పరిషత్తు ఎన్నికల్లో భారీ పోలింగ్ జరిగింది. విశాఖ జిల్లాలో 82 శాతం పోలింగ్ జరిగితే అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం లో కూడా పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు అల్లూరి జిల్లాలో పోలింగ్ సజావుగా సాగింది.
అయితే ఎనభై శాతం దాకా సాగిన ఈ పోలింగ్ లో ఎవరికి అవకాశాలు ఎవరికి జెడ్పీ పీఠాలు దక్కుతాయని తర్కించుకుంటున్నారు. విశాఖ జిల్లా జెడ్పీ అయితే తమదే అని కూటమి అంటోంది. నాలుగు మండలాలు ఉన్న ఈ జెడ్పీలో మూడు భీమిలీలోనే ఉన్నాయి. భీమిలీ వైసీపీ ఇంచార్జి బొత్స అనూష విజయనగరం జెడ్పీటీసీగా పోటీ చేస్తూ బిజీగా ఉన్నారు.
దాంతో ఇక్కడ నాయకుడు లేని పోరాటం వైసీపీది అయింది. దానికి తోడు టీడీపీకి భీమిలీ కంచుకోట కావడంతో కూటమి గెలుపు మాదే అంటోంది. అనకాపల్లిలో వైసీపీ ఫరవాలేదన్నట్లుగా పోటీ ఇచ్చినట్లుగా చెబుతున్నా కూటమికే ఆశలు అవకాశాలు అంటున్నారు.
శ్రీకాకుళంలో అయితే కూటమిలో లుకలుకలు అలాగే పొత్తులలో బలహీనమైన అభ్యర్ధులు ప్రత్యర్ధులుగా ఉన్నారు కాబట్టి కొన్ని జెడ్పీటీసీలు సులువుగా వస్తాయని, మరి కొన్నిట తమకు బలం ఉంది కాబట్టి జెడ్పీ పీఠం మీద ఆశలు పెట్టుకోవచ్చు అని వైసీపీ అంటోంది. కానీ ఇక్కడ భారీ పోలింగ్ కూటమి పెద్దలంతా కలసి రావడంతో ఫలితం మీద ఆసక్తి ఉంది.
అన్నింటికంటే అందరికీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నది విజయనగరం జడ్పీ పీఠం. ఇక్కడ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సొంత జిల్లా కావడంతో పాటు ఆయన సపరివారంగా జెడ్పీటీసీ సీట్లకు తన వారిని దించి మరీ వ్యూహ రచన చేశారు. ఆయనకు ఎదురు నిలిచిన వారు సొంత మేనల్లుడు చిన్న శ్రీను, అలాగే బంధువు అయిన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు. వీరితో పాటు వైసీపీని వీడి వెళ్ళిన వారు అంతా కూడా సవాల్ చేస్తున్నారు.
అయితే సరే బొత్స మంత్రాంగం మీద నమ్మకం ఉంచిన వారు వైసీపీదే గెలుపు అంటున్నారు. ఫలితం వచ్చేవరకూ ఇక్కడ సస్పెన్స్ కొనసాగనుంది. బొత్స రాజకీయ జీవితంలో కీలక మలుపు తిప్పేదిగా ఈ రిజల్ట్ ఉంటుందా అని చర్చిస్తున్నారు.

బస్తీ మే సవాల్
ఒకవైపు కూటమిలో లుకలుకలు ఉన్నాయంటావు, అంతలోనే కూటమి పెద్దలంతా కలిసికట్టుగా వచ్చారని అంటావు. అసలు నీ బాధేంటిరా బాబూ…?
ఫలితాలు ఎటు వస్తె…అటు తిప్పొచ్చు…ముందే చెప్పా అని. అసలే డేర్ టూ రైట్
ప్రతి సారి ఇలాగే ఎలివేషన్స్ ఇస్తావ్, తీరా రిజల్ట్ వచ్చాక వైసీపీ కి డిపాజిట్స్ కూడా రావు, ఇంకా తెలిసిందే గా మింగలేక మంగళవారం మాటలు, అపుడు EVM లు ఇపుడు దొంగ ఓట్లు ,రిగ్గింగ్ అని ఏడుపులు 😂
GA, you must rest for some time.
ఈ ఎన్నికలలో పెద్దాయన గెలిస్తే ఎవరూ నిజమైన లేదా సరైన గెలుపు అని నమ్మరు. కానీ ఓడిపోతే పరువు (ఉంటే) పోతుంది. అదీ వాళ్ళకొచ్చిన కష్టం. ఆ విషయం భక్తులకు బాగా తెలిసే ఓవర్ టైం కష్టపడి కామెంట్లు రాస్తూ ఉన్నారు, గోబెల్స్ గారి దారిలో.
అంతే అంతే పోయేది అంతా పెద్దాయనకే , మనకు ఏమి నష్టం లేదు , ముసుగు తన్ని పడుకోవడమే
Otami leni nayakudu anna matrame !!!!
odina prajalani gelichinatte!!!