గొడ్డ‌లి పార్టీ ఎవ‌రిదో ఇప్పుడు తేలింది..!

గొడ్డ‌లి పార్టీ ఎవ‌రిదో, దౌర్జ‌న్యాలు చేయ‌డంలో ఆరితేరిపోయి, హ‌ద్దులు దాటుతున్న‌ది ఎవ‌రో జాతీయ స్థాయిలో చాటి చెబుతున్న‌ట్టుగా ఉంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జ‌న్యాల పార్టీ అంటూ, గొడ్డ‌లి పార్టీ అంటూ కొన్నేళ్లుగా ఒకే ప్ర‌చారాన్ని ప‌దే ప‌దే రిపీట్ చేస్తూ.. త‌మ‌ది సౌమ్య‌మైన పార్టీ అన్న‌ట్టుగా క‌ల‌రింగ్ ఇచ్చుకున్న తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నిక‌ల ముందు బోల్తా ప‌డింది.

నామినేష‌న్ల కార్యంలోనే అంతులేని దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతూ.. రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయి.. సుప్రీం కోర్టు స్థాయిలో త‌లంటించుకుని.. అటు ఎస్ఈసీ ప‌రువు తీసి.. అస‌లు దౌర్జ‌న్యం అంటే ఏమిటో, అదెలా ఉంటుందో.. తెలుగుదేశం పార్టీ చాటుకున్న‌ట్టుగా అయ్యింది!

స్థానిక ఎన్నిక‌లు ఎలాగైనా అధికారంలో ఉన్న పార్టీల‌కే అనుకూలంగా ఉంటాయి. కిర‌ణ్ కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు రాష్ట్రంలో మెజారిటీ మున్సిపాలిటీల‌ను, పంచాయ‌తీల‌ను, జ‌డ్పీల‌ను కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిచింది!

ఆ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఏమ‌య్యిందో చెప్ప‌న‌క్క‌ర్లేదు! అలా స్థానిక ఎన్నిక‌లు అనేవి ఎప్పుడూ.. అధికారంలో ఉన్న పార్టీకి న‌ల్లేరు మీద న‌డ‌క‌లాంటివే!

ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల చేత తెలుగుదేశం పార్టీ నామినేష‌న్ల‌ను వేయించి ఉంటే.. ప్ర‌జాతీర్పు ఏమిటో తేలేది! అయితే.. హ‌ద్దుల్లేని అక్ర‌మాల‌తో, ఆఖ‌రికి ఆర్వో ఆఫీసులోకి వెళ్లి, ఆర్వో చేతిలోని నామినేష‌న్ల‌ను లాక్కొంటూ.. అది కూడా వీడియోల సాక్షిగా తెలుగుదేశం పార్టీ దౌర్జ‌న్యం అంటే ఏమిటో చాటి చెప్పింది!

మున్సిప‌ల్ నామినేష‌న్ల ప్ర‌క్రియ‌నే గ‌మ‌నిస్తే.. ఎక్క‌డ నామినేష‌న్ వేయాల‌న్నా తెలుగుదేశం గూండాల‌ను దాటుకుని వెళ్లాలి, పోలీసులు అక్క‌డే ఉన్నా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల చేతుల్లోంచి నామినేష‌న్ ప‌త్రాల‌ను లాక్కొని వెళ్లారు తెలుగుదేశం రౌడీ బ్యాచ్! కొన్ని చోట్ల పోలీసులు తెలుగుదేశం వారిని బుజ్జ‌గించారు కానీ, ఎక్క‌డా అడ్డుప‌డింది కూడా లేదు!

ఇక నామినేష‌న్ల‌ను కొన్ని చోట్ల ఆర్వోలే తీసుకోలేదు! పై నుంచి ఆదేశాలున్నాయంటూ… గంట‌ల త‌ర‌బ‌డి ప్రాధేయ‌ప‌డినా నామినేష‌న్ల‌ను తీసుకోలేదు! మ‌రి కొన్ని చోట్ల ఆర్వోల ఆఫీసుల నుంచి తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు నామినేష‌న్ ప‌త్రాల‌ను ప‌ట్టుకెళ్లిపోవ‌డం కూడా వీడియోల సాక్షిగా రికార్డు అయ్యింది!

