Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

ప‌వ‌న్ ఒక్క చోట అయినా అలా టికెట్ ఇప్పించాడా?

ప‌వ‌న్ ఒక్క చోట అయినా అలా టికెట్ ఇప్పించాడా?

జ‌న‌సేన ఎన్నిక‌ల పోటీనే పెద్ద ప్ర‌హ‌స‌నం. అలాంటి ప్ర‌హ‌స‌నంలో ప‌వ‌న్ నుంచి హీరోయిజాన్ని ఎక్స్ పెక్ట్ చేయించి, క‌నీసం పొలిటిక‌ల్ గేమ్ అయినా ఆడాడ‌బ్బా.. అని చెప్పుకోద‌గిన ఉదంతాలు శూన్యం! జ‌న‌సేన పోటీకి చంద్ర‌బాబు కేటాయించిన వీర‌ముష్టి సీట్ల లోనే తెలుగుదేశం నుంచి నేత‌ల‌ను తెచ్చుకుని పోటీ చేయించుకుంటున్న దివాళాకోరుత‌నం మ‌ధ్య‌న ప‌వ‌న్ నుంచి రాజ‌కీయ చాణ‌క్యాన్ని ఎవ‌రు ఆశించ‌గ‌ల‌రు! 

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు జ‌న‌సేన‌, బీజేపీల‌కు సీట్ల‌ను కేటాయించిన‌ట్టే కేటాయించి.. ఆ పార్టీల త‌ర‌ఫు నుంచి త‌న మ‌నుషుల‌నే చాలా చోట్ల నిల‌బెడుతున్నారు! పొత్తు పేరుతో ఆ పార్టీల అభ్య‌ర్థుల‌నే పేరు పెట్టి చంద్ర‌బాబు నాయుడు చాలా చోట్ల త‌న మ‌నుషుల‌నే నిల‌బెడుతున్నారు! ఇప్ప‌టికే చంద్ర‌బాబు మ‌నుషులు బీజేపీ, జ‌న‌సేన‌ల అభ్య‌ర్థులుగా ఖ‌రారు కావ‌డంతో పాటు.. ఇప్పుడు అన‌ప‌ర్తి విష‌యంలో కూడా అదే జ‌రుగుతుందనే వార్త‌లు వ‌స్తున్నాయి!

మ‌రి ఇలా త‌న అవ‌స‌రానికి అనుగుణంగా త‌న పార్టీ వాళ్ల‌ను, త‌న మ‌నుషుల‌నే బీజేపీ, జ‌న‌సేన‌ల్లోకి పంపి వారినే అభ్య‌ర్థులుగా చేసుకుంటున్నారు చంద్ర‌బాబు. లెక్క తీస్తే.. ఇలాంటి ఈ జాబితా పెద్ద‌దే! మ‌రి .. చంద్ర‌బాబు ఇలాంటి క‌ళ‌ల‌ను క‌న‌బ‌రుస్తూ ఉన్నారు.

అయితే.. పార్టీ పెట్టి ప‌దేళ్లు అవుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం.. ఈ త‌ర‌హాలో ఒక్క‌రికంటే ఒక్క‌రికి కూడా టికెట్ ఇప్పించిన దాఖ‌లాలు లేవు! ప‌లు చోట్ల జ‌న‌సేన ఆశావ‌హులున్నా..ఒక్క‌రినంటే ఒక్క‌రిని చాక‌చ‌క్యంగానో మ‌రో ర‌కంగానో..  ఎక్క‌డైనా అలాంటి ఆశావ‌హుడికి అవ‌కాశం ఇప్పించ‌లేక‌పోయాడు ప‌వ‌న్ క‌ల్యాణ్. అయితే త‌న పార్టీ త‌ర‌ఫున టీడీపీ వాళ్ల‌ను పోటీ చేయించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇంత సీన్ ఎక్స్ పెక్ట్ చేయ‌డం కూడా అన‌వ‌స‌ర‌మేనేమో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?