బాబు స‌ర్కార్ కాళ్ల‌పారాణి ఆర‌క‌ముందే…!

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌రిపాల‌న‌లో చంద్ర‌బాబు ఫెయిల్ అయ్యార‌నే చెడ్డ‌పేరు కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే తెచ్చుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

చంద్ర‌బాబు స‌ర్కార్ కాళ్ల పారాణి ఆర‌క ముందే వ్య‌తిరేక‌త మొదలైంది. ఇప్పుడీ చ‌ర్చ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా విస్తృతంగా సాగుతోంది. కూట‌మి ప్ర‌జా ప్ర‌తినిధుల ప్ర‌జా వ్య‌తిరేక ప‌నులతోనే వాళ్ల‌పై నెగెటివ్ వినిపిస్తోంది. ఇంకా నాలుగు నెల‌ల పాల‌న కూడా పూర్తి కాకుండానే, నాలుగేళ్ల పాల‌నలో వ‌చ్చినంత వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌ని .. కూట‌మి అనుకూల మీడియాలోనే క‌థ‌నాలు రావడం గ‌మ‌నార్హం. బ‌హుశా ఇంత త‌క్కువ స‌మ‌యంలో గ‌తంలో ఏ ప్రభుత్వం తీవ్ర వ్య‌తిరేకత ఎదుర్కోలేద‌ని కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వాపోతున్నారు.

ముఖ్యంగా తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చేసిన‌ తీవ్ర విమ‌ర్శ‌లు… త‌ప్ప‌ని సుప్రీంకోర్టు ఘాటు కామెంట్స్‌తో జ‌నానికి అర్థ‌మైంది. కేవ‌లం వైఎస్ జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా బ‌ద్నాం చేయ‌డానికి, చివ‌రికి దేవుని ప్ర‌సాదాన్ని కూడా స్వార్థానికి వాడుకున్నార‌నే చ‌ర్చ దేశ వ్యాప్తంగా అనుకునే ప‌రిస్థితి. జ‌గ‌న్‌ను ఏదో చేయాల‌ని తిరుమ‌ల ప్ర‌సాదం గురించి మాట్లాడితే, చివ‌రికి అది చంద్ర‌బాబు మెడ‌కే చుట్టుకుంది. బ‌హుశా తిరుమ‌ల శ్రీ‌వారు త‌న ప‌వ‌ర్‌ను చూప‌డం మొద‌లు పెట్ట‌డం వ‌ల్లే, చంద్ర‌బాబు స‌ర్కార్‌పై జ‌నంలో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌నే చ‌ర్చకు తెర‌లేచింది.

కేవ‌లం ఎన్నిక‌ల్లో ఓట్లు వేయించుకుని అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోడానికే ప్ర‌చారంలో చంద్ర‌బాబు అబ‌ద్ధాలు చెప్పార‌ని జ‌నం న‌మ్ముతున్నారు. సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాల అమ‌లు గురించి చంద్ర‌బాబు స‌ర్కార్ ఏ మాత్రం ఆలోచించ‌క‌పోవ‌డం అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతోంది. ఇంత వ‌ర‌కూ క‌నీసం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌లేని ద‌య‌నీయ స్థితిలో విజ‌న‌రీ పాల‌కుడిగా త‌న‌కు తాను చెప్పుకునే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పింఛ‌న్‌ను రూ.4 వేల‌కు పెంచ‌డం మిన‌హాయిస్తే, ఆర్థిక ప్ర‌యోజ‌నం క‌లిగించే ఏ ఒక్క హామీ అమ‌లుకు నోచుకోలేదు. ఉచిత ఇసుక ప‌థ‌కాన్ని అమ‌లు చేశామ‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌చారం చేసుకోవ‌డం మిన‌హా, ఆచ‌ర‌ణ‌లో భిన్న‌మైన ప‌రిస్థితి వుంది. గ‌తం కంటే ఎక్కువ రేటుకు ఇసుక కొనాల్సి వ‌స్తోంద‌ని వినియోగ‌దారులు వాపోతున్నారు. అంతేకాదు, ఇసుక కావాలంటే క‌నీసం వారం త‌క్కువ స‌మ‌యం ప‌ట్ట‌డం లేద‌ని, దీంతో నిర్మాణ రంగం కుదేల‌వుతోంద‌నే సంబంధిత వ్యాపారులు వాపోతున్నారు.

