ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో జాగ్రత్త లోకేశ్‌!

చంద్ర‌బాబు వ‌య‌సు పైబ‌డుతుండ‌డం, మ‌రోవైపు భ‌విష్య‌త్ టీడీపీ ర‌థ‌సార‌థి లోకేశ్ కావ‌డంతో, ఆయ‌నే పవన్ విషయంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ పంథా టీడీపీకి ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. సుదీర్ఘ రాజ‌కీయ , ప‌రిపాల‌నానుభ‌వం క‌లిగిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయ అవ‌స‌రాల రీత్యా జ‌న‌సేన‌, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. నిజానికి రాజ‌కీయ అవ‌స‌రాలు లేక‌పోతే, అంద‌రికంటే ఎక్కువ‌గా బీజేపీని, దాని ఎజెండాను మోస్తున్న జ‌న‌సేనాని ప‌వ‌న్‌ను చంద్ర‌బాబు ఏకిపారేసేవారు.

రాజకీయ సిద్ధాంతం రీత్యా టీడీపీది లౌకిక విధానం. గ‌తంలో గుజ‌రాత్‌లో న‌ర‌మేధం జ‌రిగిన‌ప్పుడు ఏపీ సీఎంగా చంద్ర‌బాబునాయుడు నాటి ఆ రాష్ట్ర సీఎం న‌రేంద్ర మోదీపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. సీఎం కుర్చీ నుంచి మోదీ నుంచి దించేయాల్సిందే అని నాటి ప్ర‌ధాని వాజ్‌పేయ్‌ని బాబు డిమాండ్ చేశారు. అప్పుడు ఎన్డీఏలో టీడీపీ భాగ‌స్వామ్య ప‌క్షం.

అంతెందుకు, 2019 ఎన్నిక‌ల ముందు ప్ర‌ధాని మోదీ వ‌ల్ల ముస్లింల‌కు రానున్న రోజుల్లో ఎలాంటి ప్ర‌మాదం ముంచుకొస్తుందో ప్ర‌చారంలో పెద్ద ఎత్తున హెచ్చ‌రిస్తూ ప్ర‌చారం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుంది. అందుకే ముస్లింలు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నా, అవ‌స‌రాల రీత్యా అలా చేయాల్సి వ‌చ్చింద‌ని మ‌ద్ద‌తుగా నిలిచారు.

కానీ ఇప్పుడు బీజేపీ కంటే జ‌న‌సేనాని, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైఖ‌రి టీడీపీకి మైనార్టీల్లో కోలుకోలేని దెబ్బ తీయ‌నుంది. కొన్ని మ‌తాల్ని పూర్తిగా త‌మ శ‌త్రువుల‌న్న‌ట్టుగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌లున్నాయనే విమ‌ర్శ. 2024 ఎన్నిక‌ల్లో ముస్లిం, క్రిస్టియ‌న్‌, బీసీలు, ద‌ళితులు గంప‌గుత్త‌గా కూట‌మికి అండ‌గా నిలిచారు. కానీ గ‌త ప‌ది నెల‌ల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీరుతో ఆయా వ‌ర్గాల్లో టీడీపీపై కూడా వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది.

ఇంత‌కాలం కూట‌మిని అభిమానించిన వాళ్లే ప్ర‌ధానంగా ప‌వ‌న్‌ను దృష్టిలో పెట్టుకునే విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌తి వంద మందిలో ఐదుగురికి మించి మైనార్టీలు కూట‌మిని అభిమానించ‌లేదంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. సూప‌ర్ సిక్స్ సంక్షేమ ప‌థ‌కాలు అంద‌లేద‌నో, మ‌రో ర‌కంగా ల‌బ్ధి క‌ల‌గ‌లేద‌నో వీళ్లంతా వ్య‌తిరేకించ‌డానికి కార‌ణం కానే కాదు. కేవ‌లం త‌మ‌ను ఈ దేశ పౌరులుగా గుర్తించ‌లేద‌నే అర్థం ధ్వ‌నించేలా ప‌వ‌న్ మాట్లాడుతున్నార‌ని, మైనార్టీలు, అణ‌గారిన వ‌ర్గాలు మ‌న‌స్తాపం చెందాయ‌న్న‌ది నిజం.

బీజేపీ ఎజెండాను ఎత్తుకున్న ప‌వ‌న్ తీరుతో టీడీపీ రాజ‌కీయంగా తీవ్రంగా న‌ష్ట‌పోవ‌డం ఖాయం. ప‌వ‌న్‌, బీజేపీ పోగొట్టుకునేదేమీ లేదు. ఎందుకంటే టీడీపీ వ‌ల్లే ప‌వ‌న్ ఇవాళ అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. చంద్ర‌బాబు వ‌య‌సు పైబ‌డుతుండ‌డం, మ‌రోవైపు భ‌విష్య‌త్ టీడీపీ ర‌థ‌సార‌థి లోకేశ్ కావ‌డంతో, ఆయ‌నే అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

