సాధారణంగా రాజకీయ నాయకులు అలవోకగా అబద్ధాలు మాట్లాడేస్తుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. వాస్తవంలో వారు ఒక రకంగా వ్యవహరిస్తూ ప్రజల ఎదుట మీడియా ఎదుట మాట్లాడాల్సి వచ్చే సందర్భంలో ఆత్మవంచన చేసుకుంటూ తమ ప్రవర్తనకు భిన్నంగా మాట్లాడడం సహజం.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోకడలను గమనిస్తే.. ప్రస్తుతం ఆయన మాటలు అలాంటి ఆత్మవంచనకు పరాకాష్టగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో మునిసిపాలిటీలకు జరిగిన నామినేషన్ల పర్వాన్ని కూడా ఆయన అత్యంత ప్రజాస్వామికంగా జరిగినట్టుగా, పారదర్శకంగా నిజాయితీగా జరిగినట్టుగా అభివర్ణిస్తూ మాట్లాడడం గమనిస్తే.. ఆత్మవంచనలో ఇంతగా పీక్స్ కు వెళ్లిపోయారా? అని భయం కలుగుతుంది.
ఈ ఎన్నికల నామినేషన్ పర్వంలో వైసీపీ దౌర్జన్యకాండకు పాల్పడిందని ఆయన అంటున్నారు. ఈ నామినేషన్ల పర్వంలో అనేకచోట్ల వైసీపీ అభ్యర్థులు అసలు నామినేషన్ వేయలేకపోయారంటే.. కారణాలు ఏమిటో అందరికీ తెలుసు.
దాడులకు గురై, పోలీసుల అక్రమ కేసులకు భయపడి వారు నామినేషన్ కేంద్రాలకే వెళ్లలేదు. కానీ ఇప్పుడు జరిగిన ఏకగ్రీవాలు అన్నింటినీ చాలా నిజాయితీగా జరిగిన ఎన్నికలుగా ఆయన అభివర్ణించడం చిత్రం.
ఇందుకు గాను.. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పాలన కాలంలో జరిగిన ఏకగ్రీవాల లెక్కలు చెబుతున్నారు చంద్రబాబు. బలవంతంగా అప్పట్లో ఏకగ్రీవాలు చేయించారని, తమ పార్టీకి చెందిన వారు నామినేషన్లు వేయకుండా అడ్డం పడ్డారని రకరకాల ఆరోపణలు చేస్తున్నారు.
మంచిదే.. వైసీపీ హయాంలో అవన్నీ జరిగాయనే అనుకుందాం. వైసీపీ వాళ్లు అలా చేశారు గనుక.. మేం కూడా ఇవాళ, రాష్ట్రంలో అధికారం మా చేతిలో ఉన్నది గనుక దౌర్జన్యం చేయదలచుకున్నాం.. పోలీసుల వ్యవస్థని మా చెప్పుచేతల్లో పనిచేసే వ్యవస్థగా వాడుకోదలచుకున్నాం.. అని ఆయన బహిరంగంగా చెప్పి ఉంటే చాలా గౌరవంగా ఉండేది.
నామినేషన్లు వేయడానికి వచ్చిన వైసీపీ అభ్యర్థుల్ని కొట్టి తరిమిన తెలుగుదేశం గూండాలు, వారి చేతుల్లో నామినేషన్లు లాక్కుని చించేసిన వారు, అభ్యర్థుల వెంట వచ్చిన మహిళల చీరలు చించేసిన తెలుగుదేశం కీచకులు అందరూ ఇదే విషయాన్ని బాహాటంగా చెబుతున్నారు.
ఇప్పుడు అధికారం మాది.. మేం దౌర్జన్యం చేస్తాం అంటున్నారు. కానీ.. అదే మాట చెప్పడానికి చంద్రబాబునాయుడుకు ధైర్యం చాలడం లేదు. జరిగిన ఏకగ్రీవాలన్నీ ప్రజాస్వామ్యబద్ధమైనవి అంటూ ఆయన అలవిమాలిన ఆత్మవంచనకు పాల్పడుతున్నారు.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో దక్కే విజయాలు కేవలం లెక్కల్లో రికార్డులు చూసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ ఏం జరుగుతున్నదో అక్కడి ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. వారిని కలకాలం మభ్యపెట్టడం అంత సులువు కాదు!

ఓహో 20 కే”సులు లో A1 గా, 43 వేల కో”ట్ల ఛార్జిషీట్ పెట్టుకొని మంచితనం నిజాయితీ అవినీతి గురించి లెక్చర్లు ఇస్తే అన్న జ్ఞాన ప్రభోదకుడు…ఆత్మ వంచన అసలు కనపడలేదు
poram boku
బోకు లు అందరిని తరిమి కొట్టారు కదరా…ఇంకా నీలాంటి చిల్లర గాళ్ళు దాక్కున్నారు
నువ్వు మాత్రం ఏం తక్కువ…అప్పుడు వైసీపీ చేసిన దౌర్జ”న్యం అంతా లోక కళ్యాణం అని చిం”చుకొని…ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం.
11లంగాగాడు.. అధికారం ఉంటేనే అరాచకం చేసి గెలుస్తాడు..లేదంటే మైదానం వదిలేసి లంగాగాడిలా పక్క రాష్ట్ర0 ప్యాలెస్ లో దాక్కుంటాడు.. ఇలాంతోడీకి సింహ0 పులి అంటూ elevation’s
నీ ఏడుపు ఇప్పుడే ఇలా ఉంటే రేపు జనరల్ ఎలక్షన్స్ లో వైసీపీ ఓడిపోతే ఏమవుతావో పాపం
Power lo ki vasthe e mu sa lo diki aa pa pu ki vun tadi