టీడీపీ కుట్రపన్ని తమను ఓడించిందని జనసేన వీర మహిళా కోట వినుత లబోదిబోమన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మేజర్ పంచాయతీలో టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ టీడీపీ, వైసీపీ, జనసేన మద్దతుదారుల మధ్య ముక్కోణపు పోటీ జరిగింది.
జనసేన మద్దతుతో ఆ పార్టీ వీర మహిళ కోట వినుత తల్లి నగరం జయలలిత పోటీలో నిలిచారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని వినుత ఓ రేంజ్‌లో హోరెత్తించారు.
వినుత తల్లి తరపున జబర్దస్త్ నటులు కూడా రేణిగుంటలో ప్రచారం చేశారు. ప్రతిరోజూ తన తల్లిని గెలిపించాలని కోరుతూ వినుత సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేవారు.
మరీ ముఖ్యంగా వినుత, ఆమె భర్త చంద్రబాబు రాజకీయంగా నిత్యం వివాదాల్లో వుంటారు. తమ చుట్టూ ఏదో రకమైన చర్చ జరిగేలా వారు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కూటమి తరపున జనసేన బలపరిచిన తన తల్లి పోటీలో ఉంటే, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మరో అభ్యర్థిని నిలబెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు.
దీంతో ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా వినుత తల్లిని ఓడించాలని ఎమ్మెల్యే పంతం పట్టారు. ఎమ్మెల్యే తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇక్కడ వినుత తల్లికి మూడో స్థానం దక్కడం గమనార్హం.
టీడీపీ అభ్యర్థి చిత్రకు 6,527 ఓట్లు, వైసీపీ అభ్యర్థి నిర్మలా కుమారికి 2,657, జనసేన మద్దతుతో నిలిచిన నగరం జయలలితకు 1,607 ఓట్లు వచ్చాయి.
మేజర్ పంచాయతీలో వైసీపీ మద్దతుదారుపై టీడీపీ బలపరిచిన చిత్ర 3,870 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కోట వినుత తల్లి కోసం సోషల్ మీడియాలో ప్రచారమే తప్ప, జనం నుంచి ఆదరణ కరువైంది.
ఈ ఓటమిపై వినుత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆమె ఒక వీడియోని షేర్ చేశారు. ప్రజాభిప్రాయాన్ని మార్చేశారనేది ఆమె ఆరోపణ.
తామే గెలుస్తామని రెండు రోజులు ముందుగా టీడీపీ నేతలు తనతో అన్నారని ఆమె గుర్తు చేశారు. ఆ మాట విన్నప్పుడు తనకు ఏమీ అర్థం కాలేదన్నారు. తమను ఓడించాలని ఎమ్మెల్యే పర్సనల్‌గా తీసుకుని, అందుకే అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
జనసేన నేత కోట వినూత తల్లిని ఓడించిన టీడీపీ.
ప్రచారమే లేకుండా ఎలా గెలిచారు?
వీళ్ల కాళ్ల కింద బతకాల్సిందే..
స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించలేనప్పుడు ఎన్నికలు ఎందుకు జరపాలి?- కోట వినూత https://t.co/LC48RU1s4v
— greatandhra (@greatandhranews) November 27, 2026

Adenti monnati varaku pilla pithres motham Kota Vinutha ni Janasena suspend chesindi ani fake koothalu koosara? Suspend chesina veera mahila talli ki Janasena seat icchindaa? Cheppandi raa pithres?
Ayina ma ku si gu ledhu.raa dhu kooda.pa val aikkada
Blue wave undani kutami ki arthamaindhi..chethulara nashanam chezukutunnaru kutami
అన్నియ పార్టీ సోషల్ మీడియా కె పరిమితం అయ్యింది.ఆది చూడు ముందు.
reddy
manaki kavalasindhi kooda adelemma
హత్యా రాజకీయాలు చేసి , టీడీపీ మీద ఎగిరితే ఏం లాభం. కనీసం టీడీపీ అయినా సీట్ గెలుచుకుంది, మంచిది.
లేదంటే వైసీపీ తన్నుకు పోయేది.
Y not kupam limited no pratipaksha hoda