Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఇదీ ఉత్తరాంధ్ర కు చేసిన మేలు!

ఇదీ ఉత్తరాంధ్ర కు చేసిన మేలు!

అయిదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర కు ఏమీ చేయలేదని టీడీపీ లెక్కకు మిక్కిలిగా విమర్శలు చేస్తూ వచ్చింది. దానికి సరైన జవాబుని ఇచ్చాపురం సభలో ముఖ్యమంత్రి జగన్ అన్ని రకాలైన గణాంకాలతో సహా వివరించారు. ఇచ్చాపురం లో జరిగిన వైసీపీ సభకు జనాలు విరగబడి వచ్చారు.

రెండు పర్యాయాలుగా వైసీపీ ఓటమి పాలు అవుతున్నా జనాదరణ మాత్రం హెచ్చుగానే ఉంది అని ఈ సభ నిరూపించింది. ఈ సభ ద్వారానే ఉత్తరాంధ్ర కు తాము చేసిన మేలు ఎవరూ చేయలేదని జగన్ చాటారు. మూలపేట పోర్టుతో పాటు శ్రీకాకుళంలో రెండు ఫిషింగ్ హార్బర్లు, పూడిమడక వద్ద మరో ఫిషింగ్ హార్బర్ తమ ప్రభుత్వం నిర్మిస్తోంది అన్నారు. ఉత్తరాంధ్రాలో నాలుగు మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని గుర్తు చేసారు.

దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యను తామే పరిష్కరించామని ఉద్దానానికి వేయి కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటిని అందిస్తున్నామని అలాగే వంద కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పలాసాలో ఏర్పాటు చేశామని ఆయన చెప్పుకొచ్చారు.

విజయనగరంలో జే ఎంటీయూని విశ్వవిద్యాలయంగా మార్చింది తమ ప్రభుత్వమే అన్నారు. కురుపాం లో గిరిజన ఇంజనీరింగ్ కళాశాలతో పాటు సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం తమ పాలనలో పురుడు పోసుకున్నాయని చెప్పారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్ పోర్టుని శరవేగంగా తమ ప్రభుత్వం నిర్మిస్తోంది అని ఆయన తెలియచేశారు.

విశాఖలో అదానీ సెంటర్, ఇంఫోసిస్ వంటి ఐటీ కంపెనీలను తెచ్చామని అన్నారు, పెట్టుబడులు పెద్ద ఎత్తున విశాఖ సహా ఉత్తరాంధ్ర కు వచ్చాయని జగన్ వివరించారు. మూడు జిల్లాల ఉత్తరాంధ్రాను ఆరు జిల్లాలుగా చేసి పరిపాలనను జనం ముంగిటకు తెచ్చామని అన్నారు.

వీటన్నిటికంటే విశాఖను పరిపాలన పరంగా రాజధానిగా చేస్తున్నామని ప్రకటించారు. జూన్ 4న వైసీపీ విజయం తధ్యమని మరోసారి తాను ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణం చేస్తానని పాలన అక్కడ నుంచే మొదలుపెడతాను అని కోసమెరుపుగా భారీ ట్విస్ట్ ఇచ్చారు జగన్. ఉత్తరాంధ్రను అయిదేళ్ళలో తాము చేసినట్లుగా అభివృద్ధి ఎవరైనా చేశారా అని జగన్ ప్రశ్నించడం ద్వారా జనాలలో కొత్త ఆలోచనలు రేపారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?