జ‌న‌సేన ఉనికికే ప్ర‌మాదం!

ప‌ట్టుమ‌ని ప‌ది శాతం సీట్లు కూడా ఇచ్చిన దాఖ‌లాలు లేవు. ఒక‌వేళ ఎక్క‌డైనా సీట్లు కేటాయించినా, అక్క‌డ టీడీపీ రెబ‌ల్స్‌ను బ‌రిలో దింప‌డం జ‌న‌సేన‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింద‌నే సామెతను స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌న‌సేన నేత‌లు గుర్తు చేసుకుంటున్నారు.

మొద‌టి ద‌శ‌లో ప‌ట్ట‌ణ సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ముగిసింది. అయితే సుప్రీంకోర్టులో పిటిష‌న్‌తో తాత్కాలికంగా ఎన్నిక‌ల‌కు ఎస్ఈసీ బ్రేక్ వేసింది.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ నేత‌ల‌పై ర‌గిలిపోతున్నారు. క‌నీసం అంటే 30 శాతం సీట్లు ఇవ్వాల‌ని జ‌న‌సేన ప‌ట్టు ప‌ట్టింది. ఈ మేర‌కు చ‌ర్చ‌ల‌న్నీ సానుకూలంగా సాగాయ‌ని , అనుకున్న చోట పోటీ చేస్తామ‌ని జ‌న‌సేన ఎమ్మెల్యేలు , మంత్రులు ప్ర‌క‌టించారు.

తీరా నామినేష‌న్లు, ఉప సంహ‌ర‌ణ ప్ర‌క్రియ పూర్త‌య్యాక‌… బ‌రిలో అభ్య‌ర్థుల్ని చూసి జ‌న‌సేన షాక్ అవుతోంది. జ‌న‌సేన వీర మ‌హిళ ఎక్స్‌లో పెట్టిన పోస్టు గ‌మ‌నిస్తే, ఆ పార్టీలో అసంతృప్తి నివురుగ‌ప్పిన నిప్పులా వుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

స‌త్తెన‌ప‌ల్లిలో ఆరు స్థానాల్ని జ‌న‌సేన‌కు ఇస్తామ‌ని టీడీపీ న‌మ్మ‌బ‌లికింద‌ట‌. అయితే త‌మ‌కిచ్చిన ఆరింటిలో రెబ‌ల్ అభ్య‌ర్థుల‌కు టీడీపీ బీ ఫారాలు ఇచ్చింద‌ని, అలాగే నాలుగో వార్డ్‌కు చెందిన త‌మ అభ్య‌ర్థిని బ‌ల‌వంతంగా విత్ డ్రా చేయించార‌ని టీడీపీ నాయ‌కుల‌పై మండిప‌డ్డారు.

టీడీపీ నాయ‌కుల తీరు అస‌హ్యం క‌లిగిస్తోంద‌ని నామినేటెడ్ ప‌ద‌విలో వుంటున్న స‌ద‌రు జ‌న‌సేన నాయ‌కురాలు మండిప‌డ్డారు. ఈ పోస్టులో కీల‌క కామెంట్స్‌ను కూడా చూడొచ్చు.

“మా ఓట్లు కావాలి మాకు సీట్లు ఇవ్వకూడదు
మేము పోటీ చేస్తే మీకు రాజకీయ భవిష్యత్తు లేదు అందుకే పోటీ నుండి తప్పించాలి
ఇలాంటి వాళ్ల కోసమా అన్నయ్య @PawanKalyan అంత రిస్క్ చేశారు
ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉంటే మన ఉనికే ప్రమాదంలో పడుతుంది”

జ‌న‌సేన మోస‌పోవ‌డం కేవ‌లం స‌త్తెన‌ప‌ల్లె మున్సిపాలిటీకే ప‌రిమితం కాలేదు. విశాఖ‌, ఒంగోలు, నెల్లూరు …ఇలా చాలా ఉన్నాయి. ప్ర‌తిచోటా ఇదే తంతు. జ‌న‌సేన‌ను మిత్ర‌ప‌క్షంగా టీడీపీ భావించ‌డం లేదు.

ఎన్నిక‌లేవైనా జ‌న‌సేన త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తే ఓకే అన్న‌ట్టుగా టీడీపీ తీరు వుంటోంది. జ‌న‌సేన‌కు అధికారంలోనూ, ఇత‌ర‌త్రా ప‌ద‌వుల్లోనూ భాగం ఇవ్వ‌డానికి క్షేత్ర‌స్థాయి నుంచి విజ‌య‌వాడ వ‌ర‌కూ టీడీపీ నేత‌లు స‌సేమిరా అంటున్నారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో టీడీపీ నైజం బ‌య‌ట‌ప‌డింద‌ని జ‌న‌సేన నేత‌లు వాపోతున్నారు. ఈ మాత్రం దానికైతే పొత్తు ఎందుక‌నేది జ‌న‌సేన నేత‌ల ప్ర‌శ్న‌. అందుకే వీర మ‌హిళ త‌న అన్న ప‌వ‌న్‌కు హెచ్చ‌రిక జారీ చేసింది.

