ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికలు రంజుగా ఉన్నాయి. ఇక్కడి మేయర్ స్థానాన్ని జనసేన ఆశించింది. అయితే టీడీపీ మాత్రం ససేమిరా అన్నది. ఓసీ జనరల్‌కు మేయర్ స్థానం ఖరారైంది.
ప్రస్తుతం పోటీ టీడీపీ, వైసీపీ మధ్య నువ్వానేనా అన్నట్టుంది. అయితే అధికారంలో ఉన్న పార్టీకి సానుకూలత అంశాలు ఎటూ వుంటాయి.
మరోవైపు వైసీపీ మేయర్ అభ్యర్థిగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన కుప్పం ప్రసాద్‌ను బరిలో నిలిపారు. ఇతనికి నగరంలో మంచి పేరు వుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వైసీపీని వీడిన తర్వాత, ఆ పార్టీ ఎదుర్కొంటున్న మొదటి ఎన్నికలివి.
వైసీపీ ఒంగోలు ఇన్‌చార్జ్‌గా చుండూరి రవిబాబుకు జగన్ బాధ్యతలు అప్పగించారు. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం విశేషం.
ఇదిలా వుండగా టీడీపీ తరపున మేయర్ అభ్యర్థిగా నల్లమల్లి శ్రీ శిల్పను బరిలో నిలిపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి అయినప్పటికీ, ఆమె భర్త బాలు వైశ్య సామాజిక వర్గం. దీంతో సామాజిక సమీకరణలు వర్కౌట్ అవుతాయనేది టీడీపీ ఆలోచన.
అయితే గత రెండున్నరేళ్లలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజానీకంలో వ్యతిరేకత వుంది. ముఖ్యంగా వర్తకులు చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది.
వైశ్యులు ఎంతగానో ఆరాధించే దివంగత రోశయ్య విగ్రహాన్ని తొలగించడంపై ఆ సామాజిక వర్గం గుర్రుగా వుంది. ఇదే ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రం బ్రహ్మాండంగా కొనసాగిస్తున్నారు.
ఇదెక్కడి న్యాయమని వైశ్యులు ప్రశ్నిస్తున్నారు. అలాగే వైసీపీకి టీడీపీలోని అసంతృప్తులు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది.
వైసీపీ ఓడిపోయాక వివిధ కారణాల వల్ల ఆ పార్టీకి దూరమైన వాళ్లంతా, స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అని దగ్గర అవుతున్నారని సమాచారం.
ప్రస్తుతానికైతే ఒంగోలులో పని అయిపోయిందనుకున్న వైసీపీ పుంజుకుంటోంది. ఎమ్మెల్యేకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎన్నికల్లో ఏమవుతుందో చూడాలి.

MLA ఎలక్షన్ కీ దాము ఓటమి పక్క
సింగిల్ వార్డ్ కూడా గెలవదు వైసీపీ.
సింగల్ వార్డు కూడా గెలవదు అన్నియ పార్టీ.
YCP katha open cheyatam kastame.
YCP utter flop in ongole.
నువ్వు ఏమీ కంగారు పడకు జగన్ కుక్క. TDP గెలుస్తుంది ఒంగోలులో. YCP ఎప్పటికీ గెలవదు ఇక్కడ ఇంకా లైఫ్‌లో. నెక్స్ట్ 2029 కూడా
నువ్వు ఏమీ కంగారు పడకు జగన్ కుక్క. TDP గెలుస్తుంది ఒంగోలులో. YCP ఎప్పటికీ గెలవదు ఇక్కడ ఇంకా లైఫ్‌లో. నెక్స్ట్ 2029 కూడా
సదురు రోశయ్య గారి పట్ల మన అన్న ప్రవర్తన గుర్తుకు వస్తే….వేసే వాళ్ళు కూడా వెయ్యరు