వర్మ బాధ్యత పవన్‌కు లేదా?

నిజంగా పవన్ పట్టు పడితే వర్మకు ఇవ్వకుండా వుంటారా చంద్రబాబు? అలా పట్టు పట్టాల్సిన బాధ్యత కూడా పవన్ దే కదా?

పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నది తెలుగుదేశం అంతర్గత వ్యవహారమని, దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని జనసేన పలు పలు విధాలుగా స్పష్టం చేస్తూ వస్తోంది. తామేమీ అడ్డం పడలేదని పదే పదే క్లారిటీ ఇస్తోంది. ఈ క్లారిటీ సంగతి, వివరణ సంగతి అలా వుంచితే, అసలు జనసేనకు లేదా దాని అధినేత పవన్ కళ్యాణ్ కు బాధ్య‌త లేదా అన్నది అసలు సిసలు క్వశ్చను. అసలు 2024 ఎన్నికల టైమ్ లో పిఠాపురంలో ఏం జరిగింది అన్నది చూద్దాం.

పవన్ ఎక్కడ పోటీ చేస్తారు అన్నది ఎవరికీ అంతు చిక్కకుండా దాచారు. పవన్ కు గ్యారంటీగా గెలుపు లభించే సీటు కోసం చంద్రబాబు తన టీమ్ తో వెదుకులాట ప్రారంభించారు అదే టైమ్ లో పిఠాపురం ఓ ఆప్షన్ మాత్రమే అని వినిపించింది. లోకేష్ తను ఓడిన మంగళగిరిలోనే పట్టుదలగా పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు కనుక పవన్ కూడా 2019లో ఓడిన రెండు చోట్లలో ఒక చోట నుంచి మళ్లీ బరిలోకి దిగి, గెలిచి శభాష్ అనిపించుకుంటారు అని అనుకున్నారంతా.

కానీ అలా జరగలేదు. ఈ లోగా నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీ గా పోటీ చేయడానికి రెడీ అయిపోయారు. అచ్యుతాపురం ప్రాంతంలో ఇల్లు తీసుకుని, నియోజకవర్గం మొత్తం తిరగేయడం ప్రారంభించేసారు. కానీ భాజపా తరపును సిఎమ్ రమేష్ చక్రం తిప్పడంతో కథ అడ్డం తిరిగింది. తెర వెనుక పెద్ద తలకాయలు అంతా మంత్రాంగం చేసాయి. పవన్ కు పిఠాపురం, సిఎమ్ రమేష్ కు అనకాపల్లి ఇచ్చి, అనకాపల్లి త్యాగం చేసిన నాగబాబును వెయిటింగ్ లో వుంచాలని డిసైడ్ అయ్యారు. అదే పనిగా పవన్ కోసం త్యాగం చేసిన వర్మకు కూడా వెయిటింగ్ తప్పలేదు.

అంటే…వర్మ, నాగబాబు ఇద్దరూ సమానమైన త్యాగాలు చేసారు. నాగబాబుకు రాజ్య సభ ఇవ్వాల్సి వుంది కానీ కుదరలేదు. అప్పుడే ప్రకటించేసారు చంద్రబాబు నాగ‌బాబు మంత్రిని చేస్తున్నా అని. అది కూడా అధికారికంగా. ఓ సిఎమ్ హోదాలో. మరి అదే తరహా త్యాగం చేసిన వర్మ గురించి మాత్రం ప్రకటించలేదు. నాగబాబు గురించి ప్రకటించడం వెనుక పవన్ పట్టుదల లేదు అని అనుకోవడానికి లేదు. పవన్ పంతం పట్టి, ప్రయత్నించకుండా చంద్రబాబు ముందుకు రారు కదా.

మరి సిఎమ్ రమేష్ కోసం త్యాగం చేసిన తన అన్న గురించి అంతలా పట్టు పట్టిన పవన్ తన కోసం త్యాగం చేసిన వర్మ గురించి కూడా పట్టు పట్టాలి కదా? వర్మ ఇంటికి వెళ్లారు. వర్మను కూడా తిప్పుకున్నారు. వర్మ ను వదిలేస్తే ఎక్కడ దెబ్బ వేస్తారో అని విడవకుండా ఎన్నికలు జరిగినన్ని రోజులు కూడా వుంచుకున్నారు. మరి ఆ రుణం తీర్చుకోవాలి కదా.

