దసరా సందర్భంగా కూతురు పేరు బయటపెట్టిన హీరోయిన్

బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ తమ రెండో కుమార్తె పేరును దసరా సందర్భంగా వెల్లడించారు.

బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ తమ రెండో కుమార్తె పేరును దసరా సందర్భంగా వెల్లడించారు.

తమ చిన్నారికి దేవి పదుకొన్‌ సింగ్ అని పేరుపెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది దీపిక పదుకోన్.

రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, తొలిసారిగా ఫ్యామిలీ ఫొటోను అభిమానులతో పంచుకుంది దీపిక. ఫొటోలో నలుగురూ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ అభిమానులను అలరించారు.

ఫొటోలో రణ్వీర్‌ సింగ్, పెద్ద కుమార్తె దువాను ఎత్తుకోగా, దువా తన చెల్లెలు దేవికి ఆప్యాయంగా ముద్దు పెడుతూ కనిపించింది. మరోవైపు, దీపికా తన చేతుల్లో చిన్నారి దేవిని ఎత్తుకుంది. ఈ క్యూట్ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ దంపతులకు 2026 సెప్టెంబర్ 19న రెండో కుమార్తె జన్మించింది. వీరి పెద్ద కుమార్తె దువా 2024 సెప్టెంబర్ 8న జన్మించింది.

2018 నవంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రైవేట్‌గా ఉంచేందుకు ఇష్టపడుతోంది.