చంద్రబాబు హెచ్చరికలు తాటాకు చప్పుళ్లేనా?

చంద్రబాబు నిజంగా హెచ్చరించినా వారు పట్టించుకోవడం లేదంటే.. ఆ పార్టీలో ఆయన హవా పతనం అయిపోయిందని..

లిక్కర్ దుకాణాలను ప్రభుత్వ రంగం నుంచి ప్రెవేటు రంగానికి బదలాయించే పర్వం పరిపూర్ణం అయింది. దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకుని, లాటరీలో ఆ అవకాశం పొందిన వారు షాపులను బుధవారం నుంచి తామే నిర్వహించబోతున్నారు.

లిక్కర్ ద్వారా ఒక్క రూపాయి ఆదాయం వచ్చినా సరే.. అది పూర్తిగా ప్రభుత్వ ఖజానాకే దాఖలు పడే పరిస్థితి నుంచి.. ఆ రూపాయికోసం సిండికేట్లు, వారి నుంచి దందాలు ఆశిస్తున్న వారు అనేకులు కలిసి కలబడి ప్రతినెలా కొట్టుకుంటూ ఉండే వాతావరణాన్ని చంద్రబాబునాయుడు చాలా సమర్థంగా రాష్ట్రంలో ప్రతిష్టించారు. అలాంటి సంకేతాలు కనిపించేలా.. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఇప్పటికే షాపులు పొందినవారిని బెదిరిస్తుండడం, వాటాలు డిమాండ్ చేస్తుండడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం కూడా గమనించాలి.

చంద్రబాబునాయుడు పార్టీ మీద పట్టు కోల్పోతున్నారా? ఆయన హెచ్చరికలను పార్టీ ఎమ్మెల్యేలు తాటాకు చప్పుళ్లుగా భావిస్తున్నారా? ఇది పార్టీకి, ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడు ఇమేజుకి నష్టదాయకం కాకుండా ఉంటుందా? అని అనిపిస్తోంది.

ఈ రకంగా ప్రెవేటు రంగంలో షాపులు నిర్వహిస్తున్నప్పుడు.. వ్యాపారులు ఖచ్చితంగా సిండికేట్ గా ఏర్పడి దానిని చేజిక్కించుకుంటారు. ఎవ్వరూ అడ్డుకోలేని వ్యవహారం అది. వ్యాపారులంతా సిండికేట్ కావడం వలన కేవలం దరఖాస్తుల సంఖ్య తగ్గుతుంది. ఆమేర ప్రభుత్వాదాయానికి గండిపడుతుంది. అయితే ఎమ్మెల్యేలే దగ్గరుండి తమ పార్టీ వారితో సిండికేట్లు చేయించి వారితో దరఖాస్తులు వేయించడం జరిగింది.

చంద్రబాబు మాత్రం.. అసలు ఎక్కడా సిండికేట్ కావడానికి వీల్లేదని, అలా జరగకుండా కలెక్టర్లు చూసుకోవాలని చాలాసార్లు హెచ్చరించారు. చంద్రబాబు మాటలన్నీ గాలికి కొట్టుకుపోయాయే తప్ప.. ఎవ్వరూ పట్టించుకోలేదు.

ఇప్పుడు లిక్కర్ వ్యాపారంలో రెండో అంకం నడుస్తోంది. వ్యాపారాలు యజమానులెవరో తేలిపోయింది. వారిని ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని, గుడ్ విల్ ఇస్తాం మాకు అప్పగించేసి వెళ్లాలంటున్నారని, ఎవరికి లాటరీ దక్కినా.. తమకు 20 శాతం లాభాల వాటా ఇచ్చి తీరాల్సిందే అని ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి.

ప్రభుత్వం ఇలా బెదిరిస్తున్న వారి సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకున్నట్టుగా, సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. లైసెన్సుదారుల్ని ఇబ్బంది పెడితే సహించబోయేది లేదని చంద్రబాబు హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఈ హెచ్చరికల్ని ఖాతరుచేసే దిక్కు కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు యథావిధిగా తమ దందా నడిపిస్తున్నారు. చంద్రబాబు నిజంగా హెచ్చరించినా వారు పట్టించుకోవడం లేదంటే.. ఆ పార్టీలో ఆయన హవా పతనం అయిపోయిందని, ఆయనంటే ఎవ్వరికీ భయం లేదని, ఆ పార్టీ త్వరలోనే మునిగిపోతుందని అర్థం.

ఒకవేళ అలా కాదనుకుంటే గనుక.. చ చంద్రబాబునాయుడు లోలోన తమ ఎమ్మెల్యేలకు దందాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి.. పైపైన మాత్రం ఇలాంటి నాటకీయ డైలాగులు చెబుతున్నారేమో అనుకోవాల్సి వస్తుంది.

7 Replies to “చంద్రబాబు హెచ్చరికలు తాటాకు చప్పుళ్లేనా?”

  1. Last para is true. This is all drama. Even if he warns, they will not stop. These are all deep-rooted practices and activities of majority of leaders at all levels.

  2. Kootami is in loot money mode and everyone is involved in this. Now, poor people will be on the recieving end as they will be charged extra money to pay the commissions demanded by leaders who formed these syndicates.

Comments are closed.