ఇన్‌స్టా ఆదాయంలో దూసుకుపోతున్న బాలీవుడ్ అంద‌గ‌త్తె

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెండు చేతులా సంపాదిస్తోంది బాలీవుడ్ అంద‌గ‌త్తె. ఆమె ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతోంది. అందం, అభిన‌యం పెట్టుబ‌డిగా పెట్టి కోట్లాది మంది ఫాలోవ‌ర్స్‌ని సంపాదించుకోవ‌డంతో…అదే ఇప్పుడు ఆమెకు కోట్లాది రూపాయ‌లు తెచ్చి పెడు…

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెండు చేతులా సంపాదిస్తోంది బాలీవుడ్ అంద‌గ‌త్తె. ఆమె ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతోంది. అందం, అభిన‌యం పెట్టుబ‌డిగా పెట్టి కోట్లాది మంది ఫాలోవ‌ర్స్‌ని సంపాదించుకోవ‌డంతో…అదే ఇప్పుడు ఆమెకు కోట్లాది రూపాయ‌లు తెచ్చి పెడు తోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతి ఎక్కువ సంపాదిస్తున్న బాలీవుడ్ ప్ర‌ముఖుల్లో ప్రియాంక చోప్రా అగ్ర‌స్థానంలో నిలిచింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 54 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఈ అభిమాన‌మే ఆమెకు వ‌ద్ద‌న్నా ఆదాయం తెచ్చి పెడు తోంది. అభిమానుల అభిమానాన్ని సొమ్ము చేసుకోవ‌డం ఎలాగో ప్రియాంక‌చోప్రాను చూసి నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్ పెట్టేందుకు అక్ష‌రాలా రూ.2.16 కోట్లు తీసుకుంటోంది. ఇంత‌కంటే ఒక హీరోయిన్‌కి కావాల్సిందేముంది.

అప్ప‌నంగా ఆదాయానికి ఆదాయం, ప్ర‌చారానికి ప్ర‌చారం…అన్నీ వాటిక‌వే జ‌రిగి పోతున్నాయి. నాలుగో వార్షిక ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్‌లో ప్రియాంక 28వ స్థానంలో ఉన్నారు. ప్ర‌పంచ స్థాయిలో ఈ ర్యాంక్  చిన్న విష‌యం కాదు. ఇదే జాబితాలో హాలీవుడ్ స్టార్ డాన్ జాన్స‌న్ మొద‌టి స్థానంలో ఉంటూ ఒక్కో పోస్టుకు రూ.7.6 కోట్లు వ‌సూలు చేస్తున్నాడు.

ప్రియాంక అమెరికా సింగ‌ర్ , న‌టుడు నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆమె భ‌ర్త‌తో క‌లిసి అమెరికాలో ఉంటున్నారు. గ‌తంలో ఆమె మిస్ యూనివ‌ర్స్‌గా కూడా ఎంపికై ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించారు. అందం, అభిన‌యం పోటీ ప‌డేలా ఉంటాయి. అందుకే ప్రియాంక చోప్రాకు అంత క్రేజ్‌.

చచ్చిపోతానేమో అని చాలా భయమేసింది