ఇక్కడ కూడా కుల విభజన ఏంటి బాబు!

చంద్రబాబుకి ప్రజలు ఎప్పుడూ ప్రజల్లా కనపడరు, కులాల వారీగా మాత్రమే వారిని పరిగణిస్తుంటారు. కేవలం ప్రజలే కాదు, పార్టీ కార్యకర్తల్ని, నేతల్ని కూడా సామాజిక సమీకరణాల్లో భాగంగానే ఉపయోగిస్తుంటారు బాబు. పక్క పార్టీలో ఎవరైనా…

చంద్రబాబుకి ప్రజలు ఎప్పుడూ ప్రజల్లా కనపడరు, కులాల వారీగా మాత్రమే వారిని పరిగణిస్తుంటారు. కేవలం ప్రజలే కాదు, పార్టీ కార్యకర్తల్ని, నేతల్ని కూడా సామాజిక సమీకరణాల్లో భాగంగానే ఉపయోగిస్తుంటారు బాబు. పక్క పార్టీలో ఎవరైనా కామెంట్ చేస్తే, తిరిగి అదే కులానికి చెందిన వ్యక్తిని తమ పార్టీ నుంచి ప్రెస్ మీట్ కి రెడీ చేస్తారు. వైరిపక్షంలో ఎవరైనా తప్పు చేస్తే.. వారిని తిట్టించడానికి అదే సామాజిక వర్గ నేతలు తమ పార్టీ నుంచి రెడీ చేసి పెడతారు. మొన్న ఎన్నికల్లో కూడా జాతీయ స్థాయి నేతల్ని తీసుకొచ్చి కులాల లెక్కన విడగొట్టి ప్రచారానికి వాడుకున్న ఘనుడు బాబు.

ఇలాంటి స్ట్రాటజీని మరోసారి బైటకు తీశారు. సోషల్ మీడియా బాధితుల్లో చంద్రబాబు తన ప్రెస్ మీట్ లో స్టేజ్ పైకి పిలిచిన వారంతా బీసీలు, ఎస్సీ, మైనార్టీలే. వైసీపీని దృష్టిలో పెట్టుకుని ఒకరిద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని కూడా వాడుకున్నారు. సహజంగా సోషల్ మీడియాలో వైసీపీ సానుభూతిపరుల చేతిలో విపరీతంగా ట్రోల్ అయ్యేది కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. కానీ వారిని ఎక్కడా స్టేజ్ పైకి పిలవలేదు. అంటే వారిని బాధితుల్లా బైటపెట్టడం బాబుకే ఇష్టం లేదన్నమాట.

కేవలం బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలే తాము బాధితులమంటూ జనం ముందుకు రావాలి, టీడీపీ తరపున పోరాటాలు చేయడానికి పావులుగా మారాలి. అదే సమయంలో కమ్మ సామాజిక వర్గాన్ని మాత్రం బైటకు రానీయడం లేదు. బీసీలను అనరాని మాటలన్నారంటూ పంచుమర్తి అనురాధపై పెట్టిన కామెంట్లను చూపిస్తున్నారు చంద్రబాబు. ఆమెను పక్కనే పెట్టుకుని 2-3 బూతులు కూడా మాట్లాడి తన స్థాయి తగ్గించుకున్నారు. అది వేరే సంగతి. ఆ కామెంట్లు పెట్టినోళ్లు దుర్మార్గులే అనుకుందాం. మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని, మందు పార్టీగా అభివర్ణించిన అనురాధని ఏమనాలి. పార్టీ అధికార ప్రతినిధి అనే స్థాయి మరిచి కేవలం మందు తాగడం కోసమే ముఖ్యమంత్రులు కలిశారంటూ లేకిగా మాట్లాడిన ఆమెపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

గురివింద గింజ సామెత లాగా.. తాము మాట్లాడిన మాటలు పక్కనపెట్టి, తమపై వచ్చిన కామెంట్లను మాత్రమే చూపించి సింపతీ కొట్టేయాలని చూస్తున్నారు బాబు, ఆయన శిష్యబృందం. పోనీ బీసీలంటే బాబుకి ఎక్కడలేని ప్రేమ ఉందనుకుందాం. మరి బీసీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని, రైతుల ముసుగులో కులం పేరుతో నానా మాటలన్న టీడీపీ కార్యకర్తని ఏం చేయాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్ని క్లిప్పింగ్ లు చూపించిన చంద్రబాబు, అనిల్ కుమార్ యాదవ్ విషయాన్ని కూడా ప్రస్తావించాలి కదా.

రెండు పార్టీల వారి తప్పు ఒప్పుల్ని చూపించి.. ఇకపై ఇలాంటివి ఏ పార్టీ కూడా ప్రోత్సహించకూడదు, ఎవర్నీ, ఎవరూ ఇంత దారుణంగా కామెంట్లు చేసుకోకూడదు అని ఓ స్టేట్ మెంట్ ఇచ్చి ఉంటే చంద్రబాబుపై ప్రజల్లో గౌరవం పెరిగి ఉండేది. అలా చేస్తే ఆయన బాబు ఎందుకవుతారు, అందుకే వన్ సైడ్ గేమ్ ఆడారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అందులోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను తెరపైకి తెచ్చి బాధితులంటూ బిల్డప్ ఇచ్చారు. కులాల విషయంలో చంద్రబాబు వ్యవహారశైలి ఎలా ఉంటుందో తాజా ఘటనతో మరోసారి రుజువైంది. 

నరసింహారెడ్డి ఘన కీర్తిని తెలియజేసేలా..