ఎవరు ఔనన్నా, కాదన్నా, ఆదర్శ కుటుంబం సినిమాపై బజ్ తక్కువగా ఉంది. ఈరోజు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని యూనిట్‌లో కొంతమంది సభ్యులు చెప్పడం నవ్వు తెప్పిస్తోంది.
ఆడియన్స్‌లో బజ్‌కు, సెన్సార్‌కు సంబంధం లేదు. మహా అయితే సెన్సార్ టాక్ బయటకొస్తుందంతే. నిజంగా సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరగాలంటే ఈపాటికే ఏదో ఒక సాంగ్ వైరల్ అయి ఉండాలి. కానీ అలాంటిదేం జరగలేదు.
కనీసం ట్రయిలర్ అయినా సూపర్ డూపర్ హిట్టయి ఉండాలి. త్రివిక్రమ్, వెంకటేశ్ రేంజ్‌లో అది హిట్టయింది. ప్రస్తుతానికి సినిమా ప్రచారం మొత్తం దానిమీదే నడుస్తోంది. మరోవైపు త్రివిక్రమ్, తమన్ కలిసి సంప్రదాయ పద్ధతిలో ఇంటర్వ్యూలిస్తున్నారు.
అయితే ఆదర్శ కుటుంబాన్ని తక్కువగా అంచనా వేయొద్దంటున్నారు కొంతమంది. వీళ్లలో త్రివిక్రమ్ కల్ట్ ఫ్యాన్స్‌తోపాటు, వెంకీ అభిమానులున్నారు. వాళ్లు చెప్పేది నిజం కూడా. త్రివిక్రమ్ తీసే సినిమాల్లో కంటెంట్ క్లిక్ అయితే, దాని రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది.
ఇక వెంకటేశ్ నటించే సినిమాలు క్లిక్ అయితే ఏ రేంజ్‌కు వెళ్తుందో, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రుచిచూపించింది. సో.. ప్రస్తుతానికైతే ఆదర్శ కుటుంబంపై లో-బజ్ ఉన్నమాట వాస్తవం.
ఈ 3 రోజుల్లో మేకర్స్ ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేస్తారనే దానిపై అడ్వాన్స్ బుకింగ్స్, అంచనాలు ఆధారపడి ఉంటాయి.