ఉచిత ఇసుక ప‌థ‌కం చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ఆదిలోనే తీవ్ర‌మైన ప్ర‌జావ్య‌తిరేక‌త తీసుకొస్తోంది. ఉచిత ఇసుక ఇవ్వాల‌ని జ‌నం అడ‌గ‌లేదు. ఇబ్బంది లేకుండా స‌మ‌యానికి ఇసుక ఇస్తే చాలు అని కోరుకున్నారు. అయితే చంద్ర‌బాబు అత్యుత్సాహంతో హామీ ఇచ్చి, కేవ‌లం మాట‌లకే స‌రిపెట్టార‌నే విమ‌ర్శ వ‌స్తోంది.

విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్త‌డం, బాధితుల‌కు సాయం అందించ‌క‌పోవ‌డం టీడీపీ బ‌లంగా ఉన్న ప్రాంతంలో వ్య‌తిరేక‌త‌కు దారి తీసింది. తాజాగా వ‌ర‌ద బాధితుల స‌హాయంలో భారీ దోపిడీకి పాల్ప‌డ్డారన్న ప్ర‌చారం కూట‌మి స‌ర్కార్‌కు తీవ్ర చెడ్డపేరు తీసుకోచ్చేలా వుంది. త‌మ‌ను ఆదుకోడానికి మ‌న‌సున్న మారాజులు విరాళం ఇస్తే, దాన్ని కూడా కూట‌మి నేత‌లు దిగ‌మింగార‌ని జ‌నం అనుకునే ప‌రిస్థితి. దీనిపై ప్ర‌భుత్వం నుంచి స‌రైన వివ‌ర‌ణ కొర‌వడింది.

తాజాగా మ‌ద్యం షాపులకు దర‌ఖాస్తు చేసుకోడానికి కూట‌మి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవ‌ర్నీ ముందుకు రానివ్వ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే ఇంత వ‌ర‌కూ అతి త‌క్కువ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా సొంత పార్టీ వ్యాపారుల్ని కూడా మ‌ద్యం షాపుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోకుండా అడ్డుకుంటున్నారంటే ఏ స్థాయిలో కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల బెదిరింపులున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి వ్యాపారాలు కూడా చేసుకోనివ్వ‌క‌పోతే, ఇక ప్రభుత్వం ఎందుక‌ని ద్వితీయ‌, తృతీయ శ్రేణి కూట‌మి నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ ప‌రిణామాలు ప్ర‌జాప్ర‌తినిధుల‌పై వ్య‌తిరేక‌త‌కు దారి తీస్తున్నాయి.

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌రిపాల‌న‌లో చంద్ర‌బాబు ఫెయిల్ అయ్యార‌నే చెడ్డ‌పేరు కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే తెచ్చుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈ ద‌ఫా చంద్ర‌బాబు అద్భుతంగా పాల‌న చేస్తాడ‌ని భావిస్తే, అధ్వానంగా చేస్తున్నార‌ని సొంత పార్టీ నేత‌ల నుంచే విమ‌ర్శ‌లొస్తున్నాయి. బాబు పాల‌న అధ్వానంగా వుంద‌నేందుకు… ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో మ‌ళ్లీ త‌న‌దే ప్ర‌భుత్వం అని విశ్వాసం క‌లిగించ‌డ‌మే నిద‌ర్శ‌నం.

క‌ళ్లెదుటే చంద్ర‌బాబు స‌ర్కార్‌కు చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని క‌నిపిస్తున్నా, ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితి. ఇక ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాల‌న చేయ‌వ‌య్యా అని అధికారం ఇస్తే, సన్యాసులు చేయాల్సిన ప‌నుల్ని నెత్తికెత్తుకున్నారు. ఇదేంద‌య్యా అని ప్ర‌శ్నిస్తే… స‌నాత‌న ధ‌ర్మం అని అంటున్నారు. ప‌వ‌న్ వ‌ల్ల కొన్ని వ‌ర్గాలు కూట‌మికి దూరం కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కూట‌మి స‌ర్కార్ స్వ‌యంకృతాప‌రాధం వ‌ల్లే చెడ్డ పేరు వ‌స్తోంద‌న్న‌ది నిజం.

