వైసీపీ గెలుపు ఎఫెక్ట్‌… టీడీపీ భ‌యంతో!

నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీని వైసీపీ సొంతం చేసుకోవ‌డంతో టీడీపీలో వ‌ణుకు పుట్టింది.

నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీని వైసీపీ సొంతం చేసుకోవ‌డంతో టీడీపీలో వ‌ణుకు పుట్టింది. ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో స్థానిక సంస్థ‌ల్ని స్వేచ్ఛ‌గా జ‌ర‌గ‌నిస్తే, అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని టీడీపీ నేత‌లు భయ‌ప‌డ్డారు.

నందికొట్కూరు, బేతంచ‌ర్ల మున్సిపాలిటీలు వైసీపీ వ‌శం కావ‌డం, డోన్ మున్సిపాలిటీని అక్ర‌మ ప‌ద్ధతిలో టీడీపీ సొమ్ము చేసుకుంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌డంతో టీడీపీ అప్ర‌మ‌త్త‌మైంది.

క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జాభిప్రాయం త‌మ‌కు భిన్నంగా వుంద‌నే వాస్త‌వాన్ని టీడీపీ పెద్ద‌లు గ్ర‌హించారు. దీంతో ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పై అధికార పార్టీ నాయ‌కులు దృష్టి సారించారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీకి క‌నీస అవ‌కాశం కూడా ఇవ్వ‌కూడ‌ద‌ని టీడీపీ నేత‌లు వ్యూహంప‌న్నారు.

అందుకే ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఇన్‌చార్జ్‌ల‌ను, ఆ పార్టీ అభ్య‌ర్థుల్ని, ఏజెంట్ల‌ను ఎక్క‌డికక్క‌డ నిర్బంధించారు. పోలీసుల‌ను అడ్డం పెట్టుకుని వైసీపీకి ఊపిరి ఆడ‌కుండా చేయ‌డంలో టీడీపీ స‌క్సెస్ అయ్యింది. మ‌రీ ముఖ్యంగా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ యువ‌నేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డిని తిర‌గ‌కుండా క‌ట్ట‌డి చేశారు. మిగిలిన నాయ‌కుల‌కు కూడా అదే ప‌రిస్థితి.

మ‌రికొన్ని చోట్ల టీడీపీ, వైసీపీ రాజీ ధోర‌ణిలో సీట్ల‌ను పంచుకున్నారు. అలాంటి ప్రాంతాల్లో మిన‌హాయిస్తే, ఎన్నిక‌ల్ని స్వేచ్ఛ‌గా జ‌ర‌గ‌నివ్వ‌కుండా పోలీసుల ద్వారా టీడీపీ అడ్డుకోగ‌లిగింది.

య‌థేచ్ఛ‌గా రిగ్గింగ్‌కు పాల్ప‌డి, ప్ర‌జాభిప్రాయం త‌మ వైపే వుంద‌ని నిరూపించుకోడానికి టీడీపీ శ్ర‌మ ప‌డాల్సి వ‌చ్చింది. అందుకే ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా వ్యాప్తంగా టీడీపీకి అనుకూలంగా రానున్నాయ‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున సాగుతోంది.

14 Replies to “వైసీపీ గెలుపు ఎఫెక్ట్‌… టీడీపీ భ‌యంతో!”

  1. అనుకున్నా ఇలాంటి ఆర్టికల్ రాస్తావు అని, ఒక్కటి కాదు కదా అన్ని ఓడిపోయినా ఇలాంటివి రాయాలి మరి తప్పదు, తీసుకున్న కూలి కి 

  2. కూటమి వణుకుతోందా… మేయర్ ప్రత్యక్ష ఎన్నిక కాకపోతే అక్కడ ఎక్కువ వార్డులు గెలిచింది టీడీపీ కదా.. కూటమి కే దక్కినట్టు ఇది కూడా 😄

  3. ధోన్ మున్సిపాలిటీ ఎన్నిక అనేది కేవలం వైఎస్సార్సీపీ (YSRCP) మరియు టీడీపీ (TDP)ల మధ్య జరుగుతున్న పోటీ మాత్రమే కాదు;

    ఇది ‘కోట్ల’ కుటుంబానికి మరియు ‘కోట్ల వ్యతిరేక’ వర్గానికి మధ్య జరుగుతున్న పోరాటం.

    ధోన్‌లో టీడీపీ మనుగడ సాగించాలంటే, స్థానిక రాజకీయ రంగం నుండి కోట్ల కుటుంబాన్ని తొలగించాల్సి ఉంటుంది; అప్పుడే ఆ పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది.

  4. ఈ రెండు ఓటములు చూసి TDP భయపడితే, ఒక లక్ష ఓటములు చూసిన ja*** కి every 5 minutes కి డైపర్  change చేస్తున్నారంట, కేవలం దాని కోసమే ఇద్దరు మనుషులు 24/7 పెట్టుకున్నారంట, ప్చ్ its very pathetic situation in bengaluru palace!!

  5. ఈ రెండు ఓటములు చూసి TDP భయపడితే, ఒక లక్ష ఓటములు చూసిన ja*** కి every *5 minutes కి *డైపర్ change చేస్తున్నారంట, కేవలం దాని కోసమే ఇద్దరు మనుషులు *24/7 పెట్టుకున్నారంట, ప్చ్ its very pathetic situation in bengaluru palace!!

  6. ఈ రెండు ఓటములు చూసి TDP భయపడితే, ఒక *లక్ష ఓటములు చూసిన ja*** కి every *5 minutes కి *డైపర్ change చేస్తున్నారంట, కేవలం దాని కోసమే ఇద్దరు మనుషులు *24/7 పెట్టుకున్నారంట, ప్చ్ its very *pathetic situation in *bengaluru *palace!!

  7. ఈ రెండు ఓటములు చూసి TDP భయపడితే, ఒక లక్ష ఓటములు చూసిన ja*** కి every *5 minutes కి *డైపర్ change చేస్తున్నారంట, కేవలం దాని కోసమే ఇద్దరు మనుషులు *24/7 పెట్టుకున్నారంట, ప్చ్ its very pathetic situation in *bengaluru *palace!!

  8. ఈ రెండు ఓటములు చూసి TDP భయపడితే, ఒక లక్ష ఓటములు చూసిన ja*** గాడు ఏమి అవ్వాలి, every *5 minutes కి *డైపర్ change చేస్తున్నారని టాక్ , కేవలం దాని కోసమే ఇద్దరు మనుషులు *24/7 పెట్టుకున్నారంట, ప్చ్ its very pathetic situation in *bengaluru *palace!!

Comments are closed.