ఏపీలో మొత్తం 28 జెడ్పీ చైర్‌పర్సన్ పదవులు ఉంటే, అందులో 27 టీడీపీ కూటమి గెలుచుకోబోతోంది. మెజారిటీ జెడ్పీటీసీలు కూటమి ఖాతాలో పడడంతో సంఖ్యాబలం ఆ వైపే ఉంది. కానీ ఉత్తరాంధ్రలో ఏకైక జెడ్పీ పీఠం మాత్రం వైసీపీని వరించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జెడ్పీ పీఠం ఇంతటి కూటమి జోరులోనూ వైసీపీకే దక్కింది. మొత్తం 11 జెడ్పీటీసీలకు ఏడు గెలుచుకుని వైసీపీ తిరుగులేని ఆధిక్యతను సాధించింది. దాంతో వైసీపీ తరఫున అల్లూరి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఎవరు అవుతారు అన్నది అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది.
అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవికి ఈ పదవి ఇవ్వాలని అనుకున్నారు. అందుకే ఆమెను కొయ్యూరు జెడ్పీటీసీగా పోటీ చేయించారు. కానీ ఆమె ఓటమి పాలయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఐదేళ్ల పాటు పనిచేసిన సుభద్ర కూడా ముంచింగిపుట్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
దాంతో ఇప్పుడు యువ మహిళా నాయకురాలికి అవకాశం వచ్చింది. చింతపల్లి నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించిన కె. అనూషకు చైర్‌పర్సన్ పదవి వరించబోతోందని అంటున్నారు. ఆమె విద్యావంతురాలు కావడమే కాకుండా, గతంలో చింతపల్లి ఎంపీపీగా పనిచేసిన అనుభవం కూడా ఉందని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.
అంతేకాదు, ఆమె అరకు ఎంపీ తనూజకు దగ్గరి బంధువు కూడా కావడంతో పార్టీ అధిష్ఠానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన వైసీపీ పెద్దలంతా అనూషకే మద్దతు ఇస్తున్నారు. దీంతో అనూషకు అనూహ్యంగా ఈ పీఠం దక్కబోతోందని అంటున్నారు.
ఇద్దరు కీలక నేతలు ఓటమి పాలవడమే అనూషకు ఈ అవకాశాన్ని కల్పిస్తోందని చెబుతున్నారు. వైసీపీ పోరాడి సాధించుకున్న ఏకైక జెడ్పీ పీఠం కావడంతో పార్టీ నేతలంతా ఈ వైపే చూస్తున్నారు. కొత్త చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారానికి పార్టీ పెద్దలు తరలివస్తారని అంటున్నారు.

A.P. loni medical Colleges ammestunna bolli Naidu ku rajamundry pakka cheyandi Jagan gaaru
oho medical collegilu gurthu vocchaya ..