లేదంటే ప‌వ‌న్ పుణ్యాన‌, ఫ‌లానా వ‌ర్గాల‌కు దూర‌మై రాజ‌కీయంగా న‌ష్ట‌పోయామ‌ని భ‌విష్య‌త్‌లో లోకేశ్‌, టీడీపీ నేత‌లు ల‌బోదిబోమ‌నాల్సి వ‌స్తుంది. అందుకే ప‌వ‌న్ విష‌యంలో టీడీపీ జాగ్ర‌త్త‌గా వుండాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఆ పార్టీ నాయ‌కులు ఎంత త్వ‌ర‌గా గ్ర‌హిస్తే అంత మంచిది. ఎక్క‌డైనా ప‌వ‌న్ అన్న కానీ, రాజ‌కీయాల ద‌గ్గ‌ర కాద‌ని త‌మ్ముడు లోకేశ్ గుర్తిస్తే ఆయ‌న‌కే మంచిది.

42 Replies to “ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో జాగ్రత్త లోకేశ్‌!”

  1. జగన్ తోనే జాగ్రత్త గా ఉన్నోడు…. ఇంకెవరైనా చూసుకుంటాడులే…నువ్వు కంగారుపదకు

    1. మీ పావలా పప్పు మాటలు కాదు లే కానీ ,,, జగన్ కి 40 % ఓటు బ్యాంకు ఉంది లే ,, కూటమి చూపిన దొంగ హామీలు దొంగ కూటమి డ్రామాలు ప్రజలకి అర్ధం అవుతుంది లే

      1. మరెందుకు పారిపోయారు రా MLC  లో పోటీ చేయకుండా?సరే నీ 40% సంగతి వన్ ఇయర్ లో వచ్చే లోకల్ బాడీ ఎలెక్షన్ లో చూద్దాం..ఎవ్వడిని అడ్డుకోమ్..దూలాలు పెట్టి.car లు పగల కొట్టం..నామినేషన్ వేయకుండా ఒక్కడిని కూడా ఆపం..దమ్ము వుంటే ఒక్క మున్సిపాలిటీ గెలవండరా👍👍

  2. ఏంటో.. ఈ మధ్య వెంకట్ రెడ్డి కి లోకేష్ మీద ప్రేమ, అభిమానం పొంగి పొర్లి కారిపోతున్నాయి..

    నీ జగన్ రెడ్డి జెండా ఎత్తేస్తాడని.. నీకు కూడా అర్థమైపోయిందా..?

    లిక్కర్ కేసులు జగన్ రెడ్డి పార్టీ ని పండబెట్టేస్తాయని నీ దద్ది బుర్రకి కూడా అర్థమయిపోయిందా..?

    గాలి అన్న ని లోపలేయగానే.. నెక్స్ట్ గాలి తమ్ముడు వంతు వచ్చేసిందని నీకు కూడా అర్థమయిపోయిందా..?

    ..

    నీ నీతి ప్రవచనాలు మాకు అక్కరలేదు.. నీ శకుని సూక్తులు లేకుండానే మేము 2024 లో మహాభారత యుద్ధం గెలిచాం..

    కౌరవుల శకం ముగిసిపోయింది.. నువ్వు కూడా కొట్టు కట్టేసుకుని బయల్దేరు..

  3. చెత్త వార్తలు,, లుచ్చా నా కొడకా, మేరా భారత్ మహాన్ అనే వ్యక్తి రా పవన్

  4. ఒకడు పప్పు అయితే ఇంకొకడు జోకర్ … సరిపోతారు ఇద్దరికిద్దరు

  5. చంద్ర బాబు గారు వయస్సు రీత్యా ఇదే చివరి ఎలక్షన్స్ అయినా పోతే ఇంకా టీడీపీ పార్టీ ఏమో కానీ లోకేష్ నీ మాత్రం ఆ పార్టీ సీనియర్ నాయకులే ఒక అట ఆడుకోవడం చూస్తారు ,,, భవిష్యత్తులో టీడీపీ పార్టీ నీ తిరిగి జూనియర్ ఎన్టీఆర్ చేతికి పోవడం కూడా చూస్తాం

  6. బాబు గారు పోతే ,,పవన్ తో నష్టం లేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ తో నే లోకేష్ కి భయ్యం ఉంటుంది ,, భవిష్యత్తులో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన పార్టీ కోసం మనవడు వస్తే నే ఉంటుంది లోకేష్ కి

  7. No one can believe your words and we know about both of them. You tring between fans fire. We both fans understand you don’t bother about it.. You can close your website it’s better to society

  8. అంటే నిజాలు ఎలా ఉన్నా… దేశ వ్యతిరేఖులు, హిందూ వ్యతిరేఖులను ఏమీ అనవద్దు. అంటే ఓట్లు పడవు కాబట్టి మూసుకుని ఉండమని చెబుతున్నారు అంతేగా… మీ లాంటి వారి వల్లేరా దేశం ఇలా తగలడింది.

  9. //సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అందలేదనో, మరో రకంగా లబ్ది కలగలేదని అర్ధం ధ్వనించేలా పవన్ మాట్లాడుతున్నారని, మైనార్టీలు, అణగారిన వర్గాలు మనస్తాపం చెందాయన్నది నిజం.//

    మరి జగన్ ఏంటి సూపర్ సిక్స్ అమలు కాకపోవటం వల్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది అంటున్నాడు. నువ్వు కూడా అదే ఏడుపు కదా! అయితే మీరు ఏడ్చే ఏడుపులు అన్ని అబద్దం అని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా!

