బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాదా’. ఈ సినిమాలో ఆయన నటించడమే కాదు, ఏకంగా ఓ పాట కూడా పాడారు. ఈ చిత్రంలోని ‘దాదా ధమాకా’ అనే మొదటి పాటను బాలకృష్ణ ఆలపించారు.
గతంలో ‘పైసా వసూల్’ చిత్రంలోని ‘మామా ఏక్ పెగ్ లా’ అనే మాస్ సాంగ్‌తో తనలోని గాయకుడిని పరిచయం చేసి, అభిమానులను ఉర్రూతలూగించడమే కాకుండా ఆ పాటను చార్ట్‌బస్టర్‌గా నిలిపారు. పలు వేదికలపై కూడా పాటలు పాడిన అనుభవం బాలకృష్ణకు ఉంది.
ఇప్పుడా అనుభవపంతో ఆయన మరోసారి మైక్ పుచ్చుకున్నారు. ‘దాదా’ కోసం పాట పాడారు. ఈ నిర్ణయాన్ని స్వయంగా ఆయనే తీసుకున్నారా.. లేక సంగీత దర్శకుడు తమన్ కోరిక మేరకు జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.
బాలకృష్ణ, తమన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలొచ్చాయి వీళ్ల కాంబోలో.
బాలయ్య ఎనర్జీకి తగ్గట్టు హై-వోల్టేజ్ బీజీఎం ఇవ్వడంతో తమన్ పండిపోయాడు. ‘దాదా’ కూడా గత చిత్రాలకు ఏమాత్రం తీసిపోదంటున్నారు.
ఇక బాలయ్య పాడిన ఈ హుషారైన మాస్ గీతంలో బాలకృష్ణతో కలిసి బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ స్టెప్పులేసింది. వీరిద్దరి మధ్య వచ్చే ఈ ప్రత్యేక గీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
భారీ సెట్స్, కలర్‌ఫుల్ విజువల్స్‌తో చిత్రీకరించిన ఈ పాటను మరో 2 రోజుల్లో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

పాడుతా తీయగా
ముసలాడు ని భరించలేక అసలే చస్ తున్నారు ఇప్పుడు ఇదొక రోగం