జ‌న‌సేన‌లో అర్న‌బ్ తుపాను

ఎన్నిక‌ల ముందు ఒకే ఒక్క ప్రెస్‌మీట్ అనేక నిర్ణ‌యాల‌కు దారి తీసేలా ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్య‌వ‌హ‌రించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అర్న‌బ్ తుపాను భ‌య‌పెడుతుంటే, అంత‌కు మించి రాజ‌కీయంగా జ‌న‌సేన‌లో అల‌జ‌డి రేకెత్తిస్తోంది.

అర్న‌బ్ తుపాను కార‌ణంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటుకు స‌మ‌యం లేకుండా పోయింద‌ని ప‌వ‌న్ చేసిన కామెంట్ సొంత పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో తీవ్ర కోపం తెప్పిస్తోంది. అంతేకాదు, సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప‌వ‌న్‌ను ఆడుకుంటున్నారు.

కూట‌మి నేత‌ల ఒకే ఒక్క ప్రెస్‌మీట్‌. చాలా విష‌యాల్లో స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. మ‌రీ ముఖ్యంగా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌లు విన్నాక‌, ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో భ్ర‌మ‌లు ప‌టాపంచ‌ల‌య్యాయి.

అలాగే త‌మ కోసం గ‌ట్టిగా నిల‌బ‌డ‌తార‌న్న న‌మ్మ‌కం పోయింది. జ‌న‌సేనలో వుంటే, టీడీపీ జెండాను ద‌శాబ్దాల పాటు మోయాల్సిందే అనే సందేశం మ‌రోసారి ప‌వ‌న్ ఇచ్చిన‌ట్టైంది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో ఎప్ప‌టికీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ విడిపోరని స్ప‌ష్ట‌మైంది. ఇదే సంద‌ర్భంలో జ‌న‌సేన పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి ద‌శాబ్దాల స‌మ‌యం ప‌డుతుంద‌ని ప‌వ‌న్ అన్నారు. దీంతో ప‌వ‌న్‌తో ఎప్ప‌టికీ వెంట న‌డ‌వ‌కూడ‌ద‌నే నిర్ణ‌యానికి జ‌న‌సేన శ్రేణులు వ‌చ్చేలా ఉన్నాయనే మాట వినిపిస్తోంది.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉన్న‌తిని జ‌న‌సేన శ్రేణులు ఆకాంక్షించాయి. మ‌రీ ముఖ్యంగా కాపులు సీఎం కావాల‌న్న కోరిక‌ను ప‌వ‌న్ నెర‌వేర్చుతార‌ని ఆ సామాజిక వ‌ర్గం గ‌ట్టిగా విశ్వ‌సించింది.

అయితే నిన్న‌టి ప్రెస్‌మీట్‌లో ఆశ‌ల్ని అడియాస‌లు చేసిన ఘ‌న‌త ప‌వ‌న్‌దే. ఇప్ప‌ట్లో త‌న పార్టీని బ‌లోపేతం చేసే ఉద్దేశం లేద‌ని ప‌వ‌న్ కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. దానికి ద‌శాబ్దాల స‌మ‌యం ప‌డుతుంద‌నే స్ప‌ష్ట‌త త‌న‌కు వుంద‌న్నారు.

అంతేకాదు, అర్న‌బ్ తుపాను వ‌చ్చి, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటుపై చ‌ర్చించ‌డానికి అవ‌కాశం లేకుండా పోయింద‌న్న ప‌వ‌న్ కామెంట్స్ ఆయ‌న్ను అభాసుపాల్జేశాయి.

ప‌వ‌న్ చేసిన ఆ కామెంట్‌ ట్రోల‌ర్స్‌కు అస్త్ర‌మైంది. జ‌న‌సేన శ్రేణుల‌కు కూడా తీవ్ర‌మైన కోపం తెప్పిస్తోంది. కూట‌మిలోని ఇత‌ర పార్టీల‌కు లేని తుపాను, మ‌న నాయ‌కుడికే ఎందుక‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సీట్ల పంపిణీకి అర్న‌బ్ తుపానుతో సంబంధం లేద‌ని అంద‌రికీ తెలుసు. తుపాను ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతోంది. ఈ పాటికే నామినేష‌న్లు, విత్ డ్రా అన్నీ పూర్తి అయ్యాయి.

సీట్ల స‌ర్దుబాటు కోసం నాలుగు రోజులు వ‌రుస‌గా చ‌ర్చ‌లు జ‌రిపినా ఎలాంటి ఫ‌లితం లేద‌ని తేల్చారు. ఇప్పుడేమో అర్న‌బ్ తుపాను కార‌ణంగా సీట్ల స‌ర్దుబాటుకు స‌మ‌యం లేద‌ని సెల‌విచ్చారు.

తాము ఎవ‌రికైతే బీ ఫారాలు ఇచ్చామో వాళ్లే బ‌రిలో నిల‌బ‌డాల‌ని ప‌వ‌న్ ఆదేశించారు. జ‌న‌సేన‌కు ఇచ్చిన సీట్ల లెక్క ఏంటో చెప్ప‌క‌పోవ‌డాన్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి.

ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ మీడియా ముందుకు రాక‌పోయి వుంటే బావుండేది. వ‌చ్చి అన‌వ‌స‌రంగా సొంత వాళ్ల‌కు కోపం తెప్పించారు. మోస‌పోయామ‌న్న ఆవేద‌న‌ను మిగిల్చారు.

దీంతో జ‌న‌సేనాని చెప్పిన‌ట్టు టీడీపీకి ఓట్లు వేస్తారా? అనే అనుమానం క‌లుగుతోంది. ఎన్నిక‌ల ముందు ఒకే ఒక్క ప్రెస్‌మీట్ అనేక నిర్ణ‌యాల‌కు దారి తీసేలా ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్య‌వ‌హ‌రించారు.

2 Replies to “జ‌న‌సేన‌లో అర్న‌బ్ తుపాను”

  1. మండదా అక్కా.. మండదా చెల్లి .

    మండదా అన్న

    వీళ్లే మరో 30 ఏళ్ళు అంట

    ఇంకెలా రా మిమ్మల్ని విడగొట్టేది నేను..?

    ఇంకెన్ని కుట్రలు చెయ్యాలిరా నేను ..?

    ఇంకా రాష్ట్ర ప్రజల ను నా కుట్రలతో ఎంత ఇబ్బంది పెట్టాలి రా..?

    నేను చేసే కుట్రలు సరిపోవటం లేదే వీళ్ళు విడిపోవటం లేదే…

    ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అండ్ ఫైనల్ ఆ

    హతవిధీ..!!

Comments are closed.