రాకా, కాకా, దాదా, కింగ్, ఫౌజీ.. అందరూ డుమ్మా

ఈ దసరాకు టాలీవుడ్ లో చాలా సందడి ఆశించారు ప్రేక్షకులు. థియేటర్లలో ఉన్న సినిమాల సంగతి తెలిసిందే.

ఈ దసరాకు టాలీవుడ్ లో చాలా సందడి ఆశించారు ప్రేక్షకులు. థియేటర్లలో ఉన్న సినిమాల సంగతి తెలిసిందే. ఇవి కాకుండా, కొత్త సినిమాల నుంచి చాలా మేటర్ ఉంటుందనుకున్నారు. కానీ దసరా అయిపోయింది, అలాంటిదేం జరగలేదు.

దసరా రోజున రామ్ చరణ్, సుకుమార్ సినిమా పూజా కార్యక్రమాలు ఉంటాయని చాలామంది భావించారు.

ఓవైపు స్క్రిప్ట్ లాక్ అవ్వకపోయినా, లాంఛనంగా సినిమాకు పూజ చేయాలనుకున్నారు. ఈ మేరకు ఆఫీస్ కుడా ఓపెన్ చేశారు. కానీ సినిమా ఓపెన్ కాలేదు.

చరణ్-సుక్కూ సినిమా మాత్రమే కాదు.. ప్రభాస్, మహేశ్, అల్లు అర్జున్ సినిమాల నుంచి కూడా సర్ ప్రైజులు ఉంటాయని భావించారు.

ఫౌజీ సినిమా కొత్త విడుదల తేదీతో పోస్టర్ వస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశించారు. దసరా సందర్భంగా వారణాసి నుంచి కొత్త పోస్టర్ వస్తుందనుకున్నారు.

ఇక అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న రాకా సినిమా నుంచి కూడా ఏదైనా ఉంటుందనుకున్నారు. కానీ ఇలాంటివేం జరగలేదు. ఈ దసరా చప్పగా సాగిపోయింది.

మరీ ముఖ్యంగా వారణాసిలో రామాయణం ఎపిసోడ్ ఉండడం, దసరాకు సినిమాకు ప్రత్యేకమైన కనెక్షన్ ఉండడంతో అప్ డేట్ ఆశించిన మహేష్ అభిమానులకు నిరాశ ఎదురైంది.

ఎప్పట్లానే ఓ విదేశీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి స్వదేశంలో పండగ చేసుకోమన్నాడు రాజమౌళి.

ఇలా చెప్పుకుండూపోతే దాదా, కాకా లాంటి చాలా సినిమాలు అప్ డేట్స్ మిస్సయ్యాయి. చివరికి నాగార్జన కూడా తన వందో సినిమా నుంచి విడుదల చేయాల్సిన టబు లుక్ ను వాయిదావేశారు. అలా ఈ ఏడాది దసరా గడిచింది.

3 Replies to “రాకా, కాకా, దాదా, కింగ్, ఫౌజీ.. అందరూ డుమ్మా”

Comments are closed.