Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ వాయిదాపడిన పెద్ద సినిమా

మళ్లీ వాయిదాపడిన పెద్ద సినిమా

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భారతీయుడు-2. వాయిదాలు ఈ సినిమాకు కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే గతేడాదిలోనే విడుదల కావాల్సిన చిత్రమిది. ఎట్టకేలకు భారతీయుడు-2 సినిమాను కొలిక్కి తీసుకొచ్చారు. జూన్ లో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఇంత జరిగిన తర్వాత కూడా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. జూన్ లో (లెక్కప్రకారం జూన్ 13న) రావాల్సిన ఈ సినిమా జులైకి వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం జులై 18న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఈ సినిమా వాయిదాపడ్డానికి అధికారికంగా/అనధికారికంగా కారణాలు బయటకొచ్చాయి.

ఈసారి కూడా అలాంటి ఓ రీజన్ తెరపైకొచ్చింది. భారతీయుడు-2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం జరుగుతోందంట. అందుకే ఈ సినిమా జూన్ లో కాకుండా జులైలో వస్తుందంటూ డిస్ట్రిబ్యూటర్లకు లైకా ప్రొడక్షన్స్ సంస్థ సమాచారం అందించిందంట. శంకర్ మరోవైపు గేమ్ ఛేంజర్ పనులతో కూడా బిజీగా ఉండడం వల్ల భారతీయుడు-2 కాస్త ఆలస్యమౌతౌంది.

కమల్ హాసన్ సినిమా వాయిదా పడ్డంతో కల్కి సినిమా విడుదలకు మరింత స్కోప్ పెరిగింది. భారతీయుడు-2 రిలీజైన కొన్ని వారాలకు కల్కి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడీ సినిమా ఎలాంటి పోటీ లేకుండా జూన్ 27న థియేటర్లలోకి వస్తోంది.

బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తోంది భారతీయుడు-2. ఈసారి పూర్తిగా సేనాపతి పాత్రపై ఆధారపడి ఈ సినిమా రాబోంది. కాజల్, రకుల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సిద్దార్థ్, ఎస్ జే సూర్య కీలక పాత్రలు పోషించారు. అన్నట్టు భారతీయుడు-3 కూడా రాబోతోంది. దీనికి సంబంధించి చాలా షూటింగ్ ను శంకర్ ఇదివరకే పూర్తిచేశాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?