పెద్దవాళ్లు చిన్నవాళ్లను ఆశీర్వదిస్తుంటారు. కానీ అల్లు అరవింద్ ఆశీర్వాదం మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఆయన ఆశీర్వదించారంటే, ఆ హీరోయిన్ కు పెళ్లయిపోవాల్సిందే. గతంలో ఇలా జరిగింది. తాజాగా మరో హీరోయిన్ కు తన ఆశీర్వాదం అందజేశారు అరవింద్.
ఆకాశంలో ఒక తార సినిమాలో కీలక పాత్ర పోషించిన రుహానీ శర్మను అల్లు అరవింద్ ఆశీర్వదించారు. ముందుగా ఆమెను ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడిగారు. దాని ఆమె అడ్డంగా తలూపింది. అయితే నీకు త్వరలోనే పెళ్లవుతుందంటూ ఆశీర్వదించారు. హైదరాబాద్ అబ్బాయితోనే పెళ్లవుతుందని కూడా దీవించారు.
ఇలా దీవించడంలో అల్లు అరవింద్ కు ఓ ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో ఆయన లావణ్య త్రిపాఠిని ఆశీర్వదించారు. ఆమె ఏకంగా మెగా కోడలు అయిపోయింది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది.
లావణ్య కంటే ముందే, భీష్మ సినిమా టైమ్ లో రష్మికను ఆశీర్వదించారు. కట్ చేస్తే, ఆమె విజయ్ దేవరకొండ భార్య అయింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ స్టార్ కపుల్ గా కొనసాగుతున్నారు.
రీసెంట్ గా ఆయన మృణాల్ ఠాకూర్ ను కూడా ఆశీర్వదించారు. 33 ఏళ్ల మృణాల్ త్వరలోనే పెళ్లి కబురు మోసుకొచ్చేలా ఉంది. ఇప్పుడీ సీనియర్ ప్రొడ్యూసర్ రుహానీని కూడా దీవించారు. రుహానీ దీన్ని పాజిటివ్ గా తీసుకుంది. తనకు అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి అనే విధంగా స్పందించింది.

Mari road no 12 jagul bagotam office, roju lunch ki oka laksha , oka sari vachini inko sari radu