స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడుతోందన్నది నిజం. దీన్ని సాకుగా చూపుతూ, నామినేషన్లు వేయనివ్వకుండా, టీడీపీ నేతలతో కొందరు వైసీపీ నేతలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టి, పరిమితమైన సీట్లతో వైసీపీ నేతలు సరిపెట్టుకున్నారు. ఈ తీరుపై వైసీపీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
నామినేషన్లు వేయడానికి గట్టిగా పోరాటం చేయాల్సిన పరిస్థితి గురించి తెలిసిందే. రాయలసీమ, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మున్సిపాల్టీల్లోనూ, పరిషత్ ఎన్నికల్లోనూ నామినేషన్లు వేయడమే అతిగొప్ప విజయమైంది.
వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోనే వైసీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించలేని దుస్థితి. పులివెందుల మున్సిపాల్టీలోనూ, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల్ని నామినేషన్లు వేయకుండా టీడీపీ రౌడీలు అడ్డుకున్నారు.
నిజంగా టీడీపీ రౌడీలు అడ్డుకుని, దాడులు చేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో వైసీపీ ఇన్‌చార్జ్‌లు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
నామినేషన్ల మొదటిరోజు అడ్డుకున్నప్పటికీ, ఆ తర్వాత కొంత సడలింపు ఇచ్చారు. నామినేషన్లు వేసేందుకు పోలీస్ యంత్రాంగం సహకరించింది.
కానీ ముందస్తు అవగాహనలో భాగంగా సొంత పార్టీ నేతల్ని నామినేషన్లు వేయడానికి వెళ్లకుండా అడ్డుకున్నట్టు వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి.
అలాంటి చోట నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌లు తమకు టీడీపీ నుంచి అడ్డంకులు ఎదురైనట్టు తమ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. తమ నిస్సహాయ స్థితిని వివరించారని సమాచారం.
అయితే ఇతర మార్గాల ద్వారా, అలాంటి నియోజకవర్గాల్లో అసలేం జరిగిందో వైసీపీ పెద్దలు నివేదికలు తెప్పించుకుంటున్నారని సమాచారం.
కేవలం టీడీపీ ప్రజాప్రతినిధులతో లాలూచీ పడి, వాళ్లిచ్చే కొన్ని సీట్లకు కక్కుర్తి పడ్డారని వైసీపీ ముఖ్యులకు నివేదికలు వెళుతున్నట్టు సమాచారం. అలాంటి వాటి విషయంలో రానున్న రోజుల్లో వైఎస్ జగన్ సీరియస్‌గా వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టం తెచ్చారని వైఎస్ జగన్ నమ్మితే మాత్రం, అలాంటి నియోజకవర్గాల్లో కఠిన నిర్ణయాలు తప్పవని కొంత మంది ముఖ్యులు అంటున్నారు.

ఈ ఎన్నికలు తరువాత వెతుక్కోవాలేమో ఎక్కడ ఉంది అని?up లో బీఎస్పీ మాదిరి
అక్కడక్కడ గెలిచే వాళ్ళని అన్నా మున్సిపల్ కౌన్సిల్ కి పోనిస్తాడో లేదా ఇంట్లోవ్కోర్చుని గోళ్ళు గిల్లు కోమంటాడా?
సొంత అడ్డా పులివెందులలో గట్టి అభ్యర్థులను నిలబెట్టి, అక్కడే నిలబడి, కలబడి పార్టీని గెలిపించాల్సిన నాయకుడు,బీటెక్ రవికి భయపడి, లంగాగాడిలా బెంగళూరు ప్యాలెస్ లో దాక్కు0టే..సగం సీట్లు టీడీపీకి ఏకగ్రీవం అయిపోయాయి.. తూ ఇలాంటి అసమర్థ సన్నాసి వల్ల రాష్ట్రవ్యాప్తంగా పార్టీ,&పెళ్ళాం పరువు పోయింది.
ఈడు2029లోపు బొక్కలోకి పోతే బెటర్ లేకుంటే ప్యాలెస్ పెళ్ళాం ఈడి సీటు చించేస్తుందట.
మన “తేడాసింహం” తన సొంత అడ్డాలో మగ సింహంతో చీకట్లో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని ప్యాలెస్ పెళ్ళానికి రిపోర్ట్ వచ్చింది..
అందుకే రాష్ట్రం లో ఎక్కడా లేని విధంగా కడప జిల్లాలో 85% ఛైర్మెన్ లు ఏకగ్రీవం అయ్యాయి
కానీ
ఎవరా మగ సింహం?
మన “తేడాసింహం” తన సొంత అడ్డాలో
“మగ సింహం”తో చీకట్లో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని ప్యాలెస్ పెళ్ళానికి రిపోర్ట్ వచ్చింది..
అందుకే రాష్ట్రం లో ఎక్కడాలేని విధంగా కడప జిల్లాలో 85% ఛైర్మెన్ లు ఏకగ్రీవం అయ్యాయి
కానీ
ఎవరా మగ సింహం?