దానికీ మాత్రం సంప‌ద సృష్టి అవ‌స‌రం లేదు!

ప్ర‌భుత్వానికి ప్రాధాన్యం రాజ‌ధానే కాబ‌ట్టి, అప్పులు, అలాగే ఇత‌ర‌త్రా నిధుల్ని సేక‌రించ‌డానికి ఆత్రుత ప్ర‌ద‌ర్శిస్తోంది.

సూప‌ర్‌సిక్స్ హామీల అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తే…జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించింద‌ని కూట‌మి ప్ర‌భుత్వ పెద్ద‌లు అంటుంటారు. సంప‌ద సృష్టించ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని, అన్ని హామీల్ని అమ‌లు చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు, మంత్రులు న‌మ్మ‌బ‌లుకుతుంటారు. త‌మ వ‌ద్ద నిధులుండి సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధి క‌లిగించ‌లేద‌ని త‌ప్పుగా అర్థం చేసుకుంటార‌నే ఉద్దేశంతో వాస్త‌వాలు చెబుతున్నాన‌ని, ప్ర‌జ‌లు కూడా అర్థం చేసుకోవాల‌ని సాక్ష్యాత్తు సీఎం ఇటీవ‌ల అన్న సంగ‌తి తెలిసిందే.

అయితే అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి మాత్రం ప్ర‌భుత్వ ఖ‌జానా గురించి ప్ర‌స్తావించ‌రు. జ‌గ‌న్ ఆర్థిక విధ్వంసం ఊసెత్త‌రు. త‌మ‌కు అత్యంత ప్రాధాన్య అంశం కావ‌డంతో రాజ‌ధాని నిర్మాణాన్ని ఎలాగైనా పూర్తి చేయాల‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ త‌హ‌త‌హ‌లాడుతోంది. అసెంబ్లీలో ఇవాళ మున్సిప‌ల్‌శాఖ మంత్రి నారాయ‌ణ అమ‌రావ‌తిపై మ‌రోసారి స్ప‌ష్ట‌త ఇచ్చారు.

అమ‌రావ‌తి నిర్మాణానికి రూ.64,721 కోట్ల‌తో అంచ‌నా వేసిన‌ట్టు మంత్రి నారాయ‌ణ తెలిపారు. ప్ర‌స్తుతం టెండ‌ర్లు కొన‌సాగుతున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. 2028కి రైతుల‌కు లేఔట్లు వేసి రైతుల‌కు ఇవ్వాల్సిన స్థ‌లాలు ఇస్తామ‌ని ఆయ‌న తెలిపారు. మూడేళ్ల‌లో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ ప‌నులు పూర్తి చేస్తామ‌ని నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు.

వరల్డ్ బ్యాంకు, ఏడీబీ రూ.13,400 కోట్లు మంజూరు చేసిందని, అలాగే కెఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు రూ.5 వేల కోట్లు రుణాలు ఇచ్చిన‌ట్టు తెలిపారు. అలాగే హడ్కో రూ.11 వేల కోట్లు ఇవ్వ‌డానికి అంగీక‌రించిన‌ట్టు మంత్రి తెలిపారు. అంతేకాకుండా రూ.1560 కోట్లు కేంద్రం గ్రాంటు కింద ఇస్తోందని మంత్రి వెల్ల‌డించారు.

ఈ నిధులు కాకుండా మిగిలిన సొమ్మును ప్ర‌భుత్వ‌మే వెచ్చించి రాజ‌ధాని నిర్మాణం చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు మంత్రి స‌మాధానాన్ని బ‌ట్టి అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ప్ర‌భుత్వానికి ప్రాధాన్యం రాజ‌ధానే కాబ‌ట్టి, అప్పులు, అలాగే ఇత‌ర‌త్రా నిధుల్ని సేక‌రించ‌డానికి ఆత్రుత ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇదే సామాన్య ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు విష‌యానికి వ‌చ్చే స‌రికి ….అంత ప్రాధాన్యం కాక‌పోవ‌డం వ‌ల్లే సంప‌ద సృష్టి అంటున్నార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

12 Replies to “దానికీ మాత్రం సంప‌ద సృష్టి అవ‌స‌రం లేదు!”

  1. నిన్న నువ్వే కదా..కేంద్రం పూచీకత్తు మీద రాజదాని కోసం అప్పు ఇస్తోంది అని రాశావ్…

  2. రాజధాని నిర్మించిన తర్వాత అది ప్రజలకి కాదా…. చంద్ర బాబు సొంత ఆస్తి అవుతుందా…. అభివృద్ధి చేస్తే రాబోయే తరాలకి భవిష్యత్తు ఉంటుంది….

  3. అర్జెంటుగా ఈ ఛానల్ పేరు గేట్ ఆంధ్రా గా మార్చాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధకి అడ్డంకిగా మారి అబద్ధాలు ప్రచారం చేస్తోంది.

    అప్పులు తెచ్చి అమరావతని అభివృద్ధి చేస్తున్నది నిజమే. కానీ ఆ అప్పులు రాష్ట్ర బడ్జెట్ నుండి తీర్చరు. ప్రభుత్వానికి పూలింగ్ ద్వారా సంక్రమించిన భూములు ప్రతీ యేటా కొద్ది కొద్దిగా అమ్ముతూ ఆ అప్పులు తీరుస్తారు.

    అంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్న మాట.నిజాలు వ్రాసినా గత ప్రభుత్వం తట్టుకోలేక అక్రమ కేసులు బనాయించింది. మరి ఈ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి వార్తలు ప్రచురిస్తున్న ఇలాంటి ఛానెల్స్ మీద చర్యలు తీసుకోవాలి.

    వీక్షకులు కూడా ఇటువంటి ఛానెల్స్ పట్ల అప్రమత్తగా ఉండాలి. నేను ఏ పార్టీ సభ్యత్వం లేని సామాన్య పౌరుడిని. అప్పుడప్పుడు ఈ ఛానెల్ ను చూస్తుంటాను. తీరు ఏమైనా మారినదా లేక ఇలాగే అర్ధ సత్యాలు వ్రాస్తున్నదా అని గమనిస్తున్నాను.

  4. ప్రజలకి ఇవ్వాల్సింది కొంచెం ఆలస్యం అయినా, పూర్తిగా ఇవ్వకపోయినా పర్వాలేదు. రాజధాని మాత్రం పూర్తి చెయ్యాలి. భవిష్యత్ లో మరో తుగ్లక్ వచ్చింది పదకొండు రాజధానులు అంటే ప్రజలు కోసి కారం పెట్టాలి

  5. మళ్ళీ భవిష్యత్ లో మరో తుగ్లక్ వచ్చి నాశనం చెయ్యకుండా ఉండాలంటే రాజధాని ముఖ్యం, ప్రజలు వెయిట్ చెయ్యగలరు

  6. భవిష్యత్ లో మళ్ళీ తింగరి నాయాల్లు వచ్చి పదకొండు రాజధానులు అనకుండా, ముందు రాజధాని నిర్మించాలి. ప్రజలు అర్ధం చేసుకోగలరు

Comments are closed.