ఇక ఎంపీటీసీ నామినేష‌న్ల విష‌యంలో అయితే మ‌రో అడుగు ముందుకు ప‌డింది. అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను ఇళ్లు దాట‌నీయ‌లేదు. నామినేష‌న్ వేస్తార‌నే వారి ఇళ్ల‌పై పోలీసులు ప‌డ్డారు.

చిత‌క్కొట్టి.. వారిని ఇంటి నుంచి బ‌య‌ట‌కు కూడా రానీయ‌లేదు. ఇవ‌న్నీ దాటుకుని నామినేష‌న్ వేయ‌డానికి వెళ్లే వారిపై రాళ్ల వ‌ర్షం కురిసింది. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ నామినేష‌న్ల రెండో రోజు.. ఈ అక్ర‌మాలు మ‌రింత ప‌తాక స్థాయికి వెళ్లాయి!

ఇది సోష‌ల్ మీడియా యుగం కావ‌డంతో.. ఎక్క‌డ ఏం జ‌రుగుతున్నా.. ఆ వీడియోలు నిమిషాల్లో వైర‌ల్ గా మారుతున్నాయి. త‌ద్వారా గొడ్డ‌లి పార్టీ ఎవ‌రిదో, దౌర్జ‌న్యాలు చేయ‌డంలో ఆరితేరిపోయి, హ‌ద్దులు దాటుతున్న‌ది ఎవ‌రో జాతీయ స్థాయిలో చాటి చెబుతున్న‌ట్టుగా ఉంది.

ఏపీ స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను జాతీయ మీడియా జ‌ర్న‌లిస్టులు కూడా ట్వీట్ చేస్తున్నారు! ఇదేంటంటూ.. ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు! ఏపీ సౌత్ బిహార్ గా మారిపోయింద‌నే మాట .. వైర‌ల్ గా మారుతూ ఉంది.

అధికారంలో ఉన్న వేళ .. నామినేష‌న్ల‌కు భ‌య‌ప‌డుతూ, వాటిని అడ్డుకోవ‌డానికి త‌మ శాయ‌శ‌క్తులా దౌర్జ‌న్యాల‌ను చేస్తూ.. హింస అంటే ఏమిటో చూపిస్తూ.. రాష్ట్రం ప‌రువును తీస్తూ.. త‌న ప‌రువును పాతాళంలోకి తీసుకెళ్లిపోతోంది తెలుగుదేశం పార్టీ!

మ‌రి తెలుగుదేశం పార్టీకి ఈ ధ‌ర్మ‌సూక్ష్మాల‌ను చెప్పిందెవ‌రో కానీ.. చాలా డ్యామేజే చేజేతులారానే చేసుకుంటున్నారు!

29 Replies to “గొడ్డ‌లి పార్టీ ఎవ‌రిదో ఇప్పుడు తేలింది..!”

    1. చంద్రన్నదే… దస్తగిరికి – గొడ్డలిచ్చిన అన్నకూ ఇద్దరికీ లాయరు – లూద్రానే

      1. Arey neeku pakkalese alavatu unda entra nee message lu anni ade words vadatav GA GADU scrutiny lo nachhakapothe message lu delete chestadu neevi matram alane unchutaadu iddaridi oke alavatu emo

  1. CMలనే dictate చేసే పెద్దిరెడ్డి మేము పోటీనుండి తప్పుకుంటున్నాం అన్నాడు.

    నిలబడతాం, కలబడతాం రక్తం చిందిస్తాం, అవసరమైతే చస్తాం అన్న “ప్రొద్దుటూరు బర్రె”

    శివ ప్రసాద్రెడ్డికి ఉచ్చపడి తన పెళ్ళాంతో సైలెంట్ గా నామినేషన్ withdraw చేయించాడు.. కానీ ఎందుకు రా అరికట్లా?

  2. కోర్టుల మాటున ఎన్నాళ్లు దాక్కుంటావ్ రా లంగామోహనా?.. అధికారం ఉన్నప్పుడు చానా కోతలు కోశావ్.. అధికారం లేనప్పుడు ఇదీ నీ బతుకు.. తూ..

    ఇంతోటిదానికి పులి, సింహా0 అంటూ లేకి”ఎలివేషన్స్? దీనికంటే ఉరేసుకుని చావడం మేలు

  3. “ఇప్పుడు టైమ్ వాళ్ళది, కొడతారు.. కొట్టించుకోండి” అంటూ సుద్దులు చెప్పి, ఆడేమో తుర్రునపారిపోయి పక్కరాష్ట్రం ప్యాలెస్ లో దాక్కు0టె, మేము ఏదో కంగాళీరేపి,దొరికీ దొరకనట్టు ఒకరౌండ్ ఆల్రెడీ వాయి0చుకున్నాం..

    ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ మొదటినుండీ స్టార్ట్ చేయిస్తావా..

    సొంత కార్యకర్తల మీద ఇంత పగఏంట్రా నీకు జగనాసురా

  4. చెంబన్న లేకపోతే మా టీడీపీ పార్టీ పరిస్థితి ఇదే..ఏడాదిలో పప్పుగాడు TDP దుకాణం సర్దేస్తాడు.

  5. “ఇప్పుడు టైమ్ వాళ్ళది, కొడతారు.. కొట్టించుకోండి” అంటూ సుద్దులు చెప్పి, ఆడేమో తుర్రునపారిపోయి పక్కరాష్ట్రం ప్యాలెస్ లో దాక్కు0టె, మేము ఏదో కంగాళీరేపి,దొరికీ దొరకనట్టు ఒకరౌండ్ ఆల్రెడీ వాయి0చుకున్నాం..

    ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ మొదటినుండీ స్టార్ట్ చేయిస్తావా..

    సొంత కార్యకర్తల మీద ఇంత పగఏంట్రా నీకు జగనాసురా

  6. అదేమోగానీ ja*** ఎంత పిరికి*సన్నాసో ప్రజలకి అర్థమైంది , అధికారం ఉంటే జుట్టు లేక పోతే కా*ళ్ళు పట్టుకునే టైప్ అని బాగా అర్థం అయ్యింది!! రప్పా*రప్పా సై*కో మాత్రం ఎప్పటికీ ja*** నే అంటావ్ 🤣🤣

  7. అదేమోగానీ ja*** ఎంత పిరికి*సన్నాసో ప్రజలకి అర్థమైంది , అధికారం ఉంటే జు*ట్టు లేక పోతే కా*ళ్ళు పట్టుకునే టైప్ అని బాగా అర్థం అయ్యింది!! రప్పా*రప్పా సై*కో మాత్రం ఎప్పటికీ ja*** నే అంటావ్ 🤣🤣

    1. ఒకటో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి.. ఎమైనా దుమ్ము రేపండి అన్నియ్య, నువ్వు దమ్ము ఉంటే..

    2. ఒకటో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి..ఎమైనా దుమ్ము రేపండి అన్నియ్య నువ్వు ద-మ్ము ఉంటే..

  8. అవునా…అయితే రేపటి నుండి తెలుగుదేశం గురించి మాట్లాడేటప్పుడు గొ”డ్డ”లి చూపించి అన్న మాట్లాడాలీ….అప్పుడు ఇంకా బాగా తెలుసుకుంటారు జనం

  9. బలహీనంగా ఉన్నప్పుడే ఎదుర్కొనే దమ్ము లేకపోతే, తర్వాత ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో నాయకులు, వాళ్ళ భక్తులు!

  10. కొంచెమైనా సిగ్గుండాలి. చివరికి కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటున్నావ్. కిరణ్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏం చేసి అధికారం పోగొట్టుకుందో మర్చిపోయావా?

    అయినా ఎవరినో ఉదాహరణగా చెప్పడం ఎందుకు? అరాచకాలు చేసి, తర్వాతి ఎన్నికల్లో కుక్కచావు చచ్చిన వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఉందిగా! దాని గురించి చెప్తే బాగుండేది.

    సుప్రీంకోర్టు ఎస్‌ఈసీని ఒక నిర్ణయం మాత్రమే తీసుకోమని చెప్పింది. మిమ్మల్ని ఆధారాలు ఉంటే చూపించమని అడిగింది. అంతేకానీ, మీ ఇష్టానుసారం ఎన్నికలు పెట్టుకోమని చెప్పలేదు.

    సరే, ఇప్పుడు తేదీ మార్చి ఎన్నికలు పెడితే మాత్రం ఏమవుతుంది? మళ్లీ ఇదే జరుగుతుంది.

    మీరు చేసిన పాపాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని గుర్తిస్తే మంచిది.

  11. సొంత చెల్లలి హక్కులనె కాలారాసె వాడు…. ఎదొ మానవ హక్కులని ఉద్దరిస్తాడు అంట!

Comments are closed.