Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

ఏపీలో బాబుకు మ‌ద్ద‌తుగా ఐటీ ఉద్యోగులు ఎక్క‌డ‌?

ఏపీలో బాబుకు మ‌ద్ద‌తుగా ఐటీ ఉద్యోగులు ఎక్క‌డ‌?

ఈ నెల 20న చంద్ర‌బాబునాయుడు పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు వేడుక‌లు నిర్వ‌హించారు. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో టీడీపీ అనుకూల ఐటీ ఉద్యోగులు బాబు పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని త‌మ‌దైన రీతిలో ఘ‌నంగా నిర్వ‌హించారు. గ‌తంలో చంద్ర‌బాబు అరెస్టును నిర‌సిస్తూ టీడీపీ అనుకూల ఐటీ ఉద్యోగులు నిర్వ‌హించిన స‌భ గురించి అంద‌రికీ తెలిసిందే.

తాజా సైబ‌ర్ ట‌వ‌ర్స్ కూడ‌లిలో బాబుకు మ‌ద్ద‌తుగా ప్ల‌కార్డులు, బ్యాన‌ర్ల‌ను ప్ర‌ద‌ర్శించారు. అభిమాన నాయ‌కుడి పుట్టిన రోజు వేడుక‌ను నిర్వ‌హించ‌డంలో త‌ప్పు ప‌ట్టాల్సిందేమీ లేదు. అయితే ఏపీలో ఇలాంటి కార్య‌క్ర‌మాన్ని ఐటీ ఉద్యోగులెవ‌రూ ఎందుకు చేయ‌లేద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. 2014-19 మ‌ధ్య కాలంలో విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మొద‌టి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప‌ని చేశారు.

చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు వెల్లువెత్తాయ‌ని టీడీపీ నాయ‌కులు, ఆ పార్టీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తుంటుంది. మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగులు బాబు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని వేడుక నిర్వ‌హిస్తే, ఏపీలో ఆ ప‌ని ఉద్యోగులెవ‌రూ ఎందుకు చేయ‌లేద‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. బాబు హ‌యాంలో ఐటీ, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు ఏపీకి వ‌చ్చాయ‌నే ప్ర‌చారంలో నిజం లేద‌ని అనుకోవాల్సి వ‌స్తుంది.

ఒక‌వేళ ఏపీలో బాబు పుణ్యాన ఉద్యోగాలు పొందిన వాళ్లు వుంటే, ఎల్లో మీడియానే వారిని బ‌జారులోకి తీసుకొచ్చి, కేక్ క‌ట్ చేయించి, చూశారా అని తాటికాయంత అక్ష‌రాల‌తో బ్యాన‌ర్ హెడ్డింగ్‌ల‌ను పెట్టి క‌థ‌నాల్ని వండి వార్చేది. బాబు హ‌యాంలో ఏపీకి ఒరిగిందేమీ లేక‌పోవ‌డం వ‌ల్లే, ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ల్ని ఉద్యోగులు జ‌రుపుకునే ప‌రిస్థితి లేకుండా పోయింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?