Advertisement

Advertisement


Home > Politics - Andhra

టీడీపీ యాడ్‌లో క‌నిపించ‌ని ప‌వ‌న్‌, మోదీ!

టీడీపీ యాడ్‌లో క‌నిపించ‌ని ప‌వ‌న్‌, మోదీ!

పూర్తి స్థాయిలో మేనిఫెస్టో విడుద‌ల చేసిన‌ప్ప‌టికీ, టీడీపీ మాత్రం కేవ‌లం సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల ప్ర‌చారానికే మొగ్గు చూపుతోంది. ఈ మేర‌కు త‌మ అనుకూల ప‌త్రిక‌ల‌కు భారీ స్థాయిలో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని టీడీపీ ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అస‌లు మూడు పార్టీలు పొత్తులో ఉన్నాయా? అనే అనుమానం ఆ యాడ్ చూస్తే క‌లుగుతుంది. "స‌ర్వ‌జ‌నుల సంక్షేమం కోసం బాబును మ‌ళ్లీ ర‌ప్పిద్దాం" పిలుపుతో ప్ర‌చార‌మ‌వుతున్న వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో త‌మ‌కు స్థానం క‌ల్పించ‌క‌పోవ‌డం వెనుక టీడీపీ వ్యూహం ఏంట‌నేది బీజేపీ, జ‌న‌సేన‌ పార్టీల‌కు అర్థం కావ‌డం లేదు. టీడీపీ ఏక‌ప‌క్షంగా ఎందుకిలా ప్ర‌చారం చేసుకుంటోంద‌నే ప్ర‌శ్న ఆ రెండు పార్టీల నుంచి వ‌స్తోంది.

ఇటీవ‌ల మేనిఫెస్టో విడుద‌ల సంద‌ర్భంగా బీజేపీ అవ‌మాన‌క‌ర రీతిలో ప్ర‌వ‌ర్తించింద‌నే ఆవేద‌న ముఖ్యంగా టీడీపీలో క‌నిపిస్తోంది. పొత్తులో వుంటూ, మేనిఫెస్టోతో సంబంధం లేద‌ని చెప్ప‌డం ఏంట‌ని టీడీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజ‌కీయంగా న‌ష్ట‌పోతున్నామ‌నే బాధ టీడీపీలో చూడొచ్చు.

ఈ నేప‌థ్యంలో కూట‌మికి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ చంద్ర‌బాబునాయుడే త‌ప్ప‌, మ‌రెవ‌రూ కాద‌నే సంకేతాల్ని పంప‌డానికే ...ఆయ‌న కేంద్రంగా టీడీపీ భారీగా ప్ర‌చారం చేసుకుంటున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కూట‌మిలో ఒక‌రిపై మ‌రొక‌రికి అనుమానాలున్నాయి. ప్ర‌స్తుతం టీడీపీ అనుస‌రిస్తున్న తీరు, రానున్న రోజుల్లో ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?