52 Replies to “బాబు స‌ర్కార్ కాళ్ల‌పారాణి ఆర‌క‌ముందే…!”

  1. అబ్బో 175 లో 11 మందికి నెగెటివ్ అనిపించొచ్చు కానీ మెజారిట్ ప్రజలు అయితే హ్యాపీ గానే వున్నారు… అందరికీ తెలిసి వచ్చిన విషయం అంటే సెవం వుంటే కానీ అన్న ఆంధ్రకు రాడు అని…. అమరావతి కాదు మొత్తం ఏపీ స్మశానం కావాలి ఆ పార్టీకి

  2. hallucination, last stage of hallucination!! నువ్వు నీ బాస్ ఒక సారి బ్రెయిన్ check చేయించుకోండి!!

  3. nee e d u p u l o n i j a m l e d a n i n e e k u kuda t e l u s u k a d a . . . k u k k a…….j a g g a d i ki c h e p p a l e ka n u v v u e d u s t u n n a v………..v a a d a u p a l a c e l o m o d d a g u d us t u n n a d u……………..

  4. మన ఎడుపు వారికి శ్రీరామ రక్ష..ఎందుకు GA ఇంకా వంకర బుద్ది తోనే ఉన్నావ్ ? 5 ఏళ్లు మనం చేసిన అరాచకానికి జనం బెదిరి వోట్లు అటు వేసారు.

    మనం ఉన్నా అన్నీ మంచి అవకాశాలని వదిలేసి చేడు ఎక్కడ ఉంటె అక్కడ వేలు పెట్టి వాసన చూసి అది చాలక నాకి చి ఛీ

  5. మన ఎడుపు వారికి శ్రీరామ రక్ష..ఎందుకు GA ఇంకా వంకర బుద్ది తోనే ఉన్నావ్ ? 5 ఏళ్లు మనం చేసిన అరాచకానికి జనం బెదిరి వోట్లు అటు వేసారు.

    మనం ఉన్నా అన్నీ మంచి అవకాశాలని వదిలేసి చేడు ఎక్కడ ఉంటె అక్కడ వేలు పెట్టి వాసన చూసి అది చాలక నాకి చి ఛీ

  6. Well written article with facts. Should also have added the pitiful condition of law and order where Red Book killings and attacks have become a norm, could not find even a single missing women, could not find the source and people behind 25K tons of drugs and could not protect women even with women as HM in the state.

      1. So, atleast you now agree that 30000 missing women that PK spoke during elections is fake and lies. Also, the news that yellow media spread about 25K tons of drugs shipment is also fake and lies.

    1. Mr Visa garu was taking same law and order story in Rajyasabha during budget topic, he was asked to submit proofs about the 36 murders he was mentioning, did he submitted the proofs ? What happened to meeting the President about this ?

      1. I never saw any actions being taken by president’s in recent times and am not worried about that. Also, keep the issue about 36 murders aside and we can talk about it later. What happened to the election promise by Kootami about finding 30000 missing women and finding the owners for the 25K tons of drugs caught in Vizag? Was that also fake like the laddu allegations?

  7. పాపం, జగన్ మంట పీక్ లో ఉంది. ముఖ్య మంత్రి హోదా లేదాయె, విపక్ష హోదా లేదాయే, ఇంకా 1570 రాత్రులు, 1570 పగళ్లు, 4 సార్లు రోజుకి టెన్షన్ తో 1570 x 4 = 6280 వెళ్ళాక(?) కూడా మరలా ముఖ్యమంత్రి పదవి దేవుడు యెరుగు, కనీసం విపక్ష హోదా వొస్తుందన్న గ్యారంటీ లేదు, అంత గా ప్రజలు ముంచారు మరి ఫాపం, జగన్ ను.