నిజంగా పవన్ పట్టు పడితే వర్మకు ఇవ్వకుండా వుంటారా చంద్రబాబు? అలా పట్టు పట్టాల్సిన బాధ్యత కూడా పవన్ దే కదా? ఇది మరిచిపోయి, తమకేం సంబంధం అది వాళ్లు వాళ్లు చూసుకొవాలి అనడం ఎంత వరకు సబబు? 2029 ఎన్నికల్లో పవన్ మళ్లీ ఇక్కడే పొటీ చేయాలి. మరి అప్పుడు వర్మ మద్దతు మరి అక్కరలేదా? అందుకోసమేనా వైకాపా మాజీ ఎమ్మెల్యేను జనసేనలోకి తీసుకున్నది. ఇది ముందు జాగ్రత్త అనుకోవాలా? అంటే వర్మ ఇక తమకు మద్దతు ఇవ్వరు లేదా వర్మతో తమకు పని లేదు అని పవన్ అనుకుంటున్నారా?

రాజకీయంగా అయితే పవన్ ఈ విషయంలో అంత దూరదృష్టి లేకుండా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. వర్మకు ఏదో ఒక పదవి ఇప్పించి, ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం తెలివైన రాజకీయం. ఇప్పుడు చేస్తున్నది అయితే కాదు.

18 Replies to “వర్మ బాధ్యత పవన్‌కు లేదా?”

  1. మండలిలో మొత్తం 58 మంది….దుకాణం ఇంకా మూసెయ్యలేదు… ఇంకా చాలా vacancies వస్తాయి….17 ఉన్నట్లున్నాయి 2026, 2027 ki… కాస్త గుండె నిబ్బరం చేసుకోండి….వర్మ గారి భార్య కన్నా ఎక్కువ వర్మ గారి గురించి ఫీల్ అవుతున్నారు…. ప్రేమ కారిపోతోంది గా వర్మ గారి మీద…. కూటమిలో అప్పుడే చీలికలు రావు మీరు కలలు కంటున్నట్లు…. జెగ్గుకి ఇప్పట్లో కుర్చీ యోగం లేదు

  2. వర్మకు పవన్ కు అసలు సంబంధం లేదు. పవన్ ఎంఎల్ఏ గా అయ్యేముందు వర్మ కూటమి నేత, ఇప్పుడు నాదెండ్ల చెప్పినట్టు పిఠాపురం పవన్ అడ్డా కాబట్టి వర్మ జస్ట్ టీడీపీ నేత.

  3. ఇంతకీ జగన్ అన్న సొంత చెల్లి కోసం కనీసం మ్మెల్యే, ఎంపీ సీట్ అయినా ఇచ్చాడా …

  4. ఎల్లకాలం టీడీపీ జనసేన కలసివుంటాయా ఏమిటి ఈ రెండు వైసీపీ ని మూయించెయ్యటం ఖాయం ఆల్రెడీ మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎలక్షన్ లలో వేరొకళ్ళకు తోక గ వెళ్ళినప్పుడే మన వాల్యుయేషన్ ఏమిటో జనాలకు అర్థమైంది పవన్ గారు తన పార్టీ ని కూడా విస్తరించుకొంటున్నాడు ఎటు నెక్స్ట్ ఎలేచ్షన్స్ కి సీట్స్ పెరగటం ఖాయం టీడీపీ తరపున అభ్యర్థిగా ఎదో ఒక నియోజక వర్గం లో కాండిడేట్ గ వర్మ గారు పక్క అయన ఇండిపెండెంట్ గ గెలిచిన ప్రజానాయకుడు ఆయనను టీడీపీ వదులుకొని ప్రశ్న ఉత్పన్నమవదు వెసులుబాటును బట్టి ఆయనకు ఎదో మంచి పదవి కచ్చితం గ ఇస్తారు

Comments are closed.