Advertisement

Advertisement


Home > Politics - Analysis

పవన్ మరీ ఇంత భయస్తుడా?

పవన్ మరీ ఇంత భయస్తుడా?

ఎనభై వేలకు పైగా కాపు ఓటర్లు, తెలుగుదేశం పార్టీకి వర్మ లాంటి బలమైన నాయకుడు. ఇప్పటికే పవన్ ను పైకి లేపుతూ మూడు సినిమాల నుంచి స్పెషల్ గా టీజర్లు. వీటిల్లో వారం రోజులే షూట్ చేసిన సినిమా దగ్గర నుంచి అర్ధాంతరంగా దర్శ‌కుడు తప్పుకున్న సినిమా వరకు వున్నాయి. కేవలం పవన్ కోసమే ఈ ఎన్నికల టీజర్లు విడుదల చేసారు అన్నది అందరికీ తెలిసిన సంగతే. పైగా తెలుగుదేశం ఎంచి ఎంచి సర్వేలు చేసి, భీమవరం నుంచే మళ్లీ పోటీ చేస్తా అని అనుకున్న పవన్ ను పిఠాపురం పంపించింది.

ఇక అక్కడి నుంచి రకరకాల విన్యాసాలు ప్రారంభమయ్యాయి. గాజువాకలో చేసిన మాదిరిగానే ఇక్కడే వుంటా.. ఇల్లు తీసుకున్నా అంటూ ప్రకటనలు వగైరా. ఆ తరువాత ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగిపోయింది. అన్న నాగబాబు, వదిన గారు ఇద్దరూ ఫిఠాపురంలో దగ్గర వుండి ప్రచారం చూసుకుంటున్నారు. వీధి వీధి, ఊరు ఊరు పవన్ తిరుగుతున్నారు. ఇది చాలదు అన్న‌ట్లు మెగా జూనియర్ హీరోలు వరుణ్, సాయి ధరమ్, వైష్ణవ్ వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. ఇక జబర్దస్త్ కమెడియన్లు సరేసరి.

ఇంత మంది చేసినా ఇంకా పవన్ కు భయంగానే వున్నట్లు కనిపిస్తోంది. ఎక్కడ ఏం తేడా కొట్టి తను గెలవకపోతే పరిస్థితి ఎలా వుంటుందో అన్న భయం వెన్నాడుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ ఓడిపోతే ఇక జనసేన పార్టీనే వుండదు. చంద్రబాబు అండ్ కో ప్రభుత్వం వచ్చినా పవన్ కు విలువ వుండదు. పైగా తన పార్టీ తరపున గెలిచిన వాళ్లు తన వెంట వుండే అవకాశం వుండదు. చాలా అంటే చాలా డ్యామేజ్ దాగి వుంది పవన్ కనుక ఓడిపోతే.

అందుకే ఇంకా తన ప్రయత్నం తాను చేస్తూనే వున్నారు. ఇప్పటి వరకు కమ్మ సామాజిక వర్గం తరపున ఎవరూ రంగంలోకి దిగలేదు. ఇప్పుడు నేరుగా ఫీల్డ్ లో తిరిగారు నిర్మాత నాగవంశీ. ఓపెన్ గా మద్దతు పలికారు హీరో నాని. పనిలో పనిగా చిన్న హీరో రాజ్ తరుణ్.

ఇవన్నీ చాలవన్నట్లు, తన తమ్ముడు సూపర్.. మహా త్యాగి, మహా వీరుడు, అసెంబ్లీలో వుండి తీరాల్సినవాడు, అందువల్ల గెలిపించండి అంటూ మెగాస్టార్ వీడియో బైట్ వదిలారు. చాలా అద్భుతంగా అపీల్ చేసారు తమ్ముడి కోసం మెగాస్టార్.

ఇంక ఎవరు మిగిలిపోయారు. ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, బన్నీ తప్పిస్తే. ఇంకా ప్రచారానికి నాలుగు రోజులు వుంది కనుక వీళ్లలో కొందరిని అయినా వీడియో బైట్ ల ద్వారా రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తారేమో?

ఇదంతా పవన్ ఒక్కడి కోసమే. జనసేన అభ్యర్ధుల అందరి కోసం కాదు. కేవలం పవన్ ఒక్కడి కోసం. పులివెందుల లో జగన్ కు భయం లేదు… కుప్పంలో చంద్రబాబుకు భయం లేదు… కానీ పవన్ కే ఎందుకో ఇంత టెన్షన్ ఇంత మంది మద్దతు?

భయం అంటారు.. సర్.. దీన్ని భయం…

ఇలాంటి డైలాగు రాసిన పవన్ సన్నిహిత మిత్రుడు త్రివిక్రమ్ ఎందుకు పిఠాపురం ప్రచార రంగంలోకి దిగడం లేదో? పైగా పిఠాపురం ప్రాంతంలో బ్రాహ్మణ ఓట్లు గణనీయంగా వున్నాయి. త్రివిక్రమ్ వస్తే కాస్త ప్రభావితం అయ్యే అవకాశం వుంది .

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?