ఏపీలో వాయిదా పడిన 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. గురువారం ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు ఈ దఫాలో జరగనున్నాయి.
శ్రీకాకుళం కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయ్యాక తొలిసారి ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అలాగే, శ్రీకాకుళం మున్సిపాలిటీ పదవీకాలం ముగిసిన పదిహేనేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలకు రాజకీయ ప్రత్యేకత చాలానే ఉంది.
ఉత్తరాంధ్రలో మూడు కార్పొరేషన్లలో విశాఖ, విజయనగరంలను కూటమి గెలుచుకుని, శ్రీకాకుళం కూడా తమదేనని ధీమాగా చెబుతోంది. శ్రీకాకుళం మేయర్ పదవిని పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చారని అంటున్నారు. దాంతో టీడీపీ తమ్ముళ్లు కొంత నిరాశలో ఉన్నారని చెబుతున్నారు.
టీడీపీ మాజీ ఎంపీ, శ్రీకాకుళం నగరంలో కీలక నేతగా ఉన్న గుండ లక్ష్మీదేవి వైసీపీలో చేరడం ఫ్యాన్ పార్టీకి కొంత బలాన్ని ఇస్తోంది. దాంతో శ్రీకాకుళం మేయర్ పీఠాన్ని తాము గెలుచుకోగలమని, కూటమిలోని అసంతృప్తులు తమకు ఉపకరిస్తారని వైసీపీ ఆశాభావంతో ఉంది.
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ కార్పొరేషన్ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని అంటున్నారు. టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగా సాగే ఈ రాజకీయ సమరంలో విజేత ఎవరు అన్నది ఉత్కంఠను కలిగించనుంది. సిక్కోలు తొలి మేయర్ ఎవరు అవుతారన్నది కూడా ఆసక్తిని రేపుతోంది.
ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు ఉన్నాయి. అక్కడ వైసీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నారు. ఆయన సొంత నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందన్నది చూడాల్సి ఉంది. విజయనగరం జిల్లాలోని రాజాం నగర పంచాయతీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి.

మేయర్ చైర్మన్ ల సంగతి పక్కన పెట్టు..దీనవ్వ ఈ నాలుగు కార్పొరేషన్, పందొమ్మిది మున్సిపాలిటీ లలో సింగల్ డివిజన్/వార్డు గెలుచుకున్నా గొప్పనే అన్నియ పార్టీ.
Reddy
Sikkolu anna de
Anne gelichadu
Anna odipoyina gelichi natte!!!
Reddy
Divvela Maduri Duvvada Duvvena anda ga Undaga Sikkolu Anna de !!!
Anna de Sikkolu
ఇంకెవరిది …మన అన్న దే… ఉత్తరాంధ్ర గడ్డ… వైసీపీ అడ్డ