శ్రీకాకుళం తొలి మేయర్ ఎవరు అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తిని పెంచుతున్న చర్చగా ఉంది. దాదాపు పదహారేళ్ల తర్వాత పుర ప్రజలు ఓటెత్తిన ఎన్నిక ఇది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా ఎదిగాక తొలిసారి జరిగిన ఎన్నిక ఇది. తొలి మేయర్‌గా గెలిచి చరిత్రలో నిలిచిపోయేది ఎవరు అన్నది కూడా ఇప్పుడు అంతా చర్చించుకుంటున్న అంశం.
శ్రీకాకుళం మేయర్ ఎన్నిక సాఫీగా ముగిసింది. 54.7 శాతమే పోలింగ్ నమోదైంది. మొత్తం లక్షా డెబ్బై వేలకుపైగా ఓట్లు ఉన్న కార్పొరేషన్ ఎన్నికల్లో 84 వేల మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఈ ఎన్నిక ఫలితంపై మరింత చర్చ జరుగుతోంది.
ఏపీలో నాలుగు కార్పొరేషన్లకు రెండో విడతలో ఎన్నికలు జరిగినా, అందరి చూపూ సిక్కోలు మేయర్‌పైనే ఉంది. ఇక్కడ వైసీపీ లేచి కూర్చునే ప్రయత్నం చేసింది. బలమైన అభ్యర్థి వైసీపీకి గుండ లక్ష్మీదేవి రూపంలో దొరికారు. దశాబ్దాలుగా వైరి పక్షాలుగా ఉన్న గుండ కుటుంబం, ధర్మాన కుటుంబం చేతులు కలిపి ఒక్కటిగా ముందుకు వచ్చిన ఎన్నిక ఇది.
ఈ ఎన్నికల్లో బలమైన సామాజిక వర్గం ఓట్లు వైసీపీ వైపు పోలరైజ్ అయ్యాయని ఒక చర్చ నడుస్తోంది. అలాగే కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందన్నది కూడా ప్రచారంగా ఉంది. టీడీపీ నుంచి మేయర్ అభ్యర్థిగా ఎవరైనా పోటీ చేసి ఉంటే ఫలితం వేరేగా ఉండేదని, పొత్తులో జనసేనకు అవకాశం ఇవ్వడంతో కూటమిలోని అసంతృప్తి కాస్తా క్రాస్ ఓటింగ్‌గా మారిందని అంటున్నారు.
దీంతో వైసీపీకి కొంత మొగ్గు ఉండవచ్చని ఎన్నికల అనంతర చర్చల్లో చెప్పుకుంటున్నారు. వైసీపీ మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి గెలిస్తే మంచి మెజారిటీ రావచ్చని, అదే జనసేన నుంచి మేయర్ అభ్యర్థి గెలిస్తే తక్కువ తేడాతో బయటపడవచ్చని కూడా ప్రచారం సాగుతోంది.
వైసీపీ వ్యూహాత్మకంగా ఈ ఎన్నికల్లో పనిచేయడం, క్యాడర్ అంతా కసిగా ముందుకు రావడంతో ఫలితంపై ఫ్యాన్ పార్టీ నేతల్లో పూర్తి ధీమా కనిపిస్తోంది. అయితే జనసేన గెలిచి తీరుతుందని ఆ పార్టీ నేతలు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 30న ఫలితాలు వచ్చేవరకు ఈ నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది అన్నది మాత్రం వాస్తవం.

ఎన్ని సార్లు చెప్పాలి రా వ!;ట్ట కాయ 😀 అని!
అంటే అసలు వైసీపీ కి అక్కడ సరైన అభ్యర్థి లేక టీడీపీ నుండి వచ్చిన బామ్మ నీ పట్టుకొచ్చి ఏదో సానుభూతి తో మింగెద్దాం అని చూశారా😀అంత సినిమా లేదు రో.