Advertisement

Advertisement


Home > Movies - Movie News

త్రివిక్రమ్ బాహాటంగా మద్దతు ప్రకటించరా?

త్రివిక్రమ్ బాహాటంగా మద్దతు ప్రకటించరా?

దర్శకుడు త్రివిక్రమ్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గురుతుల్యులు. పవన్ ఎప్పుడూ చాలా గొప్పగా చెబుతుంటారు తివిక్రమ్ గురించి. పైగా పవన్ కు యజ్ఙోపవీతం వేసుకునేలా చేసింది త్రివిక్రమ్. పవన్ కు గుంటూరు శేషేంద్ర కవిత్వాన్ని పరిచయం చేసింది త్రివిక్రమ్.

ఒకరితో మరొకరి అనుబంధం చాలా గొప్పది. గిట్టని వాళ్లు మాత్రం పవన్ దగ్గర ఎవరినీ పర్మనెంట్ గా వుండకుండా చేసేది త్రివిక్రమ్ నే అంటాను. ఓ నటి తరచు త్రివిక్రమ్ నే ఈ విషయంలో సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ వుంటుంది .అది వేరే సంగతి.

గత అయిదేళ్లలో పవన్ కు సినిమా రంగం నుంచి మంచి రాబడి వచ్చేలా చేసింది త్రివిక్రమ్. పవన్ తరపున సినిమాల సంగతులు చక్కపెట్టేది త్రివిక్రమ్. ఇప్పుడు పవన్ జనసేన వెనుక, పవన్ పిఠాపురం పోటీ వెనుక త్రివిక్రమ్ అండ దండలు లేకుండా వున్నాయి అంటే ఎవరు నమ్మరు. అలాంటిది సినిమా జనాలు చాలా మంది పిఠాపురం క్యూ కడుతున్నారు. ఏదో రూపంలో పవన్ కు మద్దతు పలుకుతున్నారు.

కానీ త్రివిక్రమ్ మాత్రం పెదవి విప్పడం లేదు. విసెష్ చెప్పడం లేదు. రేపు ఏమన్నా చెబుతారా? త్రివిక్రమ్ అన్నీ సైలంట్ గా తెరవెనుకే నడిపిస్తారు. తెరమీదకు రారు ఎప్పుడూ. ఆయన వర్కింగ్ స్టయిల్ నే అంత. అందువల్ల ఇప్పుడు కూడా పవన్ తెర వెనుకే త్రివిక్రమ్ వుండిపోతారు. ముందుకు వస్తారని అనుకోవడానికి లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?