స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు భారీగా తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇందులో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించి 142 నామినేషన్లు తిరస్కరించారు.
ఎన్నికల అధికారులు ఏకపక్షంగా టీడీపీకి వత్తాసు పలుకుతూ, వైసీపీ అభ్యర్థుల్ని పోటీ నుంచి తప్పించే క్రమంలో నామినేషన్లనే తిరస్కరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సోమవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
తన నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు అన్యాయంగా తమ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని కోర్టుకు వివరాలు సమర్పించారు. ఈ విషయమై 27న విచారణ నిర్వహిస్తామని హైకోర్టు చెప్పింది.
మరోవైపు నామినేషన్ల విత్‌డ్రాకు కూడా మరొక్క రోజు మాత్రమే గడువు వుంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోదు.
అయితే అన్యాయం జరిగిందనేందుకు తగిన ఆధారాల్ని సమర్పిస్తే మాత్రం, తప్పకుండా తగిన ఆదేశాల్ని ఇవ్వకుండా ఉండదు.
ఈ నేపథ్యంలో మోహిత్‌రెడ్డిని వెంట పెట్టుకుని వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. చెవిరెడ్డి పట్టుదల గురించి అందరికీ తెలిసిందే.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా పోలీసులు, ఎన్నికల అధికారులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా హైకోర్టులో చెవిరెడ్డి పిటిషన్‌పై ఉత్కంఠ నెలకుంది. వైసీపీకి సానుకూల ఫలితం వస్తే, అదో రికార్డ్‌గా మిగలనుంది.

అన్న నీ చూసి చాలా రోజులు అయింది. అధికారం లో ఉన్నపుడు గుడి సెట్లు, మద్యం వ్యాపారాలు తో బిజీగా ఉండే వారు.
అన్న నీ చూసి చాలా రోజులు అయింది. అధికారం లో ఉన్నపుడు గుడి సెట్లు, మద్యం వ్యాపారాలు తో బిజీగా ఉండే వారు.
లిక్కర్ కేసులో బెయిలు కాన్సిల్ అయితే బాగున్ను… కుక్కలా ఆ నాలుగు గోడల మధ్య తోక ఊపుకుంటూ బ్రతుకును…. వెధవ !
మద్యం డబ్బు ఎలక్షన్స్ లో తరలిస్తూ దొరికిపోయి జైలుకి పోయి వచ్చిన ఈయన చేసేది న్యాయపోరాటం!!!!!!!
పోలింగ్ ముగిసిన తర్వాత కూడా EVM బాక్సులని ధ్వంసం చేసిన రౌడీచెవిచెడ్డి కూడా న్యాయపోరాటం అంటా.. what a క్యామెడీ ఆ..!
పోయి పోయి ఈడు న్యాయపోరాటం చేస్తున్నాడా? అదీ మన PP పొన్నవోలు ని నమ్ముకుని.. What a కామెడి ఆ?