దర్శకుల్ని అతిగా నమ్ముతున్నాడా?

ప్రతిసారి దర్శకులపై నమ్మకంతో కథలు అంగీకరిస్తూ వస్తున్నాడు గోపీచంద్. కానీ ఏ దర్శకుడూ గోపీచంద్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

కొన్నేళ్లుగా హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు గోపీచంద్. కానీ అతడు ఆశించిన కమర్షియల్ విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. అతడి ఫిల్మోగ్రఫీ ఓసారి చూస్తే, తను అవకాశాలిస్తున్న దర్శకులపై ఈ హీరో అతిగా ఆధారపడుతున్నట్టు కనిపిస్తోంది.

రీసెంట్ గా విశ్వం సినిమా చేశాడు గోపీచంద్. ఉన్నంతలో అతడి ఎంపిక సరైనదే. మంచి ఆకలి మీదున్న వైట్ల కచ్చితంగా సాలిడ్ కథ రాసుకొని ఉంటాడని నమ్మాడు. వైట్ల ఎలా చెబితే గోపీచంద్ అలా నటించాడనే విషయం ఆ సినిమా చూసిన ఎవరికైనా అర్థమౌతుంది. రిజల్ట్ మనకు తెలిసిందే.

అంతకంటే ముందు భీమా సినిమా చేశాడు. ఆ స్టోరీ ఎంపిక కూడా కరెక్టే. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గ కథనే సెలక్ట్ చేసుకున్నాడు. ఈసారి కూడా దర్శకుడ్నే నమ్ముకున్నాడు. శక్తివంచన లేకుండా కష్టపడ్డాడు. అయితే సినిమాలో ఓ బ్లాక్ తేడా కొడుతుందనే అనుమానం మాత్రం ఉండనే ఉంది. ఆ అనుమానమే నిజమైంది.

ఇక అంతకంటే ముందొచ్చిన రామబాణం విషయంలో కూడా పూర్తిగా దర్శకుడ్ని నమ్మి మునిగిపోయాడు గోపీచంద్. సినిమా పరమ రోతగా ఉందనే విషయం తెలిసి కూడా దర్శకుడు ఏదో మేజిక్ చేస్తాడని ఆశపడ్డాడు. సగం షూటింగ్ పూర్తయ్యేసరికి విషయం అర్థమైపోయింది. వెనక్కు రాలేక, ముందుకెళ్లాడు. ఫ్లాప్ తెచ్చుకున్నాడు.

ఇక ‘పక్కా కమర్షియల్’ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దర్శకుడు మారుతిపై విపరీతంగా నమ్మకం పెట్టుకున్నాడు. మరోవైపు బలమైన బ్యానర్. మారుతిపై నమ్మకంతో కళ్లుమూసుకొని చేశాడు, బోల్తాపడ్డాడు.

ఇలా ప్రతిసారి దర్శకులపై నమ్మకంతో కథలు అంగీకరిస్తూ వస్తున్నాడు గోపీచంద్. కానీ ఏ దర్శకుడూ గోపీచంద్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు సంకల్ప్ రెడ్డి వంతు. ఇతడైనా గోపీచంద్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా?

4 Replies to “దర్శకుల్ని అతిగా నమ్ముతున్నాడా?”

  1. గతిలేనమ్మకి గంజే పరమాన్నం. ఎంత మంచి నటుడు అయినా అక్కడ మార్కెట్ లేకపోతె, వచ్చిన సినిమా లు చేసుకోవాల్సిందే. త్వరలో టీవీ కో లేకపోతె రియాలిటీ షోస్ వెళ్ళిపోతారు

Comments are closed.