మీరు ఇలాగే మౌనంగా వుంటే .. చివ‌రికి మ‌న ఉనికే ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని సీరియ‌స్‌గా హెచ్చ‌రించారు. ఇలాంటి అభిప్రాయంతో జ‌న‌సేన‌లో 99 శాతం మంది ఉన్నారు.

కేవ‌లం ప‌ద‌వులు ద‌క్కించుకున్న మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌, ఎమ్మెల్సీ హ‌రిప్ర‌సాద్‌, నాగ‌బాబు లాంటి వారు మాత్రం ముద్దుముద్దు మాట‌లు చెబుతూ, టీడీపీ జెండా మోస్తూనే వుండాల‌ని అంటున్నారు.

ఎల్ల‌కాలం టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేయ‌డానికి జ‌న‌సేన శ్రేణులు సిద్ధంగా లేవు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల కోస‌మ‌ని స్వ‌యంగా ప‌వ‌న్‌క‌ల్యాణే ఇటీవ‌ల బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. మాట‌లు స‌రే, ఆచ‌ర‌ణ విష‌యానికి వ‌స్తే, ఎక్క‌డా జ‌న‌సేన‌కు త‌గిన ప్రాతినిథ్యం ద‌క్క‌డం లేదు.

ప‌ట్టుమ‌ని ప‌ది శాతం సీట్లు కూడా ఇచ్చిన దాఖ‌లాలు లేవు. ఒక‌వేళ ఎక్క‌డైనా సీట్లు కేటాయించినా, అక్క‌డ టీడీపీ రెబ‌ల్స్‌ను బ‌రిలో దింప‌డం జ‌న‌సేన‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

ఒంగోలులో నాలుగంటే నాలుగు సీట్లు ఇచ్చార‌ని జ‌న‌సేన నేత‌లు మండిప‌డుతున్నారు. ఒంగోలులో మొత్తం 62 డివిజ‌న్లు ఉన్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి లాంటి బ‌ల‌మైన నాయ‌కులు అక్క‌డ ఉన్నారు. 30 శాతం సీట్లు చొప్పున 18 సీట్లు కేటాయించాల‌ని జ‌న‌సేన కోరింది. చివ‌రికి 11 సీట్లు ఇస్తామ‌ని టీడీపీ నేత‌లు చెప్పారు.

జ‌న‌సేన అధిష్టానం ఒప్పుకోలేదు. 18 మంది జ‌న‌సేన అభ్య‌ర్థుల‌కు బీ ఫారాలు అంద‌జేశారు. దీంతో టీడీపీకి కోపం వ‌చ్చింది. 53 డివిజ‌న్ల‌లో టీడీపీ బ‌రిలోకి దిగింది. ఒంగోలులో ఏకంగా 14 చోట్ల టీడీపీ, జ‌న‌సేన త‌ల‌ప‌డ‌నున్నాయి. ఒక చోట బీజేపీ, జ‌న‌సేన పోటీ చేస్తున్నాయి.

నెల్లూరులో కూడా ఇదే ప‌రిస్థితి. ఒంట‌రిగా పోటీ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ఆ పార్టీ ముఖ్య నాయ‌కుడు శివ‌శంక‌ర్ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఇవి కేవ‌లం రెండు మూడు ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మే.

రాష్ట్ర‌మంతా దాదాపు ఇదే ప‌రిస్థితి అని సోష‌ల్ మీడియాలో జ‌న‌సేన యాక్టివిస్టులు వాపోతున్నారు. రానున్న రోజుల్లో పొత్తు కొన‌సాగ‌డం క‌ష్ట‌మ‌ని జ‌న‌సేన మాజీ నేత బొలిశెట్టి స‌త్యం హెచ్చ‌రించారు.

ఇక ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కూట‌మి మ‌ధ్య పొత్తు ప్ర‌స్తావ‌నే లేదు. ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా ఎన్నిక‌లు సాగుతున్నాయి. ఇప్పుడు జ‌న‌సేన నేత‌లంతా ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పంద‌న కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంత జ‌రుగుతున్నా ప‌వ‌న్ స్పందించ‌క‌పోతే, క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పార్టీని విడిచి వెళ్తార‌నే ఆందోళ‌న నెల‌కుంది. రానున్న రోజుల్లో ఇరు పార్టీల మ‌ధ్య ఓట్ల బ‌దిలీ జ‌ర‌గ‌ద‌నే చ‌ర్చ విస్తృతంగా సాగుతోంది.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న పార్టీని కాపాడుకోవాలంటే, సీరియ‌స్‌గా అడుగులు వేయాల్సిందే అని జ‌న‌సైనికులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

11 Replies to “జ‌న‌సేన ఉనికికే ప్ర‌మాదం!”

  1. Pavan Kalyan yemani spandinchali. Ayana Chandrababu and Lokesh yemi chepite ade cheputadu. Jana sena party ni pettunchindi daaniki oka pavan Kalyan ane cine star ni pettinchindi Chandrababu kada.

  2. వచ్చేసారి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమే లక్ష్యంగా  పోటీలో ఉండాల్సి వస్తుంది. కాకపోతే దానికీ ఓ రేటు ఉంటుంది.

Comments are closed.