సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. పైగా నటించడానికి మంచి స్కోప్ ఉన్న కథ. అదృష్టం బాగుంటే ఫిమేల్ ఓరియంటెడ్ కథలకు కేరాఫ్ అడ్రస్ గా మారే మంచి అవకాశం.
ఇలాంటి అవకాశాన్ని చేజేతులా వదిలేస్తోంది ఈ హీరోయిన్. కథ నచ్చి సినిమాకు ఒప్పుకుంది. పారితోషికం కూడా కాస్త గట్టిగానే డిమాండ్ చేసి సాధించింది. మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది.
ఇప్పుడా సినిమా యూనిట్ ను వేధించడం మొదలుపెట్టింది ఈ హీరోయిన్. ఇప్పటికే 2 సార్లు షూటింగ్ కు డుమ్మా కొట్టింది. పంపించిన పోస్టర్ డిజైన్లు రిజెక్ట్ చేస్తోంది. తదుపరి షెడ్యూల్ గురించి అడిగితే కాల్షీట్లు లేవంటోంది.
బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో కలిసి నటించిందామె. ఆ సినిమాలతో తన దశ తిరిగిపోతుందని భావించింది. కానీ ఆ సినిమాలు డిజాస్టర్లయ్యాయి. అయినప్పటికీ మార్కెట్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకు అవకాశాలొస్తున్నాయి.
ఇదే క్రమంలో వచ్చిన సినిమా అవకాశం ఇది. నిర్మాత ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడా సినిమాలో నటించడం ఆమెకు ఇష్టం లేనట్టుంది. అందుకే రకరకాల కొర్రీలు పెట్టి యూనిట్ ను వేధిస్తోంది. చూస్తుంటే, ఆ సినిమా ఆగిపోయినట్టే ఉంది.

Who?????????
Without name an article..
Pawan meeda 10 articles. Ipudu name lekunda okati.
Vadini evarikana suyinchandi ra babu, ala vadilekandiraa
Oke Oka Jeevitham – Rukmini