శ్రీకాకుళం పట్టణంలో ప్రజా బలం ఉన్న టీడీపీ మాజే ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి వైసీపీలో అధికారికంగా చేరిపోయారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమక్షంలో వారు పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. జగన్ కండువాలు కప్పి అందరికీ స్వాగతంగా ఆహ్వానించారు.
శ్రీకాకుళం వైసీపీ అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణ దాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా కీలక నేతలు అంతా ఈ చేరికల సందర్భంగా హాజరయ్యారు. త్వరలో జరగనున్న శ్రీకాకుళం కార్పోరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్ధిగా గుండ లక్ష్మీదేవి పేరు ప్రకటిస్తారు అని అంటున్నారు.
2014లో ఆమె టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకు ముందు అదే సీటు నుంచి ఆమె భర్త దివంగత అప్పల సూర్యనారాయణ కూడా గెలిచారు.
గుండ కుటుంబానికి సొంతంగా శ్రీకాకుళం పట్టణంలో బలం ఉంది. దాంతో పాటుగా టీడీపీలో వారికి అన్యాయం జరిగింది అన్న సానుభూతి ఉంది. టీడీపీలో ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు తాము 1985లో పార్టీలో చేరామని ఆమె గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో రెండున్నరేళ్ళ కూటమి పాలనలో ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని ఆమె విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పోకడల మీద ఆమె మాట్లాడుతూ విలువలు లేవని ఆక్షేపించారు. రాష్ట్రం కూడా అన్ని రంగాలలో వెనకబడిపోయింది అని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే వైసీపీలో చేరుతున్నామని ఆమె చెప్పారు.
తొలి విడత ఎన్నికలతో పాటు శ్రీకాకుళానికి ఎన్నికలు జరగలేదు, కోర్టు కేసుల వల్ల ఆలస్యం అయింది. డిసెంబర్ లో ఎన్నికలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ మేయర్ అభ్యర్థిగా లక్ష్మీ దేవి పోటీలో ఉంటారని అంటున్నరు.
గుండ కుటుంబం ప్రతిష్ట పలుకుబడితో పాటు వైసీపీ ఓటు బ్యాంక్ ధర్మాన ప్రసాదరావు రాజకీయ వ్యూహాలతో శ్రీకాకుళం మేయర్ సీటు వైసీపీ పరం అవుతుందని భావిస్తున్నారు.
మేయర్ సీటుని టీడీపీ జనసేనకు కేటాయించింది. దాంతో కూటమిలో లుకలుకలు తమకు అనుకూలిస్తాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. మేయర్ అభ్యర్థిగా గుండా లక్ష్మీదేవి బెస్ట్ చాయిస్ అని అంటున్నారు.

టీడీపీ నుండి వచ్చేంతవరకు అభ్యర్థి దొరక లేదన్నమాట..అన్నీ చోట్లా అదే పరిస్థితి..
మనం అలా అనుకుని తృప్తి పడాలి లే రా..
mari vallu physco antaru malli babu vallada chikutadu aa party vallana tesukuntadu
హమ్మయ్య, మా పొట్టన్నకు మొత్తానికి చాలా రోజుల తర్వాత పని దొరికింది. ఇంకో రెండు నెలలు హ్యాపీ గా విశ్రాంతి తీసుకోవచ్చు.
Y.-.C.-.P కి అబ్యర్దులు లెక TDP నుండి తీసుకుంటున్నారా?
ఆ ముక్క చెప్పటనికి ఇంత డ్రామా అవసరమా?
mari ycp tdp tesukunta langa party aa
పనికిరాని పాతసామాన్లు కొంటాం.. — జగేన్ మోహన
ఆమె కి సీట్ దొరకలేదు… పార్టీ మారింది తప్పులేదు..
అభివృద్ధి లేదు అంటే జనం మొహం మీద ఉమ్ము వేస్తారు
ధర్మాన ఇంట్లో పోటీ చెయ్యడానికి ఎవరూ లేరా?లేక ముందుకు రాలేదా?
గెలుస్తాం అనే నమ్మకంలేక మీ ఇంట్లో వాళ్లను వదిలి, ఈమెను తెచ్చి భలి ఇవ్వడం ధర్మమేనా ధర్మానా?
పుంగనూరు పెద్ది ఈ ఎన్మేనికల్లో ము పోటీ చెయ్యం అన్నాడు..
“ప్రొద్దుటూరు బర్రెప్రసాదరెడ్డి” సైలెంట్ గా తన పెళ్ళాం తో నామినేషన్ withdraw చేయించాడు.
ఇగ ఎన్నో అరాచకాలు చేయించిన అసలైన లంగాగాడు మాత్రం ఇప్పుడు టైమ్ వాళ్ళది వాళ్ళు కొడతారు.. కొట్టించుకోండి అంటూ వాగి తుర్రున పక్క రాష్ట్రంలోకి పారిపోయి దాక్కున్నాడు.
కోర్టుల మాటున దాక్కుని ఎన్నికలు వాయిదా వేస్తున్నాడు.
అధికారం లేకపోతే ఇదీ వీళ్ల పరిస్థితి..
ఇంతోటి దానికి ఈ నాయాళ్లని పులి సింహం అంటూ తెగ elevations ఇస్తుంటారు..
ఏది ఎలెక్షన్ జరగని కార్పొరేషన్ జనసేన కి ఇచ్చారు అని కూటమి మీద నువ్వు ఏడ్చినా శ్రీకాకుళం కేనా?
టీడీపీ ఇంకా క్లోజ్ కావడానికి అడుగులు పడ్డయి ఇంకా టీడీపీ వచ్చేది లేదు
హార్డ్ లక్ అమ్మమ్మా..!!!