Advertisement

Advertisement


Home > Movies - Movie News

టాలీవుడ్ బాక్సాఫీస్ కు వడదెబ్బ..!

టాలీవుడ్ బాక్సాఫీస్ కు వడదెబ్బ..!

ఒకటి కాదు, రెండు కాదు, టాలీవుడ్ బాక్సాఫీస్ పై ప్రస్తుతం ముప్పేట దాడి జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో ఎంత మంచి సినిమా వచ్చినా కష్టమే అనేలా ఉంది పరిస్థితి. ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ మ్యాచులు, ఇంకోవైపు దంచి కొడుతున్న ఎండలు.. దీంతో థియేటర్ల వైపు కన్నెత్తి చూడడం లేదు సామాన్య ప్రేక్షకులు.

ఓవైపు ఇలాంటి పరిస్థితులున్నాయని తెలిసినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాల్ని విడుదల చేస్తూనే ఉన్నారు. అవన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతూనే ఉన్నాయి. టిల్లూ స్క్వేర్ తర్వాత బాక్సాఫీస్ బరిలో గట్టిగా నిలబడిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. మార్చి నెలాఖరులో ఆ సినిమా వచ్చింది. అంటే, ఇప్పటికి దాదాపు 5 వారాలు గడిచిపోయాయి. ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.

నిజానికి అలా వచ్చిన సినిమాల్లో మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ఒకట్రెండు ఉన్నాయి. కానీ పైన చెప్పుకున్న కారణాల వల్ల ఆదరణకు నోచుకోలేకపోయాయి. సాధారణ పరిస్థితుల్లో వచ్చి ఉంటే కనీసం యావరేజ్ టాక్ తో గట్టెక్కి ఉండేవి.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. అటు ఎండలు కూడా మండిపోతున్నాయి. చాలా చోట్ల  44 డిగ్రీలు కామన్ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో మార్నింగ్, మ్యాట్నీ షోల కోసం ప్రేక్షకులు బయటకు రారు. పోనీ ఈవెనింగ్ షోలు ఫుల్ అవుతాయనుకుంటే, సరిగ్గా అదే టైమ్ కు ఐపీఎల్ మ్యాచులు మొదలవుతున్నాయి. దీంతో ఆక్యుపెన్సీ లేక బాక్సాఫీస్ వెలవెలబోతోంది.

ఇక ఈ వీకెండ్ రిలీజైన సినిమాల విషయానికొస్తే.. శబరి, ప్రసన్నవదనం, ఆ ఒక్కటి అడక్కు, బాక్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ప్రసన్నవదనం సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ ఆ టాక్ కు తగ్గట్టు జనం సినిమా హాళ్ల వద్ద కనిపించడం లేదు.

ఇక ఆ ఒక్కటి అడక్కు సినిమాకు రిలీజ్ రోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త ఎక్కువగా వచ్చాయి. అయితే ఇది హిట్ స్టేటస్ దక్కించుకోవడానికి ఇంకాస్త శ్రమపడాల్సి ఉంటుంది. మామూలు రోజుల్లో వచ్చినట్టయితే బాక్ సినిమా కొద్దోగొప్పో ఆడేది, ఇప్పుడా అవకాశం లేదు. శబరి గురించి చెప్పుకోడానికేం లేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో బాక్సాఫీస్ వద్ద కళ కనిపించాలంటే బడా సినిమా రిలీజ్ అవ్వాలి. ఆ పరిస్థితి లేదు కాబట్టి, క్రికెట్ మ్యాచులు పూర్తయ్యేంతవరకు, ఎండలు తగ్గేంత వరకు వెయిట్ చేయాల్సిందే. తప్పదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?