కాకినాడలో జ‌న‌సేన‌ను టీడీపీ మోస‌గిస్తోందా?

కాకినాడ కార్పొరేష‌న్ మేయ‌ర్ స్థానాన్ని జ‌న‌సేన నుంచి టీడీపీ లాక్కుంటున్న‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాకినాడ కార్పొరేష‌న్ మేయ‌ర్ స్థానాన్ని జ‌న‌సేన నుంచి టీడీపీ లాక్కుంటున్న‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి టీడీపీ చూపుతున్న కార‌ణం .. మేయ‌ర్ అభ్య‌ర్థిగా బ‌ల‌మైన వ్య‌క్తి డాక్ట‌ర్ కాద స‌త్య‌శ్రీ‌ని నిల‌బెట్ట‌డ‌మే.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భాగంగా నాలుగు కార్పొరేష‌న్ల మేయ‌ర్ ప‌ద‌వుల్ని జ‌న‌సేన‌కు ఇస్తున్న‌ట్టు టీడీపీ చెప్పింది. విజ‌య‌వాడ, ఏలూరు కార్పొరేష‌న్ల‌లో మేయ‌ర్ ప‌ద‌వుల్ని జ‌న‌సేన‌కే ఇచ్చారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన మేయ‌ర్ అభ్య‌ర్థులు గెలుపొందారు.

ఇక శ్రీ‌కాకుళం, కాకినాడ మేయ‌ర్ స్థానాల్ని కూడా జ‌న‌సేన‌కే కేటాయించారు. కానీ వివిధ కార‌ణాల‌తో ఆ రెండింటికి ఎన్నిక‌లు వాయిదా ప‌డి, మ‌ళ్లీ ఇప్పుడు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌ర‌పున కాకినాడ‌లో ప్ర‌ముఖ డాక్ట‌ర్ కాద వెంక‌ట‌ర‌మ‌ణ స‌తీమ‌ణి డాక్ట‌ర్ స‌త్య‌శ్రీ పేరును బ‌రిలో నిల‌ప‌డానికి నిర్ణ‌యించారు. కాకినాడ‌లో వీరి బ‌లాన్ని దృష్టిలో పెట్టుకుని, దీటైన అభ్య‌ర్థిని నిలబెడితే త‌ప్ప గెల‌వ‌లేమ‌ని టీడీపీ చెబుతోంది.

జ‌న‌సేన‌కు బ‌ల‌మైన నాయ‌కులెవ‌రూ లేర‌ని, కావున తామే మేయ‌ర్ సీటును తీసుకుంటామ‌ని ఆ పార్టీ నాయ‌కులు అంటున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా కాకినాడ ఎమ్మెల్యే కొండ‌బాబు త‌న బంధువుల్ని బ‌రిలో నిలిపేందుకు ఆస‌క్తి చూపుతున్నార‌ని స‌మాచారం. ఈయ‌న మ‌త్స్య‌కార సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. మ‌రోవైపు వైసీపీ అభ్య‌ర్థి శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గం. పోటీ ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నుంది.

త‌మ నుంచి మేయ‌ర్ లాక్కుంటార‌నే ప్ర‌చారంపై జ‌న‌సేన గుర్రుగా వుంది. ఒక‌సారి ఒప్పందం కుదిరిన త‌ర్వాత‌, తీరా నామినేష‌న్ల స‌మ‌యానికి యూట‌ర్న్ తీసుకోవ‌డం ఏంటంటూ జ‌న‌సేన నేత‌లు మండిప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం సాగుతున్న ప్ర‌చార‌మే నిజ‌మై, తాము మోస‌పోయామ‌ని జ‌న‌సేన శ్రేణులు ఆగ్ర‌హిస్తే మాత్రం, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పై ఆ ప్ర‌భావం పడే అవ‌కాశం వుంది.

2 Replies to “కాకినాడలో జ‌న‌సేన‌ను టీడీపీ మోస‌గిస్తోందా?”

  1. కాకినాడలో JSP అభ్యర్థి కాకుండా… తెదేపా అభ్యర్థి పోటీ చేసినా…. అక్కడ JSP కాకుండా వైకాపా పీఠం గెలిచినా… ఇర్రెస్టివ్ ఆఫ్ ది కాండిడేట్… మా నియోజకవర్గం లో జరిగే ప్రతి ఎన్నికల్లో… నా ఓటు ప్రతి సారి మీకే వేస్తా… 

Comments are closed.