  10. పవన్తో మీ జగ్లక్ పార్టీకి నష్టం అని రాయవు. వాళ్ల మధ్య చిచ్చు పెట్టడానికి ఇలాంటి రాతలు రాస్తావు.

  11. evadu vachina maaku problem ledu.Lokesh Jagan laaga CM kurchi kosam lekkalu veskoledhu.he is giving required respect to Pawan.Lokesh is a true hard worker.Not  Power centered.Jai Lokesh.Okappudu waste anukunna neney cheptunna.chaala maaraadu and his adjusting mentality ,patience ,clarity of thought and speech are enough.

  12. ఈ ఆర్టికల్ చూస్తుంటే వైసీపీ మీడియా టీడీపీ మీద కపట ప్రేమ ఒలగబోసేస్తోందనిపిస్తోంది. కొన్ని మతాల మీద పవన్ పూర్తిగా శత్రుత్వం ప్రకటించాడా? ఏ మాటలు నీకు అలా అనిపించి బాబు? ముస్లిం మతాన్ని ఆచరిస్తున్న టెర్రరిస్ట్ లు హిందువుల్ని మతం అడిగి మరీ చంపారు అనేది నిజం. పవన్ కళ్యాణ్ అది ఉన్నది ఉన్నట్టుగ చెప్పాడు. వైసీపీ మీడియా కి ఇందులో వేరే అభిప్రాయం ఏమన్నా ఉందా? ఉంటె ఆ అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు రాయండి దమ్ముంటే. హిందువులు గురించి మాట్లాడితే లౌకిక వాదం కాదా? ఎక్కడ నుంచి తీసుకు వచ్చారు ఈ డెఫినిషన్ ని? వైసీపీ లాంటి సూడో సెక్యూలర్ పార్టీ లు, మీడియా లు ఉండబట్టే దేశం ఇలా తగలడింది.

  13. ఎందుకురా తప్పుడు వార్తలు రాసి మనస్పర్తలు సృష్టిస్తారు. గ్రేట్ ఆంధ్ర జగన్ చెప్పు చేతలలో నడిచే కరపత్రం. ఇందులో ప్రచురించే వార్తలన్నీ బోగస్ ఎవరు పట్టించుకోరు.

  14. ఇంకా నయం…..సొంత బాబాయ్ కే అతి కిరాతకంగా గుండె పోటు తెప్పించిన మన అన్నయ్య ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పలేదు….సంతోషం….ప్రజలకు అన్నీ అర్దం అవుతాయి GA….మీ vote bank politics కోసం ఇన్ని సంవత్సరాలు దేశాన్ని యలా నాశనం చేశారో అందరికీ అర్దం అవుతుంది ఇప్పుడు…..ఐన TERRORISTS చేసే నీచమైన పనులను తప్పు పడితే minority votes పడవేమొ అని అనుకోవడం మీ మూర్ఖత్వం GA…..

  15. జగన్ రెడ్డి లాయర్ కే వీ విశ్వనాథన్ ఇప్పుడు సుప్రీమ్ కోర్ట్ లాయర్ అయ్యాడు అతని అక్రమ ఆస్తులు రెండు వేల కోట్లు అని ప్రచారంలో ఉంది ఆ వార్త ఎక్కడ ?

  16. ఇక్కడ వైసీపీ మీడియా చెప్తున్న అదే గుజరాత్ అల్లర్లలో చనిపోయిన ముస్లింలు ని కన్సోల్ చేస్తూ జానీ సినిమాలో నారాజు గాకుర నాజీరు అన్నయ్య అనే పాట పెట్టాడు. ఏమతానికయినా అన్యాయం జరిగితే మాట్లాడాలి. ఆ పని పవన్ కళ్యాణ్ నిక్కచ్చిగా చేస్తున్నాడు. అదే కదా లౌకిక వాదం. YCP మీడియా కి వైసీపీ నాయకులకి, జగన్ కి అంత సీన్ ఉందా? ఉందని, వాళ్ళని అలా ఉండమని చెప్పు. చచ్చినా చేయరు. ఎందుకంటే, లౌకిక వాదం పాటిస్తే ముస్లింలు క్రిస్టియన్స్ ఓట్లు పోతాయని భయం.

  17. 11 శామ్యూల్భా జగన్త్ రెడ్డి వచ్చింది  అకండ్ భరత్, పిల్ల కాకి పాకిస్థాన్  మధ్య గొడవ. బీజేపీ , జనసేన, టీడీపీ  కి కాదు. నువ్వేమో గొడవ వచ్చింది కాబట్టి BJP AP లో ప్రెసిడెంట్ రూల్ పెడుతుంది, మళ్లీ ఎలక్షన్స్ వస్తాయి నాకు ఈసారి 171/175 వస్తాయి అని డ్రీమ్స్ లోకి వెళ్లిపోయావు.

Comments are closed.