి బ్యాచ్ వాళ్ళే దిక్కా?

Comments are closed.