  8. ఒరే greatandhra వెంకటరెడ్డి గా నువ్వు ఎంత విషం చీమ్మినా పోయేదేముంది! నువ్వు ఒక దొంగ వెదవవి. ..కౌంటింగ్ రోజునుండే విషం చిమ్మడం ప్రారంభించావ్ చెత్త వెదవా. Govt ఏ విషయం లొ ఫెయిల్ అయ్యిందిరా? 1 తారీకు న జీతాలు వేసినందుకా అన్ని సక్రమంగా సాగుతున్నందుకా. ..ఒరే దొంగ వెధవ వెంకటరెడ్డి గా అసలు నీలాంటివాడిని ఏ మీడియా లొ ఉంచకూడదు నిన్ను తన్నాలి చెత్త వేదవా

  9. Dear Raja Garu,

    What is the point of being highly educated if we continue to be subservient to politicians? Can’t you see that much of the news we see today is fabricated? You know very well that no media outlet is truly impartial anymore—some support the current government, while others back the opposition.

    As an educated and intellectual person, you might have changed your religion, and there’s no issue with that. But do you really think Jagan has converted just because you supported him? He hasn’t. Being educated means rising above this kind of nonsense—hating other religions or spreading false news.

    It’s time to stop this harmful narrative and focus on the truth. We must hold ourselves to higher standards of integrity and fairness

  10. మన ఎడుపు వారికి శ్రీరామ రక్ష..ఎందుకు GA ఇంకా వంకర బుద్ది తోనే ఉన్నావ్ ? 5 ఏళ్లు మనం చేసిన అరాచకానికి జనం బెదిరి వోట్లు అటు వేసారు.

    మనం ఉన్నా అన్నీ మంచి అవకాశాలని వదిలేసి చేడు ఎక్కడ ఉంటె అక్కడ వేలు పెట్టి వాసన చూసి అది చాలక నాకి చి ఛీ

  11. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సర్వ స్వతంత్రుడు, శక్తిమంతుడు. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పూర్తిగా పరాధీనుడు, శక్తి హీనుడు అని అనిపిస్తుంది

    1. కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రముగా ఉన్న రోజులు వేరు .. ఇప్పుడు రోజులు వేరు .. బాబు గోరు ఒక్కరే కాదు .. మా అన్న .. మానవతా వాది కూడా వొంగి వొంగి ఉన్నాడు ..

    2. అతడు ఎప్పుడూ ఒక్కటే అనగా అసమర్థుడే! కానీ అప్పట్లో సోషల్ మీడియా లేక శక్తిమంతుడిగా ప్రొజెక్ట్ చేశారు, ఇప్పుడు కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ ఎవరూ నమ్మడం లేదు….. అదీ మేటర్

  12. Jagan మాస్ లీడర్ , ప్రజల్లోనించి వచ్చిన ప్రజా నాయకుడు , ప్రజల మధ్యలో ఉండాలి పాలస్ లో కాదు .

  13. “కేవ‌లం వైఎస్ జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా బ‌ద్నాం చేయ‌డానికి”….do you think people only believed CBN and thats the reason jagan was defeated?

    please continue to believe it..:-p

  14. “కేవ‌లం వైఎస్ జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా బ‌ద్నాం చేయ‌డానికి”..so jagan had no role to loose in 2024?

    lol

  15. “శ్రీ‌వారు త‌న ప‌వ‌ర్‌ను చూప‌డం మొద‌లు పెట్ట‌డం వ‌ల్లే, చంద్ర‌బాబు స‌ర్కార్‌పై జ‌నంలో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌నే చ‌ర్చకు తెర‌లేచింది.”

    good try che ddi..:-p

  16. ఒక క్రైస్తవుడు పెట్టిన పార్టీ YSRCP. ఈ విషయం ఇంకెప్పుడూ మరచిపోము అంటున్నారు ఏపీ ప్రజలు

  17.  ఏం చేద్దాం అంటావ్ మరి ఎంకటి..ఆ పారాణి తెచ్చి మీ వాడికి వీరతిలకం దిద్దేస్తావా..2029 వరకు ఆగుతావా?

Comments are closed.