అంగట్లో అన్నీ వున్నా, అల్లుడి నోట్లో శని అనే సామెత చందంగా వైసీపీ తీరు వుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ వైపు జనం ఉన్నా, అభిమానాన్ని సొమ్ము చేసుకునే నాయకత్వం లేకపోవడం గమనార్హం. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి సరైన నాయకత్వం లేకపోవడంతో రాజకీయ నష్టం జరిగింది.
ఒంగోలు కార్పొరేషన్‌లో మొత్తం 62 డివిజన్లు ఉన్నాయి. వీటిలో మూడు స్థానాలు టీడీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మేయర్ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. వైసీపీ 11 డివిజన్లలో గెలుపొందింది.
ఈ ఎన్నికల్లో వైసీపీ గట్టిగా పోటీ చేసి వుంటే, తప్పకుండా మేయర్ స్థానాన్ని గెలుచుకునేది. అయితే నాయకత్వ లోపంతోనే ప్రజాభిప్రాయాన్ని తగిన రీతిలో వైసీపీ సొమ్ము చేసుకోలేకపోయిందనే ఆవేదన పార్టీ శ్రేణుల్లో వుంది.
ఒంగోలు వైసీపీకి చుండూరి రవి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో రవిని గెలిపించాలని కొన్నేళ్లు ముందుగానే వైఎస్ జగన్ ప్రకటించారు. జగన్‌కు ఎందుకంత తొందరే ఎవరికీ అంతుచిక్కడం లేదు.
ఒంగోలులో చుండూరి రవి తీరుపై సొంత పార్టీలోనే అసంతృప్తి కనిపిస్తోంది. చాలా తక్కువ సమయంలోనే అహంకారి అనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. అందరినీ కలుపుకుని వెళ్లే పరిస్థితి లేదని అంటున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ మేయర్ అభ్యర్థిగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన కుప్పం ప్రసాద్‌ను బరిలో నిలిపారు.
అయితే జగన్ కోసం ఎన్నికల్లో అభ్యర్థుల్ని నిలబెట్టినట్టుగా పార్టీ నేతలు వ్యవహరించారు. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పార్టీని వీడిన తర్వాత, ఇప్పుడిప్పుడే అక్కడ వైసీపీ కుదురుకుంటోంది.
వైసీపీకి జనంతో సమస్య లేదు. కానీ ఆ జనాన్ని తమ వెంట నడిపించుకునే బలమైన నాయకత్వం వైసీపీని తీవ్రంగా వెంటాడుతోంది. ప్రస్తుత ఇన్‌చార్జ్ చుండూరి రవి రానున్న ఎన్నికల్లో అభ్యర్థి అయితే, ఆ పార్టీ మరోసారి మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందనే టాక్ వినిపిస్తోంది.
తాజా కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై సొంత పార్టీలోని వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలన్న ధ్యాసే వైసీపీ ముఖ్య నాయకులకు లేకపోయింది. 25 డివిజన్లలో చాలా బలహీనమైన అభ్యర్థుల్ని వైసీపీ నిలిపింది. అలాగే ఎన్నికల రోజు రిగ్గింగ్ చేసుకోడానికి పార్టీ బలహీన నాయకత్వమే కారణమని అంటున్నారు.
అంతేకాదు, కౌంటింగ్‌లోనూ టీడీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్టు వైసీపీ నేతలపై ఆరోపణలున్నాయి. కావున ఇప్పటికైనా ఒంగోలులో జనాదరణను సొమ్ము చేసుకోడానికి వైఎస్ జగన్ బలమైన అభ్యర్థిని బరిలో నిలపాల్సిన అవసరం వుందని పలువురు అంటున్నారు.

నీ బాధఏంది బాబాయ్, ఉన్నపళంగా రవి ని తీసేసి, రవి రెడ్డిని, పెట్టాలి అంటావ్…
anthega anthegaaa.
Ee badha ippatlo teearadu
ika eppatiki teeradhu.
కుప్పం ప్రసాద్ వెర్రి పువ్వు రా అయ్యా వాడు . టీడీపీ కి కాండిడేట్ కి వచ్చిన మెజారిటీ ఓట్లు ఉక్కుప్ కి వచ్చాయి . ఎలా గెలుస్తారు . ఏది పడితే అది రాసేయడమే .
emundhi why not 175 ani 1-7-5 seats lo anani nilabettadame.
emundhi why not ani anni chotla annane candidate ga prakatisthe saripoddi.
ఒక్క ఒంగోలు ఏంటి, వరల్డ్ మొత్తం ఆ వైపే. నువ్వు సరిగ్గా చూసావో లేదో. మందులేసుకో తగ్గిపోతుంది.
జనం తో ప్రాబ్లెమ్ లేదు అంటాడు..
కాండిడేట్ సరిగా లేడు నాయకత్వం లోపం అంటాడు..
అసలు అన్నియ ఫోటో చాలు గెలవడానికి అంటాడు
అన్నియ సరయిన వాళ్లని పెట్టాలి అంటావు
ఏంటో జనం నవ్వుకుంటారు అని కూడా లేదు..
నువ్వు వార్త రాస్తే కామెడీ.. అన్నియ మీడియా ముందుకు వస్తే కిత kithalu